బాలీవుడ్ నటులు టాలీవుడ్ లో హ్యాపీయేనా?
ఒకప్పుడు పేరున్న బాలీవుడ్ నటులు దక్షిణాది చిత్రాల్లో నటించడానికి పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు.;
ఒకప్పుడు పేరున్న బాలీవుడ్ నటులు దక్షిణాది చిత్రాల్లో నటించడానికి పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు. స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్రల్లో అవకాశాలు వచ్చినా నిర్మొహ మాటంగా తిరస్కరించేవారు. ఈ తిరస్కరణలు ఎక్కు వగా కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలు చూసాయి. శాండిల్ వుడ్, మాలీవుడ్ చిన్న పరిశ్రమలు కావడంతో? వాటికిఅంత హైప్ ఉండేది కాదు. బాలీవుడ్ తర్వాత అగ్రగామి పరిశ్రమలు ఏవి అంటే తమిళ, తెలుగు పరిశ్రమలే కనిపించేవి. దీంతో బాలీవుడ్ నటులు సొంత ఇండస్ట్రీని దాటి బయటకు వచ్చేవారు కాదు. హిందీ సినిమాలు తప్ప ఇతర భాషల్లో ఛాన్సులంటే నో చెప్పేవారు.
ఇప్పుడా నటులు సౌత్ సినిమాల్లో నటించడానికి ఎంతగా ఆసక్తి చూపిస్తున్నారో తెలిసిందే. ప్రత్యేకించి తెలుగు సినిమా అవకాశాల కోసం వాళ్ల మధ్యనే ఏర్పడింది. తెలుగు, కన్నడ పరిశ్రమలు పాన్ ఇండియాలో సత్తా చాట డంతో? ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ ఇటువైపు చూస్తున్నారు. సంజయ్ దత్, ఇమ్రాన్ హష్మీ, బాబి డియోల్, నవాజుద్ఈన్ సిద్దీఖీ లాంటి ఫేమస్ బాలీవుడ్ నటులు ఇప్పటికే సౌత్ సినిమాల్లో కనిపించిన సంగతి తెలిసిందే. అమితాబచ్చన్ కూడా ఓ రెండు తెలుగు సినిమాల్లో గెస్ట్ అపిరియన్స్ ఇచ్చారు.
అలాగే సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లాంటి నటులు కూడా అతిది పాత్రల్లో అలరించారు. సూపర్ స్టార్లు అందర్నీ పక్కన బెడితే విలన్ పాత్రలు పోషించిన సంజయ్ దత్, ఇమ్రాన్ హష్మీ, బాబి డియోల్ లాంటి వారు సౌత్ అవకాశాల పట్ల సంతోషంగానే ఉన్నారా? అన్న సందేహం తెరపైకి వస్తోంది. ఇటీవలే బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి హిందీలో ఫేమస్ అయిన నటులకు దక్షిణాది చిత్రాల్లో విలన్ గా నటించడం ఎంత మాత్రం నచ్చడం లేదన్నారు. తమ నటుల పాత్రలు ఎంత మాత్రం బలంగా ఉండటం లేదన్నారు. హీరో ఒక్క దెబ్బకే మా నటులు పడిపోవడం ఏంటి? ఇది మరీ సిల్లీగా ఉందంటూ అసంతృప్తిని వ్యక్తం చేసారు.
అలాంటి నటులకు రెండు పరిశ్రమల్లోనూ సముచిత స్థానం దక్కలేదు? అన్నది సునీల్ శెట్టి అభిప్రాయంగా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఈ డౌట్ రెయిజ్ అవుతుంది. ఇప్పటికే సౌత్ సినిమాలు చేసిన హిందీ నటులంతా మనస్పూర్తిగా ఇష్టపడే పని చేసారా? లేక కేవలం అధిక పారితోషికం వస్తుందనే ఆశతో పని చేసారా? అంటూ కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరి వీటన్నింటికి సమాధానం దొరకాలంటే తెలుగు సినిమాలు చేసిన ఆ హిందీ నటులు స్పందిస్తే తప్ప క్లారిటీ రాదు.