ఓటీటీలో సత్తా చాటలేకపోయిన బిందియా కే బాహుబలి.. స్టార్ కాస్ట్ ఉన్నా తప్పని నిరాశ!
కొన్ని కథలు మనసుకు హత్తుకునేలా ఉంటాయి. అందులో నటించిన వారు అంత ఫేమస్ కానీ వారు అయినా సరే ప్రేక్షకాదరణ పొందుతాయి.;
కొన్ని కథలు మనసుకు హత్తుకునేలా ఉంటాయి. అందులో నటించిన వారు అంత ఫేమస్ కానీ వారు అయినా సరే ప్రేక్షకాదరణ పొందుతాయి.కానీ కొన్ని కథలు మాత్రం ఎంత పెద్ద తారాగణాన్ని పెట్టి తీసినా కూడా అందులో మ్యాటర్ లేకపోతే ప్రేక్షకులు చూడరు.అయితే ఓటీటిలో విడుదలైన 'బిందియా కే బాహుబలి' టీవీ సిరీస్ పట్ల ప్రేక్షకులు ఇలాంటి మాటలే మాట్లాడుకుంటున్నారు. ఆగస్టు 8న అమెజాన్, ఎంఎక్స్ ప్లేయర్ లో బిందియా కే బాహుబలి అనే సిరీస్ విడుదలైంది.అయితే ఓటీటీలో విడుదలైన ఈ సిరీస్ పట్ల ప్రేక్షకులు అంత ఆసక్తిగా లేరు.
అయితే ఈ వెబ్ సిరీస్ లో భారీ తారాగణం ఉన్నప్పటికీ ప్రేక్షకుల్లో ఈ సిరీస్ కి ఆదరణ తక్కువైంది. దాంతో ఈ సిరీస్ డిజాస్టర్ దిశగా అడుగులు వేస్తోంది. బిందియా కే బాహుబలి సిరీస్ కథ ఏంటంటే..ఒక మాఫియా డాన్ తన రాజకీయ ప్రచారంలో అరెస్ట్ అయిన సమయంలో మామ, కొడుకు, ప్రత్యర్థి ముఠాల మధ్య ఆధిపత్యం అనేది మొదలవుతుంది. ఈ నేపథ్యంలోనే కథ ఎలా కొనసాగుతుంది? అనే అంశం గురించి దర్శకుడు ఈ సిరీస్ లో చూపించారు. డైరెక్టర్ రాజ్ అమిత్ కుమార్ తీసిన ఈ సిరీస్ పట్ల కొంతమంది పాజిటివ్ రివ్యూలు ఇస్తే మరి కొంతమంది నెగటివ్ రివ్యూలు ఇస్తున్నారు.
ముఖ్యంగా ఈ సిరీస్ ని రీసెంట్ గా వచ్చిన గ్రామ చికిత్సాలయ్, పంచాయిత్ , మీర్జాపూర్ , పాతాళ లోక్ వంటి గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన సిరీస్ లతో పోలుస్తున్నారు.
కానీ మరి కొంత మందేమో మీర్జాపూర్,పంచాయత్ వంటి సీరీస్ లతో పోల్చే స్థాయి బిందియా కే బాహుబలి సిరీస్ కి లేదు అని నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ సిరీస్ లోని సన్నివేశాలు చాలా సరికొత్తగా తీసినప్పటికీ ఈ సిరీస్ పట్ల ప్రేక్షకులు అంత ఆసక్తిగా లేరని తెలుస్తోంది. అయితే బిందియా కే బాహుబలి సిరీస్ కి IMDB, ఇతర ప్లాట్ ఫామ్ లలో మంచి రివ్యూ అండ్ రేటింగ్ లు ఇచ్చారు..
ఈ సిరీస్ లో నటించిన రణ్వీర్ షోరే, సౌరబ్ శుక్లా, షీబా చద్దా, సీమ బిస్వాస్ వంటి నటీనటుల యాక్టింగ్ అద్భుతంగా ఉంది అని ప్రశంసలు కురిపిస్తున్నారు. కానీ ఎక్కువ శాతం మంది బిందియా కే బాహుబలి సిరీస్ నచ్చలేదని అంటున్నారు. మరి రాబోయే ఎపిసోడ్లు అయినా మరింత ఆసక్తిగా తీసుకువస్తారా అనేది చూడాలి.విమర్శకులను ఆకర్షించడంలో ఫెయిల్ అయిన బిందియా కే బాహుబలి సిరీస్ ఓటీటీలో డిజాస్టర్ అని చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరి ఈ సిరీస్ నుండి రాబోయే ఎపిసోడ్ లు ఏ విధంగా ఉంటాయి అనేది వేచి చూడాలి.