బిగ్ బాస్ 9.. ఫేక్ పిల్ల.. ఏజ్ కి తగ్గట్టు మాట్లాడు..!

నామినేషన్స్ విషయంలో ఎవరు ఎక్కడ తగ్గకూడదని ఫిక్స్ అయ్యారు. ఐతే ఈ వారం నామినేషన్స్ అంతా హాట్ హాట్ గా సాగాయి.;

Update: 2025-10-21 06:15 GMT

బిగ్ బాస్ హౌస్ లో ప్రతి మండే నామినేషన్స్ ఫైట్ కామనే. ఐతే ఈసారి నామినేషన్స్ లో వేడి తగ్గింది అనుకుంటున్న టైంలో ఈ వారం నామినేషన్స్ లో ఫైర్ చూపించి ఆడియన్స్ కు మంచి స్టఫ్ ఇచ్చారు కంటెస్టెంట్స్. నామినేషన్స్ విషయంలో ఎవరు ఎక్కడ తగ్గకూడదని ఫిక్స్ అయ్యారు. ఐతే ఈ వారం నామినేషన్స్ అంతా హాట్ హాట్ గా సాగాయి. ముఖ్యంగా తనూజ వర్సెస్ రమ్య, రీతు వర్సెస్ అయేషా మధ్య మాటల యుద్ధం నడిచింది.

తనూజ వైల్డ్ ఫైర్ రేంజ్ లో..

రమ్య ఐతే తనూజ మీద మాటలతో ఎటాక్ చేసింది.. ఫేక్ పిల్ల.. ఒకరు పోతే మరొకరిని వెతుక్కున్నావ్.. టాస్కులు ఆడవ్ అంటూ తనూజ గురించి మాట్లాడింది. ఐతే తనూజ కూడా అదే రేంజ్ లో సమాధానం ఇచ్చింది. నువ్వు బ్యాక్ బిచ్చింగ్ వెనక మాటలు ఆపు.. ఏదైనా ఉంటే స్ట్రైట్ గా వాళ్లకి చెప్పాలి ఇలా వెనక మాట్లాడటం కాదు. ఏజ్ కి తగ్గట్టు మాట్లాడంటూ తనూజ వైల్డ్ ఫైర్ రేంజ్ లో రిప్లై ఇచ్చింది. రమ్య తనూజ మీద అంత ఫైర్ అవ్వడానికి రీజన్ హైపర్ ఆది వచ్చి తనూజ టాప్ 5 పక్కా అని అన్నాడు.. అందుకే ఆమెను ఎటాక్ చేస్తే తను కూడా ఉంటానని రమ్య భావిస్తుంది. ఐతే రమ్యకు ఆల్రెడీ లాస్ట్ వీకెండ్ నాగార్జున మాట్లాడే ముందు మాటలు జాగ్రత్తగా వాడాలని అన్నాడు. కానీ నిన్న నామినేషన్స్ లో కూడా రమ్య తనూజ మీద కాస్త అతిగా రియాక్ట్ అయ్యింది.

ఇక మరోపక్క రీతు వర్సెస్ అయేషా.. ముందు నుంచి రీతునే టార్గెట్ పెట్టుకున్న అయేషా ఆమెను టార్గెట్ చేస్తూ మాట్లాడింది. రీతు కూడా అంతకు అంత సమాధానం చెప్పింది. రీతు హౌస్ లో లవ్ ట్రాక్ నడిపిస్తుందని అది తప్ప ఆమె ఏమి చేయట్లేదని అయేషా నామినేషన్స్ లో చెప్పింది. ఇద్దరి మధ్య చాలాసేపు వాదులాట జరిగింది.

తనూజ వర్సెస్ ఇమ్మాన్యుయెల్..

కళ్యాణ్ సంజనని నామినేట్ చేశాడు. ఐతే అది ఇమ్మాన్యుయెల్ కి నచ్చలేదు. ఎందుకంటే ఈసారి నామినేషన్స్ ఇమ్మాన్యుయెల్, అయేషాకు దొరికిన స్లిప్ ల ద్వారా వాళ్లు ఎవరికైతే ఇస్తారో వాళ్లు నామినేషన్స్ చేస్తారు. సో అలా కళ్యాణ్ తనూజని నామినేట్ చేస్తా అని చెప్పి సంజనని నామినేట్ చేశాడు. అది కూడా బలమైన రీజన్స్ ఏమి చెప్పలేదు. హౌస్ లో తనూజ వర్సెస్ ఇమ్మాన్యుయెల్ కూడా మాటల యుద్ధం జరిగింది. తనూజ టాప్ లో ఉందని ఇమ్మాన్యుయెల్ కూడా ఎటాకింగ్ మొదలు పెట్టాడని అనిపిస్తుంది.

మొత్తానికి హౌస్ లో ఆరు వారాల తర్వాత 7వ వారం నామినేషన్స్ లో అందరి ఒరిజినాలిటీ ఏంటన్నది రివీలైంది. ఇక ఈ వారం నామినేషన్స్ లో ఫైనల్ గా తనూజ, రమ్య, కళ్యాణ్, రాము, దివ్య, సంజన, శ్రీనివాస్ సాయి ఉన్నారు. వీరిలో ఒకరు సండే హౌస్ నుంచి బయటకు వస్తారు.

Tags:    

Similar News