"రోహిత్ ని గెలుకుతూనే ఉంటాను" అంటున్న త్రిగుణ్!
తాజా ఎపిసోడ్ లో త్రిగుణ్ తోటి సెలెబ్రిటీలతో కూర్చుని, రోహిత్ మిగిలిన వాళ్ళని తొక్కి పైకొస్తాడు అని చెప్తూ, ఈ క్రమం లో ఎలాగైనా సరే అతన్ని ఇంకా ఇబ్బంది పెడతా అని క్లియర్ గా చెప్పాడు.
బిగ్‌బాస్ హౌస్‌లో త్రిగుణ్ ఏకైక లక్ష్యం రోహిత్‌ను ఎలాగైనా కార్నర్ చేయడమే అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఇది రోహిత్‌పై ఉన్న వ్యక్తిగత ద్వేషమా లేక హౌస్‌లో మంచి పాజిటివ్ ఇమేజ్ ఉన్న బలమైన కంటెస్టెంట్‌ను ఢీకొట్టి స్క్రీన్ స్పేస్ కొట్టేయాలనే వ్యూహమా అన్నది పక్కన పెడితే... సోషల్ మీడియాలో మాత్రం త్రిగుణ్ విపరీతమైన నెగెటివిటీని మూటగట్టుకుంటున్నాడు. అయితేనేం, బిగ్‌బాస్‌కి కావాల్సిన హై-వోల్టేజ్ డ్రామాను పుష్కలంగా అందిస్తున్నాడు కాబట్టి, అతని అభిమానులు మాత్రం అతన్ని వెనకేసుకొస్తున్నారు.
తాజా ఎపిసోడ్ లో త్రిగుణ్ తోటి సెలెబ్రిటీలతో కూర్చుని, రోహిత్ మిగిలిన వాళ్ళని తొక్కి పైకొస్తాడు అని చెప్తూ, ఈ క్రమం లో ఎలాగైనా సరే అతన్ని ఇంకా ఇబ్బంది పెడతా అని క్లియర్ గా చెప్పాడు. ఏం జరిగిన సరే, రోహిత్ ని మాత్రం గెలుకుతూనే ఉంటాను అని చెప్పినప్పుడు, పక్కనే ఉన్న వర్షిణి, కృష్ణుడు కూడా వత్తాసు పలికారు.
ఇంకో కోణం లో చూస్తుంటే, షో లో విన్నర్ ఒకరే ఉంటారు కాబట్టి, స్ట్రాంగ్ అనుకున్న వాళ్ళని టార్గెట్ చేయక పోతే గెలవడం కష్టం అని తెలుస్తుంది. కానీ, త్రిగుణ్ చేస్తున్న పద్ధతే తీవ్ర అభ్యంతరకరంగా ఉంది. ఇంటి పనులకు సంబంధించి రోహిత్ వైపు నుంచి వచ్చిన చిన్నపాటి కమ్యూనికేషన్ గ్యాప్‌ను డైరెక్ట్‌గా కూర్చుని పరిష్కరించుకోవాల్సింది పోయి, రచ్చ చేసి మిగతా సెలబ్రిటీలందరినీ రోహిత్‌పైకి ఉసిగొల్పాడు. సంబంధం లేని విషయాల్లో కూడా ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్లి రోహిత్ గురించి విషం చిమ్మడం అసలు సమర్థనీయం కాదు.
లేటెస్ట్ ఎపిసోడ్ లో గిన్నెలు తోమాలని పిలిచి అతన్ని అనవసరంగా రెచ్చగొట్టి, “నువ్వు ప్రీచింగ్ చేస్తావ్ కానీ పాటించవు” అని చెప్పి రోహిత్ ని నానా మాటలు అన్నాడు. బలమైన ప్రత్యర్థిని టార్గెట్ చేసి గేమ్ ఆడటంలో తప్పులేదు, కానీ త్రిగుణ్ దిగజారుతున్న తీరే ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తోంది. అయితే విశ్లేషకులు మాత్రం ఈ వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున గట్టిగానే క్లాస్ పీకాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అభిప్రాయపడుతున్నారు.