బిగ్ బాస్ 9.. ఇమ్మాన్యుయెల్ వెనకపడ్డాడెందుకు..?
హౌస్ లో ఇమ్మాన్యుయెల్ ఆల్ రౌండర్ ప్రతిభ చూపిస్తూ వచ్చాడు. ఈ సీజన్ లో అతను ఆడిన టాస్క్ లు ఎవరు ఆడి గెలవలేదు. కానీ ఇమ్మాన్యుయెల్ ఎందుకో వెనకపడ్డాడు.;
బిగ్ బాస్ సీజన్ 9లో ఫైనల్ వీక్ కి టాప్ 5 ఎవరో తెలిసిపోయింది. సీజన్ 9లో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసి అందరినీ మెప్పించి టాప్ 5కి చేరుకున్నారు హౌస్ మేట్స్. కళ్యాణ్ టికెట్ టు ఫినాలే గెలిచి మొదటి ఫైనలిస్ట్ అవ్వగా గత వారం టాస్క్ లతో పాటు ఆడియన్స్ ఓటింగ్ తో తనూజ సెకండ్ ఫైనలిస్ట్, థర్డ్ డీమాన్ పవన్, ఫోర్త్ ఇమ్మాన్యుయెల్, ఫిఫ్త్ లో సంజనా గర్లాని ఫైనలిస్ట్ గా ఛాన్స్ దక్కించుకున్నారు.
ఇమ్మాన్యుయెల్ ఆల్ రౌండర్ ప్రతిభ..
ఐతే ఈ ఫైనలిస్ట్ రివీల్ లో డీమాన్ పవన్ ఇమ్మాన్యుయెల్ కన్నా ముందు వెళ్లడం ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసింది. ఒక దశలో ఇమ్మాన్యుయెల్ బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అన్నట్టుగా హంగామా నడిచింది. హౌస్ లో ఇమ్మాన్యుయెల్ ఆల్ రౌండర్ ప్రతిభ చూపిస్తూ వచ్చాడు. ఈ సీజన్ లో అతను ఆడిన టాస్క్ లు ఎవరు ఆడి గెలవలేదు. కానీ ఇమ్మాన్యుయెల్ ఎందుకో వెనకపడ్డాడు.
సీజన్ 9లో ఫైనల్ కంటెస్టెంట్స్ అదే టాప్ 5 ని అనౌన్స్ చేసే క్రమంలో తనూజ ఫస్ట్ ఆ తర్వాత డీమాన్ పవన్ ఫైనలిస్ట్ గా అనౌన్స్ చేశారు. ఆ తర్వాత ఇమ్మాన్యుయెల్ వచ్చాడు. ఇక చివరగా భరణి, సంజనా ఇద్దరిలో భరణిని ఎలిమినేట్ చేసి సంజనాని కూడా ఫైనలిస్ట్ గా అనౌన్స్ చేశారు. ఇమ్మాన్యుయెల్ ఫస్ట్ సేవ్ అయ్యి సెకండ్ ఫైనలిస్ట్ అవుతాడని అనుకుంటే తనూజ వచ్చింది. పోనీ తనూజ తర్వాత అయినా థర్డ్ ప్లేస్ అతను అనుకుంటే సడెన్ గా డీమాన్ పవన్ దూసుకొచ్చాడు.
డీమాన్ మొత్తం ఓపెన్ అయ్యి ఒక మంచి కంటెస్టెంట్ గా..
సో టైటిల్ రేసులో ఉన్నాడని అనుకున్న ఇమ్మాన్యుయెల్ ఓటింగ్ స్లోగా పడిపోతుందని తెలుస్తుంది. ఇక ఈ వారం సీజన్ 9 విన్నర్ ని డిసైడ్ చేసే ఓటింగ్. అనూహ్యంగా లాస్ట్ వీక్ డీమాన్ మొత్తం ఓపెన్ అయ్యి ఒక మంచి కంటెస్టెంట్ గా క్రేజ్ తెచ్చుకున్నాడు. టైటిల్ రేసులో అతను లేడని అందరు అనుకుంటున్నా ఏమో చెప్పలేం అతను రన్నరప్ గా దూసుకొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అనిపిస్తుంది. ఏది ఏమైనా డీమాన్ పవన్ ఇదే దూకుడు మొదటి నుంచి చూపించినట్లైతే ఈ సీజన్ టైటిల్ రేసులో అతను ఉండే వాడని ఆడియన్స్ అనుకుంటున్నారు.
ఇక టైటిల్ విన్నర్ అనుకున్న ఇమ్మాన్యుయెల్ కాస్త వెనకపడుతున్నట్టు అనిపిస్తుంది. ఐతే ఈ వారం ఎలాగు టాస్క్ లు ఉండవు కాబట్టి సీజన్ 9 విన్నర్ గా ఒక ఆల్ రౌండర్, కమెడియన్ ని చూడాలని ఆడియన్స్ భావిస్తే అతనికి ఓట్లు వేస్తారు. ఇమ్మాన్యుయెల్, తనూజ, కళ్యాణ్ మధ్యలోనే టైటిల్ విన్నర్ ఒకరు అవుతారని గత ఐదారు వారాల నుంచి వినిపిస్తున్న మాటే. కానీ సడెన్ గా రేసులోకి డీమాన్ పవన్ కూడా వచ్చాడు. ఇప్పుడు ఎవరి స్థానానికి డీమాన్ ఎసరు పెడతాడు అన్నది ఫైనల్ ఎపిసోడ్ లోనే తెలుస్తుంది.