బిగ్‌బాస్ హౌస్‌లో వర్షిణి తీవ్ర పరిణామాలు ఎదుర్కోనుందా?
అందరూ తమ ఆట తాము ఆడుతుంటే, యాంకర్ వర్షిణి మాత్రం బిగ్‌బాస్ హౌస్‌లో తనదైన సైలెంట్ రొమాంటిక్ యాంగిల్‌ను ప్రదర్శిస్తోంది.
యువతను ఆకట్టుకునే లక్ష్యంతో ప్రారంభమైన బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో సీరియల్ నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, యాంకర్లతో కలిపి మొత్తం 16 మంది కంటెస్టెంట్లు అడుగు పెట్టారు. అయితే మొదటి వారంలోనే మిడ్ వీక్ ఎలిమినేషన్ అని కంగారు పెట్టి, ఆ తర్వాత మళ్ళీ వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ ని బిగ్ బాస్ ఇంట్లోకి దింపాడు. అయితే వర్షిణి టాప్ ప్లేయర్ గా ఎదుగుతుంది అని ఆశిస్తే, ఆమె నుండి నిరాశే ఎదురౌతుంది.
అందరూ తమ ఆట తాము ఆడుతుంటే, యాంకర్ వర్షిణి మాత్రం బిగ్‌బాస్ హౌస్‌లో తనదైన సైలెంట్ రొమాంటిక్ యాంగిల్‌ను ప్రదర్శిస్తోంది. టాస్క్‌ల సమయాల్లో తప్ప మిగతా సమయంలో ముఖేష్ గౌడతో కలిసి తిరగడం, పార్కులో పక్కపక్కనే కూర్చుని లవర్స్ లాగా మాట్లాడుకోవడం చూస్తుంటే వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అవుతున్నట్లు నెటిజన్లు భావిస్తున్నారు.
మిగతా కంటెస్టెంట్లతో పోలిస్తే బుల్లితెర ప్రేక్షకులకు వర్షిణి ముందే పరిచయం ఉండటంతో ఆమెపైనే అందరి ఫోకస్ ఎక్కువగా ఉంది. హౌస్‌లో వర్షిణి ప్రదర్శన పెద్దగా లేకపోయినా, ఆమె గ్లామర్ కుర్రకారును ఆకట్టుకుంటుంది అని, అందుకే నామినేషన్లలో లేకపోయినా ఆమెను ఓట్లు వేసి సేవ్ చేస్తున్నారనే కామెంట్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
అయితే, గేమ్‌లు మరియు టాస్క్‌ల పరంగా ఎలాంటి ఎఫర్ట్ పెట్టకుండా కేవలం గ్లామర్‌తోనే నెట్టుకొస్తోందనే విమర్శలు కూడా ఉన్నాయి. మిగతా లేడీ కంటెస్టెంట్లు ప్రతి గేమ్‌లోనూ పురుషులతో సమానంగా పోటీ పడుతుంటే, వర్షిణి మాత్రం రిస్క్ తీసుకోకుండా మేనేజ్ చేస్తోందని నెటిజన్లు అంటున్నారు.
అయితే మూడు వారాలుగా సాగుతున్న ఈ షోలో చాలా మంది కంటెస్టెంట్ల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. చివరి వరకు సర్వైవ్ అవగలమా లేదా అని కొందరు భయపడుతుండగా, వర్షిణి కూడా వారిలో ఒకరిగా కనిపిస్తోంది. అయితే తాజాగా వర్షిణి చేసిన ఒక పని తీవ్ర పరిణామాలపై దారి తీసే అవకాశం ఉంది. ఎవరి దగ్గర ఏ స్పెషల్ పవర్ ఉందన్న విషయం ఇంకో కంటెస్టెంట్ తో చర్చించద్దు అని బిగ్ బాస్ క్లారిటీగా చెప్పారు. అయినప్పటికీ తన దగ్గర ఉన్న పవర్ గురించి త్రిగుణ్ తో వర్షిణి మాట్లాడటం తీవ్ర పరిణామాలపై దారి తీయచ్చు. అది ఎలిమినేషన్ కూడా అవ్వచ్చని చెప్తున్నారు కొందరు. ఈ వీకెండ్ వస్తే కానీ ఏ విషయమో తేలే అవకాశం లేదు.