అన్నపూర్ణ స్టూడియో నుంచి షిఫ్ట్ అవుతున్న బిగ్ బాస్..?
బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ హిందీతో పాటు సౌత్ భాషలన్నిటిలో వస్తుంది. బిగ్ బాస్ తెలుగులో ప్రస్తుతం సీజన్ 9 కొనసాగుతుంది.;
బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ హిందీతో పాటు సౌత్ భాషలన్నిటిలో వస్తుంది. బిగ్ బాస్ తెలుగులో ప్రస్తుతం సీజన్ 9 కొనసాగుతుంది. ఐతే సీజన్ 1 ఎన్టీఆర్ హోస్ట్ గా చేయగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 నాని హోస్ట్ గా చేశాడు. ఇక సీజన్ 3 నుంచి ప్రస్తుతం వస్తున్న సీజన్ 9 వరకు మన కింగ్ నాగార్జున హోస్ట్ గా కొనసాగుతున్నారు. దాదాపు 6 సీజన్స్ నుంచి నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ లవర్స్ ని అలరిస్తున్నారు. ఐతే బిగ్ బాస్ నాగార్జున హోస్ట్ గా చేయడానికి మరో రీజన్ ఆ హౌస్ సెట్ అన్నపూర్ణ స్టూడియోస్ లో ఉండటమే.
అన్నపూర్ణ స్టూడియోస్ లో బిగ్ బాస్ సెట్,,
సిటీ సెంటర్ లో అన్నపూర్ణ స్టూడియోస్ లో బిగ్ బాస్ తెలుగు సెట్ ఉంటుంది. సీజన్ 3 నుంచి ఇక్కడే హౌస్ నిర్మించడం.. నాగార్జున హోస్ట్ చేయడం జరుగుతుంది. ఐతే బిగ్ బాస్ సీజన్ 10 మాత్రం అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి బయటకు వెళ్తున్నట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ రియాలిటీ షోని ఎండిమోల్ సంస్థ నిర్వహిస్తుంది. ఐతే సీజన్ 9తో అన్నపూర్ణ స్టూడియోస్ తో వాళ్ల అగ్రిమెంట్ పూర్తవుతుందట.
అందుకే సీజన్ 10ని వారి కొత్త వెన్యూలో సొంతంగా బిగ్ బాస్ హౌస్ నిర్మించి అక్కడ షో రన్ చేసే ప్లాన్ చేస్తున్నారట. సో బిగ్ బాస్ సీజన్ 10 మాత్రం అన్నపూర్ణ స్టూడియోలో ఉండే ఛాన్స్ లేదు. అంతేకాదు బిగ్ బాస్ సీజన్ 10 కింగ్ నాగార్జున హోస్ట్ గా చేసే అవకాశం కూడా లేకపోవచ్చని టాక్. సీజన్ 3 నుంచి సీజన్ 9 వరకు కొనసాగించిన నాగార్జున బిగ్ బాస్ హోస్ట్ గా గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నాయట.
సిటీకి దూరంగా ఎండిమోల్ కొత్త స్టూడియో..
నాగార్జున ప్లేస్ లో మరో కొత్త హోస్ట్ ని తీసుకొచ్చే ప్లానింగ్ లో ఉన్నారట ఎండిమోల్ టీం. ఐతే ప్రతి సీజన్ కి ఇలానే అంటున్నా కూడా ఈసారి బిగ్ బాస్ హౌస్ సెటప్ కూడా మార్చేస్తున్నారు కాబట్టి తప్పకుండా హోస్ట్ కూడా మారే అవకాశాలు కచ్చితంగా ఉన్నాయనిపిస్తుంది. మరి బిగ్ బాస్ సీజన్ 10 నిజంగానే ఇన్ని మార్పులు ఉంటాయా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
బిగ్ బాస్ షో అన్నపూర్ణ స్టూడియోస్ లో షూట్ చేయడం వల్ల అక్కడ నుంచి ఎక్కువగా లీక్స్ వస్తున్నాయి. బిగ్ బాస్ సీజన్ 1 పూణెలో చేశారు. సండే రోజు ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అన్నది షోలో వచ్చే దాకా ఎవరికీ తెలిసేది కాదు. కానీ ఎప్పుడైతే సీజన్ 2 అన్నపూర్ణ స్టూడియోస్ కి షిఫ్ట్ చేశారో అప్పటి నుంచి బిగ్ బాస్ లీక్స్ బాగా అవుతున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ లో కాకుండా సిటీకి దూరంగా ఎండిమోల్ కొత్త స్టూడియో ఏర్పాటు చేసి అక్కడ బిగ్ బాస్ హౌస్ వేసి నెక్స్ట్ సీజన్ ని రెడీ చేయాలని చూస్తున్నారట. సో బిగ్ బాస్ ఆడియన్స్ కు నెక్స్ట్ సీజన్ కచ్చితంగా కొత్త ఎక్స్ పీరియన్స్ ఇచ్చే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.