రెడ్ కార్డ్ ఎలిమినేషన్.. 90 రోజుల రెమ్యునరేషన్ కట్..?
బిగ్ బాస్ సీజన్ 9 పూర్తైంది కదా మళ్లీ ఈ ఎలిమినేషన్ ఏంటి అనుకోవచ్చు. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు పూర్తైంది కానీ బిగ్ బాస్ తమిళ్ సీజన్ 9 కొనసాగుతుంది.;
బిగ్ బాస్ సీజన్ 9 పూర్తైంది కదా మళ్లీ ఈ ఎలిమినేషన్ ఏంటి అనుకోవచ్చు. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు పూర్తైంది కానీ బిగ్ బాస్ తమిళ్ సీజన్ 9 కొనసాగుతుంది. తమిళ్ బిగ్ బాస్ మరో 3 వారాల్లో పూర్తి కాబోతుంది. ఐతే ఈ వీకెండ్ బిగ్ బాస్ తమిళ్ లో టికెట్ టు ఫినాలే టాస్క్ లో భాగంగా జరిగిన కార్ టాస్క్ లో ఇద్దరు హౌస్ మేట్స్ చేసిన అతికి ఏకంగా వాళ్లకి రెడ్ కార్డ్ చూపించి హౌస్ నుంచి బయటకు పంపించేశారు విజయ్ సేతుపతి.
వీజే పార్వతి, కమరుద్దిన్..
బిగ్ బాస్ తమిళ్ లో వీజే పార్వతి, కమరుద్దిన్ చేస్తున్న అతి తెలిసిందే. ఇద్దరు కెమెరాలు లేని చోటుకి వెళ్లడం.. ఇద్దరు కలిసి వాష్ రూం లో స్పెండ్ చేయడం లాంటివి చేస్తున్నారు. వీళ్లు చేస్తున్న పనులు మిగతా హౌస్ మేట్స్ కి కాస్త ఇబ్బందికరంగా ఉంది. బిగ్ బాస్ ఇప్పటికే చాలాసార్లు వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఇదిలాఉంటే బిగ్ బాస్ సీజన్ 9 లో గత వారం జరిగిన కార్ టాస్క్ లో వీజే పార్వతి, కమరుద్దిన్ ఇద్దరు కలిసి మరో కంటెస్టెంట్ అయిన సంద్ర అమీ ప్రజిన్ ను దారుణంగా కారు నుంచి నెట్టారు. పార్వతి ఆమెను బూతులతో కిందకు నెట్టగా కమరుద్దిన్ అయితే ఏకంగా సంద్ర ప్రజిన్ ని రెండు కాళ్లతో తన్నాడు.
అలా చేయడం వల్ల ఆమె కారు నుంచి కింద పడింది. అంతేకాదు ఆమెకు ఫిట్స్ ఉండటం వల్ల ఫిట్స్ తో సఫర్ అయ్యింది. వెంటనే ఆమెను డాక్టర్ రూం కు తీసుకెళ్లారు. ఐతే అసలే హౌస్ లో వాళ్ల అతి వల్ల ఇబ్బంది పడుతున్న హౌస్ మేట్స్ ఈ ఘటనతో పార్వతి, కమరుద్దిన్ మీద ఎటాక్ చేశారు. ఐతే వీకెండ్ హోస్ట్ విజయ్ సేతుపతి కూడా రెడ్ కార్డ్ చూపించి వాళ్ల ఇద్దరినీ బయటకు పంపించారు.
తమిళ్ బిగ్ బాస్ లో రెడ్ కార్డ్..
తమిళ్ బిగ్ బాస్ లో రెడ్ కార్డ్ ఇచ్చి ఇలా హౌస్ నుంచి కంటెస్టెంట్స్ ని ఎలిమినేట్ చేయడం మొదటిసారి.. అంతేకాదు రెడ్ కార్డ్ వల్ల ఆ కంటెస్టెంట్స్ 90 రోజుల రెమ్యునరేషన్ లో కూడా కొంత కట్ చేస్తారని తెలుస్తుంది. బిగ్ బాస్ తమిళ్ సీజన్ 9 లో జరిగిన ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విజయ్ సేతుపతి పార్వతి, కమరుద్దిన్ కి రెడ్ కార్డ్ ఇవ్వడంతో బిగ్ బాస్ తమిళ్ స్టూడియోలో ఉన్న వాళ్లతో పాటు తమిళ్ బిగ్ బాస్ లవర్స్ కూడా తెగ ఎంజాయ్ చేశారు. వాళ్లిద్దరి మీద ఇంత నెగిటివిటీ ఆ కంటెస్టెంట్స్ ఊహించి ఉండరు.
ఏది ఏమైనా తెలుగు లో ఇలాంటిది జరిగితే ఎలా ఉండేదో కానీ తమిళ బిగ్ బాస్ లో విజయ్ సేతుపతి రెడ్ కార్డ్ చూపించి హౌస్ నుంచి కంటెస్టెంట్స్ ని పంపించడం ఒక సూపర్ హిట్ సినిమాలో అదిరిపోయే ట్విస్ట్ మాదిరిగా బిగ్ బాస్ ఆడియన్స్ కి సర్ ప్రైజ్ ఇచ్చింది.