బిగ్ బాస్ 9.. ఫస్ట్ వీక్ పడే వికెట్ ఎవరంటే..?

బిగ్ బాస్ సీజన్ 9 లో ఫస్ట్ వీక్ నామినేషన్స్ ముగిశాయి. అసలైతే మండే పూర్తి కావాల్సిన నామినేషన్స్ ప్రక్రియ ఈసారి బుధవారం దాకా కొనసాగించారు.;

Update: 2025-09-11 04:08 GMT

బిగ్ బాస్ సీజన్ 9 లో ఫస్ట్ వీక్ నామినేషన్స్ ముగిశాయి. అసలైతే మండే పూర్తి కావాల్సిన నామినేషన్స్ ప్రక్రియ ఈసారి బుధవారం దాకా కొనసాగించారు. దానికి రీజన్ ఏంటో తెలియదు. ఐతే ఈ సీజన్ లో సెలబ్రిటీస్ వర్సెస్ కామన్ మ్యాన్ కాన్సెప్ట్ తో మొదలు పెట్టారు. కామన్ మ్యాన్ అగ్నిపరీక్ష ని దాటి వచ్చారు కాబట్టి వాళ్లను ఓనర్స్ గా సెలబ్రిటీస్ ని టెనంట్స్ గా చేశారు. టెనంట్స్ డ్యూటీస్ చేయడం.. ఓనర్స్ కి వండి పెట్టడం లాంటివి చేస్తుండాలి.

పూర్తైన నామినేషన్స్..

ఈ క్రమంలో బుధవారంతో పూర్తైన నామినేషన్స్ లో టెనంట్స్ అందరు నామినేషన్స్ లో ఉన్నారు. సెలబ్రిటీస్ లో భరణి తప్ప అందరు ఈ వారం నామినేషన్స్ లో ఉన్నారు. ఓనర్స్ అంటే కామన్ మ్యాన్ నుంచి డిమాన్ పవన్ ని నామినేషన్స్ లో ఉంచారు. సో ఫైనల్ గా బిగ్ బాస్ సీజన్ 9 లో సంజన, రీతు చౌదరి, తనూజ, సుమన్ శెట్టి, ఫ్లోరా షైనీ, శ్రష్టి వర్మ, రాము రాథోడ్, ఇమ్మాన్యుయెల్ నామినేషన్స్ లో ఉన్నారు.

ఐతే జరిగిన 3 వారాల ఎపిసోడ్స్ చూస్తే ప్రతి విషయంలో సంజన కాస్త అతి చేస్తున్నట్టు కనిపిస్తుంది. బాత్ రూం ఇష్యూలో డ్యూటీ వేసిన మెంటర్ కళ్యాణ్ కి చిరాకు తెప్పించింది సంజన. ఇక నిన్నటి ఎపిసోడ్ లో ఎగ్ గురించి హౌస్ అంతా డిస్కషన్ చేసింది. ఆ ఎగ్ తిన్న సంజన మాత్రం విషయం లైట్ తీసుకుంది. మొత్తానికి సంజన తను అటెన్షన్ సీక్ చేయాలని కోరుకుని అలా చేస్తుందేమో కానీ ఈ వీక్ నామినేషన్స్ లో ఆమె ఉన్న విషయం తెలిసిందే.

ఎవరిని బయటకు పంపించాలో డిసైడ్..

ఆడియన్స్ కూడా ఈ వారం ఎవరిని బయటకు పంపించాలో డిసైడ్ అయినట్టు ఉన్నారు. సంజననే ప్రస్తుతానికి లీస్ట్ ఓటింగ్ తో ఉన్నట్టు ఉంది. దాదాపు ఆమెనే ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు పంపించేస్తారని టాక్. బిగ్ బాస్ సీజన్ 9 లో సంజన జర్నీ ఇంకా ఉంటుందా లేదా అన్నది ఈ వీకెండ్ తో తెలుస్తుంది. బిగ్ బాస్ కన్నడ లో కూడా సీజన్ 1 లో పాల్గొన్న సంజన అక్కడ కూడా రెండో వారమే హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది.

బిగ్ బాస్ ఎక్స్ పీరియన్స్ ఆల్రెడీ ఉన్నా కూడా ఆమె హౌస్ లో ఎలా ఉండాలో తెలియకపోవడం విచిత్రంగా ఉందని ఆడియన్స్ భావిస్తున్నారు. సంజన తో పాటు ఫ్లోరా షైనీ, సుమన్ శెట్టిలు కూడా డేంజర్ జోన్ లో ఉన్నారు. ఈ వారం కాకపోయినా నెక్స్ట్ రెండు వారాల్లో వాళ్లే ఇంటి దారి పడతారన్న టాక్ ఉంది.

Tags:    

Similar News