బిగ్ బాస్ బాహుబలి సుమన్ శెట్టి.. సోషల్ మీడియా వైరల్..!
బిగ్ బాస్ సీజన్ 9లో ఆరో వారం కెప్టెన్సీ ఫైట్ చాలా గట్టిగానే జరుగుతుంది. ఈసారి వైల్డ్ కార్డ్స్ నుంచి పోటీ వచ్చే సరికి పాత హౌస్ మెట్స్ పోరాడక తప్పలేదు.;
బిగ్ బాస్ సీజన్ 9లో ఆరో వారం కెప్టెన్సీ ఫైట్ చాలా గట్టిగానే జరుగుతుంది. ఈసారి వైల్డ్ కార్డ్స్ నుంచి పోటీ వచ్చే సరికి పాత హౌస్ మెట్స్ పోరాడక తప్పలేదు. ఐతే ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 ఇంటి కెప్టెన్ డిక్లేర్ అవుతున్నాడు. ఐతే ఆల్రెడీ సోషల్ మీడియాలో కెప్టెన్ ఎవరన్నది రివీల్ అయ్యింది. అంతేకాదు కెప్టెన్సీ ప్రమాణస్వీకారం వీడియో వైరల్ అయ్యింది. బిగ్ బాస్ సీజన్ 9లో ఆరో వారం లో కెప్టెన్ గా ఒకరు కాదు ఇద్దరు కంటెస్టెంట్స్ అయ్యారు.
బిగ్ బాస్ హిస్టరీలోనే ఇలా ఇద్దరు కంటెస్టెంట్స్ కెప్టెన్ గా..
బిగ్ బాస్ హిస్టరీలోనే ఇలా ఇద్దరు కంటెస్టెంట్స్ కెప్టెన్ గా చేయడం ఇదే తొలిసారి. సీజన్ 9లో ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో సుమన్ శెట్టి ఒక కెప్టెన్ గా ఎంపిక కాగా మరోపక్క నిఖిల్, గౌరవ్ లలో సాండ్ టాస్క్ లో గౌరవ్ గెలిచి అతను కూడా కెప్టెన్ అయ్యాడు. సో ఈ వారం ఇద్దరు కెప్టెన్స్ హౌస్ ని నడిపిస్తారన్నమాట. ఐతే సుమన్ తో గౌరవ్ కెప్టెన్సీ షేర్ చేసుకోవడం ఆసక్తి కలిగిస్తుంది.
బిగ్ బాస్ సీజన్ 9లో మొన్నటిదాకా కంటెస్టెంట్ గా కూడా చాలా వెనకపడి ఉన్న సుమన్ శెట్టి ఈ వారం కెప్టెన్ గా గెలిచాడు. కెప్టెన్ అయిన తర్వాత సుమన్ శెట్టి ప్రమాణ స్వీకారం చేశాడు. అధ్యక్షా నేను కెప్టెన్ అయ్యాను.. నిజం గా నిజాయితీగా ఉంటా అని ప్రమాణం చేశాడు. సుమన్ శెట్టి ఈ ఓత్ సీన్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వెంటనే కళ్యాణ్, రాము వచ్చి సుమన్ శెట్టిని తమ భుజాన ఎత్తుకున్నారు.
దివ్య, రాము డేంజర్ జోన్ లోకి..
తప్పకుండా సుమన్ శెట్టికి ఈ ఎపిసోడ్ మంచి హై ఇస్తుందని చెప్పొచ్చు. అంతేకాదు కెప్టెన్సీ షేరింగ్ అన్నది కూడా సంథింగ్ స్పెషల్ గా ఉంది. ఆల్రెడీ ఈ వారం సుమన్ శెట్టి నామినేషన్స్ లో ఉన్నాడు. అతను కాకుండా దివ్య, రాము డేంజర్ జోన్ లోకి వెళ్లే ఛాన్స్ ఉంది. బిగ్ బాస్ సీజన్ 9లో వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఆట మారిపోయింది. గురువారం ఎపిసోడ్ లో రమ్యకు ఉన్న స్పెషల్ పవర్ ద్వారా ఆమె చాలా ఎక్కువ ఐటమ్స్ బిగ్ బాస్ ని అడిగి తెప్పించుకోగా ఆ ఫుడ్ అంతా తినడానికి ఇబ్బంది పడింది. ఐతే ఫుడ్ వేస్ట్ చేస్తున్న కారణంగా రమ్యకి ఇచ్చిన స్పెషల్ పవర్ క్యాన్సిల్ చేశాడు బిగ్ బాస్.
ఇక హౌస్ లో స్ట్రాంగ్ గా ఉండాలి అసలు ఎమోషన్ అవ్వొద్దు.. ఏడవడం జరగొద్దు అని తనూజకి చెప్పిన అయేషా కూడా కెప్టెన్సీ టాస్క్ లో ఓడినందుకు ఏడ్చేసింది. ఆమె బయట చూసి వచ్చి తనూజా ఏడవడం నచ్చలేదని చెప్పి వచ్చిన నాలుగో రోజే రెండు మూడుసార్లు ఎమోషనల్ అయ్యిందని ఆడియన్స్ అనుకుంటున్నారు.