బిగ్ బాస్ 9.. నాగార్జున మాటని లెక్క చేయని సంజనా..?

బిగ్ బాస్ 9లో శనివారం ఎపిసోడ్ హాట్ హాట్ గా సాగింది. సోమవారం నుంచి శుక్రవారం వరకు వారం మొత్తం కంటెస్టెంట్స్ ఆటకి వీకెండ్ నాగార్జున రివ్యూ ఇస్తుంటారు.;

Update: 2025-11-30 04:45 GMT

బిగ్ బాస్ 9లో శనివారం ఎపిసోడ్ హాట్ హాట్ గా సాగింది. సోమవారం నుంచి శుక్రవారం వరకు వారం మొత్తం కంటెస్టెంట్స్ ఆటకి వీకెండ్ నాగార్జున రివ్యూ ఇస్తుంటారు. ఈ రివ్యూలో వారం మొత్తం జరిగిన టాస్క్ లు, గొడవల మీద హోస్ట్ మాట్లాడతారు. ఐతే గత వారం నామినేషన్స్ లో సంజన గర్లాని రీతు, డీమాన్ పవన్ లపై చేసిన కామెంట్స్ గురించి మిస్టేక్ ఎవరిది అని ఇమ్మాన్యుయెల్ ని అడిగారు. మిగతా హౌస్ మేట్స్ అంతా కూడా సంజనాదే తప్పని అన్నారు. రీతు, డీమాన్ పక్కన కూర్చుని ఉండటం తనకు నచ్చలేదన్న విషయం అక్కడే చెప్పాలి కానీ నామినేషన్స్ లో చెప్పి అదేదో తప్పు చేశారన్న విధంగా పోట్రే చేయడం ఏంటని నాగార్జున అన్నారు.

వాళ్లు అలా పక్క పక్కన ఉంటే.. నేను చూడలేక బ్లాంకెట్ కప్పుకున్నా..

అయినా సరే సంజనా నేను చూసిందే చెప్పా.. వాళ్లు అలా పక్క పక్కన ఉంటే నేను చూడలేక బ్లాంకెట్ కప్పుకున్నా అని చెప్పింది. అంతేకాదు సంజనా వాడిన 19 ఏళ్లు ఇండస్ట్రీలో ఉన్నా అనే పదాన్ని వాడారు నాగార్జున. వాళ్లేదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉన్నారు. వాళ్లు ఏం చేసినా మనకి నచ్చదు అని అన్నారు. ఐతే సంజన అవుట్ బరస్ట్ అయ్యి తను చూసిందే చెప్పా అని నాగార్జున మాట కూడా వినలేదు.

ఫైనల్ గా ఎవరైతే సంజనాను ఇదివరకు హౌస్ లో ఉండేందుకు త్యాగం చేశారో వాళ్లను భరణి, ఇమ్మాన్యుయెల్, తనూజ, రీతూలను డెసిషన్ అడిగారు. ఐతే ఆ టైంలో కూడా సంజన నేను హౌస్ వదిలి వెళ్తానని అన్నది. హౌస్ డెకొరం పాడు చేశావ్ సంజన అని నాగార్జున మాటని రిపీట్ చేసి సంజనా నేను వెళ్తా సార్ అన్నది. కానీ నాగార్జున అది నీ డెసిషన్ కాదు.. ఆ నలుగురు చెబుతారంటూ వాళ్లకి 1 నిమిషం టైం ఇచ్చారు.

బ్లాక్ మార్క్ తో వెళ్లినట్టు అవుతుంది..

వాళ్ల నలుగురు ఆడియన్స్ కి, రీతూకి సారీ చెబితే సరిపోద్దని అన్నారు. అప్పుడు కూడా సంజనా లేదు సార్ నేను చెప్పను వెళ్లిపోతా అన్నది. ఐతే నాగార్జున హౌస్ లోకి ఒక బ్లాక్ మార్క్ తో వచ్చావ్.. వెళ్తే అదే బ్లాక్ మార్క్ తో వెళ్లినట్టు అవుతుంది. నీ మీద పడ్డ నింద చెరిపోఏసుకుని వెళ్లాలని అన్నారు. మొత్తానికి సంజనా కన్విన్స్ అయ్యి రీతూకి, ఆడియన్స్ కి సారీ చెప్పింది.

ఐతే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆమె వెళ్తా అన్నప్పుడు పంపించాల్సింది కదా.. ఎందుకు నాగార్జున ఆమెను ఫోర్స్ ఫుల్ గా ఒప్పించారు అన్నట్టుగా ఉంది. ఐతే వాళ్ల ప్లాన్ ఏంటన్నది తెలియదు కానీ బిగ్ బాస్ హౌస్ లో సంజనా చేసిన హంగామాకి నాగార్జున బుర్ర కూడా హీటెక్కిపోయిందని చెప్పొచ్చు.

Tags:    

Similar News