శ్రీజ రెండోసారి ఎలిమినేట్.. ఎందుకు..? ఎలా..?
అయేషా హౌస్ నుంచి సడెన్ గా ఎగ్జిట్ అవ్వడంతో హౌస్ లో మరో కంటెస్టెంట్ ఉండాలి అందుకే శ్రీజ, భరణి లను హౌస్ లోకి పంపించారు.;
బిగ్ బాస్ సీజన్ 9లో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తున్నాయి. హౌస్ లోకి ఈ వారం నామినేషన్స్ చేయడానికి ఆల్రెడీ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ వచ్చారు. అలా వాళ్లు రావడం నామినేట్ చేసి హౌస్ లో ఉన్న వాళ్ల గురించి తమ ఒపీనియన్ చెప్పడం జరిగింది. ఐతే ఈ క్రమంలో భరణి, శ్రీజ ఇద్దరిని మళ్లీ హౌస్ లోకి పంపించాడు బిగ్ బాస్. అయేషా హౌస్ నుంచి సడెన్ గా ఎగ్జిట్ అవ్వడంతో హౌస్ లో మరో కంటెస్టెంట్ ఉండాలి అందుకే శ్రీజ, భరణి లను హౌస్ లోకి పంపించారు.
ఎవరు ఇంట్లో ఉండాలి అన్నది కంటెస్టెంట్స్..
ఐతే వీరిద్దరిలో ఒకరు మాత్రమే హౌస్ లో ఉంటారని తెలుస్తుంది. వీళ్లలో ఎవరు ఇంట్లో ఉండాలి అన్నది హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ డిసైడ్ చేస్తారు. భరణి, శ్రీజ లకు మొదటిగా కట్టు పడగొట్టు టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ఐతే ఈ టాస్క్ లో శ్రీజ కోసం డీమాన్ పవన్, గౌరవ్ ఆడుతారు.. భరణి కోసం ఇమ్మాన్యుయెల్, నిఖిల్ ఆడతారు. ఈ టాస్క్ లో బిగ్ బాస్ చెప్పినట్టుగా టవర్ ఏర్పాటు చేయాలి. ఈ టాస్క్ కి కళ్యాణ్, సుమన్ శెట్టి సంచాలకుగా చేశారు.
ఐతే ఈ టాస్క్ లోనే డీమాన్ పవన్ అటు భరణిని, నిఖిల్ ని ఇద్దరిని ఒక్కడే ఆపగలిగాడు. దాదాపు శ్రీజ టాస్క్ గెలుస్తుంది అనుకున్న టైం లో సర్కిల్ లో టవర్ ఉండకుండా భరణి చివరి నిమిషంలో కాలితో టవర్ ని తన్నాడు. అలా బజర్ మోగిన తర్వాత సంచాలకులైన కళ్యాణ్ శ్రీజ గెలిచిందని చెబుతాడు. కానీ దానికి సుమన్ శెట్టి ఒప్పుకోడు. ఇద్దరు సంచాలకులు గెలిచింది ఎవరు చెప్పడంలో విఫలమవుతారు. ఫైనల్ గా ఆ టాస్క్ రిజల్ట్ లేదని చెబుతాడు బిగ్ బాస్.
శ్రీజకు సపోర్ట్ చేస్తూ పవన్ భరణితో ఫైట్..
మరో టాస్క్ లో పవన్ శ్రీజకు సపోర్ట్ చేస్తూ భరణితో ఫైట్ చేస్తాడు. అందులో భరణి, పవన్ ఇద్దరు స్విమ్మింగ్ పూల్ లో పడతారు. దాని వల్ల భరణికి గాయం అవుతుంది. అతను హాస్పిటల్ కి వెళ్లాలని హౌస్ నుంచి బయటకు వస్తాడు. ఐతే ఆ తర్వాత భరణి కోసం దివ్య టాస్క్ ఆడుతుంది. శ్రీజ వర్సెస్ దివ్యా టాస్క్ లో శ్రీజ గెలుస్తుంది. సో టవర్ టాస్క్ నో రిజల్ట్ కాగా మేజ్ టాస్క్ లో దివ్య గెలిచి భరణిని గెలిపిస్తుంది.
ఇక డోర్ అన్ లాక్ టాస్క్ లో శ్రీజ గెలుస్తుంది. ఇక ఫైనల్ టాస్క్ ఫోర్త్ టాస్క్ భరణి తరపున ఆడుతున్న ఇమ్మాన్యుయెల్ కూడా గెలుస్తాడు. దాంతో శ్రీజ వెనకపడుతుంది. మరోపక్క హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ లో శ్రీజ, భరణిలకు జియో హాట్ స్టార్ లో ఓటింగ్ కూడా పెట్టాడు. ఆ ఓటింగ్ తో పాటు హౌస్ లో జరిగిన టాస్క్ ల రిజల్ట్ కలిపి భరణి హౌస్ లో పర్మినెంట్ మెబర్ గా కొనసాగుతాడు. హౌస్ నుంచి ఇదే సీజన్ లో శ్రీజ రెండో సారి ఎలిమినేట్ అవుతుంది. శ్రీజ ఎలిమినేషన్ టైం లో అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అన్న ఆడియన్స్ ఆమె వచ్చీరాగానే మళ్లీ తన ఆట ఆడుతుంది. సెకండ్ ఛాన్స్ ని వాడుకుంటుంది అనుకున్నారు. అప్పటికీ డీమాన్, కళ్యాణ్ శ్రీజకు సపోర్ట్ చేసినా ఆమె ఎగ్జిట్ అవ్వక తప్పలేదు.