బిగ్ బాస్ హౌస్ లోకి మళ్లీ ఓల్డ్ కంటెస్టెంట్స్..!
బిగ్ బాస్ సీజన్ 9లోకి ఈ వారం కెప్టెన్సీ టాస్క్ ని డిఫరెంట్ గా ప్లాన్ చేశారు బిగ్ బాస్.;
బిగ్ బాస్ సీజన్ 9లోకి ఈ వారం కెప్టెన్సీ టాస్క్ ని డిఫరెంట్ గా ప్లాన్ చేశారు బిగ్ బాస్. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ ని ఆల్రెడీ బిగ్ బాస్ ఓల్డ్ కంటెస్టెంట్స్ లో కెప్టెన్ గా అదరగొట్టిన యోధులను పంపించారు. అలా మొదట హౌస్ లోకి వచ్చిన ప్రియాంక జైన్ తనతో పోటీకి కళ్యాణ్ ని సెలెక్ట్ చేసుకోగా వారికి ఫిష్ టాస్క్ ని హుక్ సాయంతో ఇచ్చిన బ్యాగ్ తీసి ఆ ఫిష్ స్టిక్స్ ని పెట్టాలి. అలా 3 బ్యాగుల్లో ఉన్న ఫిష్ స్టిక్స్ ని పెట్టి బెల్ కొట్టాలి.. ఈ టాస్క్ లో కళ్యాణ్ గెలిచి కెప్టెన్సీ కంటెండర్ అయ్యాడు.
బిగ్ బాస్ సీజన్ 7, 8లో ఉన్న గౌతం కృష్ణ మరోసారి హౌస్ లోకి..
ఇక నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్ 7, 8లో ఉన్న గౌతం కృష్ణ మరోసారి హౌస్ లోకి వచ్చాడు. గౌతం కృష్ణ తనతో ఆట ఆడేందుకు భరణిని సెలెక్ట్ చేసుకున్నాడు. ఒకే రకంగా ఉన్న 3 టైప్స్ కలర్స్, ఆర్టిస్ట్, సింబల్స్ ని అదే ఆర్డర్ లో పెట్టాలి. ఒకటి రౌండ్ పూర్తి కాగానే వెళ్లి ఒక మూటని వాళ్లు ఏర్పాటు చేసిన ఒక టేబుల్ మీద ఆగేలా చేయాలి. ఈ టాస్క్ లో గౌతం దూకుడుగా ఆడి గెలిచాడు. భరణి ఓడిపోవడంతో కెప్టెన్సీ కంటెండర్ రేసు నుంచి తొలగించబడ్డాడు. ఐతే ఈ వారం చివరి కెప్టెన్సీ టాస్క్ అవ్వడంతో భరణి కూతురికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని ఫీల్ అయ్యాడు.
నెక్స్ట్ ప్రేరణ హౌస్ లోకి వచ్చింది. తనూజతో ఒక టాస్క్ ఆడింది. ఐతే తనూజ, ప్రేరణ ఇద్దరు చాలా బాగా కష్టపడ్డారు. కానీ తనూజ ఐదారు సెకన్ల గ్యాప్ లో ప్రేరణ మీద ఓడిపోయింది. అలా తనూజ కూడా చివరి వారం కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకుంది. ఆ తర్వాత హారిక హౌస్ లోకి వచ్చి సుమన్ ని తన అపోనెంట్ గా సెలెక్ట్ చేసుకుని అతనితో ఒక ఆట ఆడింది. ఐతే అందులో సుమన్ ఓడిపోయాడు.
డీమాన్ పవన్ మరోసారి తన సత్తా చాటి..
బుధవారం చివరగా మానస్ హౌస్ లోకి వచ్చాడు. అతను డీమాన్ పవన్ ని తన ఆపోనెంట్ గా ఎంపిక చేసుకున్నాడు. ఇచ్చిన బాల్స్ ని క్యాచ్ పట్టి దాన్ని తీసుకెళ్లి వాళ్లకు ఏర్పాటు చేసిన పిన్స్ కి అటాచ్ అయ్యేలా చూడాలి. ఈ టాస్క్ లో పవన్ మరోసారి తన సత్తా చాటి గెలిచాడు. సో కళ్యాణ్ తర్వాత నెక్స్ట్ ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ గా డీమాన్ పవన్ నిలిచాడు. ఆల్రెడీ ఈ వారం కెప్టెన్సీ రేసు నుంచి భరణి, సుమన్, తనూజ ఎలిమినేట్ అయ్యారు. సో కెప్టెన్ ఎవరన్నది రాబోయే టాస్కుల్లో తెలుస్తుంది.
బిగ్ బాస్ హౌస్ లో చివరి వారం కెప్టెన్ అవ్వడం అంటే దాదాపు టాప్ 5 కి ఛాన్స్ ఉన్నట్టే లెక్క. ఎందుకంటే ఈ వారం తర్వాత ఇంకా హౌస్ లో 3 వారాలు మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ వీక్ సేఫ్ అయితే మిగతా రెండు వారాల్లో గట్టిగా ఆడితే టాప్ 5లో ఉండే అవకాశం ఉంటుంది. అందుకే హౌస్ మేట్స్ అంతా కూడా ఈ టాస్క్ ని చాలా సీరియస్ గా తీసుకున్నారు.