బిగ్ బాస్ 9.. నాగ చైతన్య కోసం బయటకొచ్చేస్తా..!
బిగ్ బాస్ సీజన్ 9 సండే ఎపిసోడ్ లో నవ యువ సామ్రాట్ నాగ చైతన్య స్పెషల్ ఎంట్రీ ఆడియన్స్ కి సర్ ప్రైజ్ ఇవ్వబోతుంది.;
బిగ్ బాస్ సీజన్ 9 సండే ఎపిసోడ్ లో నవ యువ సామ్రాట్ నాగ చైతన్య స్పెషల్ ఎంట్రీ ఆడియన్స్ కి సర్ ప్రైజ్ ఇవ్వబోతుంది. అదేంటి ఏదైనా సినిమా ప్రమోషన్ ఉంటేనే కదా సినిమా వాళ్లు వచ్చేది.. మరి నాగ చైతన్య ఏ సినిమా కోసం వచ్చాడు అంటే ఇది సినిమా కోసం కాదు రేసింగ్ కోసం అని తెలుస్తుంది. నాగ చైతన్య ఇండియన్ రేసింగ్ లీగ్ ఫెస్ట్ లో భాగంగా తను హైదరాబాద్ బ్లాక్ స్వార్డ్స్ కి ఓనర్ గా వచ్చాడు. రేసింగ్ మొదలవుతున్న ఈ టైం లో ప్రమోషన్ గా బిగ్ బాస్ కి వచ్చినట్టు తెలుస్తుంది.
చైతుతో బైక్ రేస్ కి వెళ్లే ఛాన్స్..
ఇక హౌస్ మేట్స్ కి నాగ చైతన్యను చూపించగానే రీతు చౌదరి ఎగిరి గంతేసింది. నాగ చైతన్య అంటే చాలా ఇష్టమని అన్నది. ఆయన కాళ్లు తెల్లగా ఉంటాయని చెప్పింది రీతు. ఐతే ఆ శిల్పం చెక్కింది నేను అంటూ చెప్పాడు నాగార్జున. ఒకవేళ చైతుతో బైక్ రేస్ కి వెళ్లే ఛాన్స్ ఇస్తే హౌస్ లో నుంచి బయటకు వస్తావా అంటే వస్తా రెడీ అంటూ ఉత్సాహాన్ని చూపించింది రీతు. నాగ చైతన్య సీజన్ అయ్యాక కూడా రేసుకి వెళ్లొచ్చు అంటే.. జోష్ నుంచి నాగ చైతన్యని గెలుచుకుంటున్నా అని అంటుంది రీతు చౌదరి.
నాగ చైతన్య రాకతో బిగ్ బాస్ ఈ వీకెండ్ సండే ఎపిసోడ్ అదిరిపోయేలా ఉంది. ఇక సండే ఫండే లో భాగంగా కొన్ని యానిమల్స్ ఫోటో చూపిస్తే వాటి స్పెల్లింగ్ ని కరెక్ట్ గా బోర్డ్ మీద పెట్టాల్సి ఉంటుంది. ఈ టాస్క్ లో ఇమ్మాన్యుయెల్ చేసే కామెడీ కూడా ఈరోజు ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ అందించేలా ఉంది. బిగ్ బాస్ సీజన్ 9లో ఈ వీక్ డబల్ ఎలిమినేషన్ ఉంటుందని హోస్ట్ నాగార్జున చెప్పారు. ఆల్రెడీ శనివారం ఎపిసోడ్ లో నిఖిల్ నాయర్ ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. ఈరోజు గౌరవ్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతాడని తెలుస్తుంది.
హౌస్ నుంచి బయటకు వెళ్తానని ఏడ్చేసిన సంజన..
బిగ్ బాస్ సీజన్ 9లో 10 వారాలు ఆట ముగిసింది. ఐతే నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వీక్ అని ముందే హింట్ ఇచ్చాడు బిగ్ బాస్. ఐతే శనివారం షిప్ సింక్ టాస్క్ లో సంజనకి ఎక్కువ సింక్ ఓటింగ్స్ రావడంతో ఆమెకు ఫ్యామిలీ వీక్ క్యాన్సిల్ చేశారు. ఐతే ఆమె అలా అయితే హౌస్ నుంచి బయటకు వెళ్తానని ఏడ్చేసింది.. నాగార్జున మాత్రం బిగ్ బాస్ రూల్ ఈజ్ రూల్ అన్నారు. ఐతే సంజన ఎమోషనల్ అవుట్ బరస్ట్ తో ఏదైనా పనిష్ మెంట్ ఇచ్చి ఆమె ఫ్యామిలీ వీక్ కొనసాగిస్తారేమో చూడాలి.