బిగ్ బాస్ హౌస్ లో ఇమ్యూనిటీ ఫైట్.. సేఫ్ అయ్యింది ఎవరంటే..?

ఈ ఇమ్యూనిటీ టాస్క్ లో పాల్గొనేందుకు హౌస్ మెట్స్ అందరినీ కూడా టీంస్ గా విడగొట్టారు. అలా వాళ్ల టీం కలిసి ఈ టాస్క్ ఆడాల్సి ఉంటుంది.;

Update: 2025-09-30 05:56 GMT

బిగ్ బాస్ సీజన్ 9లో మండే ఎపిసోడ్ లో నామినేషన్స్ ఉంటాయనుకుంటే నామినేషన్స్ బదులుగా ముందు ఇమ్యూనిటీ అంటూ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. అదేంటి అంటే బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏం జరుగుతుంది అన్నది ఎవరు ఊహించరు. సీజన్ 9లో లాస్ట్ వీక్ కూడా ఇమ్యూనిటీ టాస్క్ ఇచ్చారు అందులో ఫ్లోరా షైనీ గెలిచి సేఫ్ అయ్యింది. ఐతే లాస్ట్ వీక్ నామినేషన్స్ పూర్తయ్యాక ఆ తర్వాత ఇమ్యూనిటీ టాస్క్ ఇచ్చారు. కానీ ఈసారి నామినేషన్స్ కన్నా ముందు ఇమ్యూనిటీ టాస్క్ పెట్టారు.

సుమన్ శెట్టి, తనూజ ఇమ్యూనిటీ..

ఈ ఇమ్యూనిటీ టాస్క్ లో పాల్గొనేందుకు హౌస్ మెట్స్ అందరినీ కూడా టీంస్ గా విడగొట్టారు. అలా వాళ్ల టీం కలిసి ఈ టాస్క్ ఆడాల్సి ఉంటుంది. ఇందులో కొన్ని రౌడ్లు రిజల్ట్ ని ఏమి ఇవ్వలేదు. ఇక ఫైనల్ గా వారధి కట్టు ఇమ్యూనిటీ పట్టు లో సుమన్ శెట్టి, తనూజ గెలవడంతో పాటుగా హౌస్ మెట్స్ సపోర్ట్స్ తో ఇమ్యూనిటీ సంపాదించారు. సో ఫైనల్ గా ఈ వారం నామినేషన్స్ లో సుమన్ శెట్టి, తనూజ నామినేషన్స్ లోకి వెళ్లకుండానే సేఫ్ అయ్యారు.

ప్రియా శెట్టి ఎలిమినేట్ అయ్యాక శ్రీజకి టెన్షన్ మొదలైంది. ఇదిలాఉంటే కిచెన్ దగ్గర నిన్నటి ఎపిసోడ్ లో ఆల్రెడీ దివ్య, డీమాన్ బ్రేక్ ఫాస్ట్ రెడీ చేస్తుంటే సంజన తనకు పోప్ కావాలని హడావిడి చేసింది. కుకింగ్ మోనియ్టర్ అయిన తనూజ అందుకు పర్మిషన్ ఇవ్వలేదు. సంజన, తనూజ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇద్దరు ఫైట్ చేసుకున్నారు. ఐతే ఎపిసోడ్ చూసిన వాళ్లు తప్పంతా తనూజదే అన్నట్టు అనుకునేలా ఉంది. ఐతే లైవ్ చూసిన వాళ్లు మాత్రం సంజన తనూజని చాలా మాటలు అన్నదని అంటున్నారు.

తనూజ, సంజన గొడవ..

ఇక ఈ గొడవలో భరణి మొదటిసారి ఫైర్ అయ్యాడు. ఆపండి అంటూ గట్టిగా అరిచాడు. లాస్ట్ వీక్ సంజన మిడ్ వీక్ ఎలిమినేట్ కాగా ఆమెను హౌస్ లోకి తీసుకొచ్చేందుకు బ్యాటరీ ఫుల్ చేసేలా తనూజ సీజన్ మొత్తం కాఫీ తాగనని చెప్పింది. ఐతే ఈ గొడవలో సంజన ఆమె చేసింది పెద్ద త్యాగమా అంటూ మాట్లాడింది. శ్రీజ కూడా తన కోసం డ్రెస్ లు త్యాగం చేయకూడదా అంటూ సంజన ఇమ్మాన్యుయెల్ తో చెబుతుంది. మొత్తానికి సంజన హౌస్ లో తను చేసింది కరెక్ట్ అన్నట్టుగా ఉంది.

తనూజ, సంజన విషయంలో ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు అన్నది పక్కన పెడితే సంజన ప్రతి విషయంలో హౌస్ రూల్స్ బ్రేక్ చేసి దానికి మోనిటర్ గా ఉన్న వాళ్లతో గొడవ పడి నానా రచ్చ చేస్తుంది. మళ్లీ వీకెండ్ లో నాగార్జున అడిగితే అది ఫన్ అంటుంది. కానీ ఆమె మాత్రం చాలా చేస్తుంది. సీజన్ 9 ఫోర్త్ వీక్ నామినేషన్స్ ఈరోజు ఎపిసోడ్ లో ఉంటాయేమో చూడాలి.

Tags:    

Similar News