భూమీ సిస్టర్స్ కంపెనీ క్యాప్ భూమిలో కలిసిపోయేలా!
అక్కా చెల్లి ఇద్దరు ఇటీవలే హిమాచల్ ప్రదేశ్ లో ఓ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. ప్రజలకు సురక్షితమైన మంచినీటిని అందించడమే లక్ష్యంగా ఈ బిజినెస్ లోకి దిగినట్లు సిస్టర్స్ తెలిపారు.;
ప్లాస్టిక్ తో ఎన్నో అనర్దాలు. ప్లాస్టిక్ లో ఉండే రసాయనాలు కారణంగా క్యాన్సర్ కారకిగా పేరొందింది. ఇప్పటికే కొన్ని రకాల ప్లాస్టిక్ ని బ్యాన్ చేసారు. అయినా ప్లాస్టిక్ ని పూర్తిగా నిర్మూలించడం సాధ్యపడేలేదు. ఏదో రూపంలో ప్లాస్టిక్ ని వాడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అలా ప్లాస్టిక్ మానవ మనుగడలో ఓ భాగంగా మారింది. ప్లాస్టిక్ మట్టిలో కరిగే పదార్దం కాకపోవడంతోనే ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కానీ మా ప్లాస్టిక్ మాత్రం ప్రమాద కారిణి కాదంటూ బాలీవుడ్ సిస్టర్స్ భూమీ పడ్నేకర్- సమీక్షా పడ్నేకర్ ముందుకొచ్చారు.
అక్కా చెల్లి ఇద్దరు ఇటీవలే హిమాచల్ ప్రదేశ్ లో ఓ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. ప్రజలకు సురక్షితమైన మంచినీటిని అందించడమే లక్ష్యంగా ఈ బిజినెస్ లోకి దిగినట్లు సిస్టర్స్ తెలిపారు. తమది ప్రీమి యం వాటర్ బ్రాండ్ కంపెనీగా పేర్కొన్నారు. ఇది మూడు రకాల ప్లేవర్స్ తో దొరుకుతుంది. ప్యాకింగ్ కోసం ప్లాస్టిక్ ని వాడటం లేదన్నారు. దీనిలో వాడే క్యాప్ భూమిలో కలిపిపోయే రసాయనాలతోనే తయారు చేసినట్లు తెలిపారు.
ప్రజల ఆరోగ్యం, పర్యావరణం కలుషితం కాకూడదనే కారణంగా ఖర్చు ఎక్కువైనా ఓ బ్రాండ్ గా తమ వాటర్ బాటల్స్ ని మార్కెట్ లోకి తీసుకొస్తున్నామన్నారు. ఈ వాటర్ బాటిల్ ధరలు ఇలా ఉన్నాయి. అరలీటర్ బాటిల్ 150 రూపాయలు కాగా, 750 ఎంఎల్ ధర 200గా నిర్ణయించారు. అందరికీ అందుబాటులో ఉండాలనే ధరలు ఇలా పెట్టినట్లు తెలిపారు. ఎనర్జీ డ్రింక్ కోసం ఎంతైనా ఖర్చు చేస్తున్నారు. వాటికన్నా తమ వాటర్ ఎంతో ఉత్తమమైనది గా తెలిపారు. ఇందులో మినరల్స్, ఎలక్టో లైట్స్ ఉన్నాయన్నారు.
వచ్చే నాలుగేళ్లలో 100 కోట్ల మార్కెట్ టార్గెట్ గా పెట్టుకుని పనిచేస్తున్నట్లు తెలిపారు. 15 ఏళ్లలో ప్రతీ ఇంట్లో తమ కంపెనీకి చెందిన వాటర్ ఉండేలా పని చేస్తామన్నారు. ఇప్పటికే మార్కెట్లో ఎన్నో రకాల వాటర్ కంపెనీలున్నాయి. లీటర్ వాటల్ బాటిల్ ధర 20 రూపాయలు. దేశ వ్యాప్తంగా ఎక్కువగా సేల్ అయ్యేది ఈ రకమైన వాటర్ బాటిళ్లే. వాటితో భూమీ సిస్టర్స్ కంపెనీ పోటీ పడి నెట్టుకు రావాలి. అప్పుడే సిస్టర్స్ సక్సెస్ అయినట్లు.