భోగి నుంచి మందారం.. ఏదో మ్యాజిక్ ఉందిగా..

శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ డ్రామా ‘భోగి’ పోస్టర్స్ తోనే క్యూరియసిటీని క్రియేట్ చేస్తోంది.;

Update: 2026-05-11 07:32 GMT

శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ డ్రామా ‘భోగి’ పోస్టర్స్ తోనే క్యూరియసిటీని క్రియేట్ చేస్తోంది. శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన లుక్ ఇప్పటికే సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. పక్కా రా అండ్ రస్టిక్ విజువల్స్ తో ఈ సినిమా పీరియాడిక్ యాక్షన్ జోనర్ లో కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసేలా కనిపిస్తోంది. లేటెస్ట్ గా ఈ ప్రాజెక్ట్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వచ్చింది.



 


సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న డింపుల్ హయతి కి సంబంధించిన ‘మందారం’ లుక్ ని మేకర్స్ విడుదల చేశారు. అసలు విషయం ఏంటంటే, ఈ పోస్టర్ లో డింపుల్ హయతి మునుపెన్నడూ చూడని విధంగా కనిపిస్తున్నారు. ఎర్రటి చీర కట్టుకుని, పాత కాలపు నగలు ధరించి, చేతిలో తాటాకు విసనకర్రతో కూర్చున్న ఆమె అవతార్ 1960ల నాటి వాతావరణాన్ని పక్కాగా హైలెట్ చేస్తోంది.

గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, ఇందులో నటనకు ఆస్కారం ఉన్న ‘మందారం’ అనే పవర్ ఫుల్ రోల్ ఆమె చేస్తున్నట్లు పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. "ప్రపంచం కోరుకున్న అందం.. కానీ ఎవరూ అర్థం చేసుకోలేని మనసు" అంటూ ఈ పాత్రకు ఇచ్చిన డిస్క్రిప్షన్ క్యూరియాసిటీని పెంచుతోంది.

దర్శకుడు సంపత్ నంది ఈ సినిమా కోసం ప్రతి పాత్రను చాలా ఇంటెన్సివ్ గా డిజైన్ చేశారు.

మందారం పాత్రకు సంబంధించి ఆయన సోషల్ మీడియాలో పెట్టిన డైలాగ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. "నా బో***లో ప్రపంచం చల్ తీ.. మందారం ఈడ.." అంటూ చాలా రా గా ఉన్న ఒక లైన్ ని ఆయన షేర్ చేశారు. దీన్ని బట్టి సినిమాలో మాటలు ఎంత పవర్ ఫుల్ గా, ఎంత లోకల్ నెటివిటీతో ఉండబోతున్నాయో ఊహించవచ్చు. డింపుల్ హయతి లుక్ లోని కళ్లలో ఉన్న ధైర్యం చూస్తుంటే శర్వానంద్ తో పోటీ పడే రేంజ్ లో ఆమె క్యారెక్టర్ ఉండబోతోందని తెలుస్తోంది.

శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కె.కె. రాధామోహన్ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే 20 ఎకరాల్లో వేసిన భారీ సెట్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. భీమ్స్ సిసిరోలియో ఈ యాక్షన్ డ్రామాకు సంగీతం అందిస్తున్నారు. ఆగస్టు 28న సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే స్పష్టం చేశారు. కేవలం ఫైట్లు, పొలిటికల్ డ్రామా మాత్రమే కాకుండా, బలమైన ఎమోషన్స్ చుట్టూ ఈ కథ తిరుగుతుందని చిత్ర యూనిట్ చెబుతోంది.

‘భోగి’ సినిమా నుంచి వస్తున్న ఒక్కో అప్ డేట్ సినిమా రేంజ్ ను పెంచుకుంటూ వెళ్తున్నాయి. శర్వానంద్ మేకోవర్ ఒక ఎత్తైతే, ఇప్పుడు డింపుల్ హయతి ‘మందారం’ లుక్ మరో ఎత్తు. అనుపమ పరమేశ్వరన్ పాత్రకు సంబంధించిన లుక్ కూడా ఇదివరకే రిలీజ్ చేశారు. ఇక మిగతా పాత్రలు ఎలా ఉంటాయనే ఆసక్తి కూడా ఇప్పుడు అభిమానుల్లో మొదలైంది. మరి ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

Tags:    

Similar News