బిగ్ బాస్ 9.. ప్రజా భరణి ఇదే కదా కావాల్సింది..!

ఐతే బిగ్ బాస్ సీజన్ 9లో రెండో ఛాన్స్ వచ్చింది. భరణి, శ్రీజలను హౌస్ లోకి పంపించి ఇద్దరికి కొన్ని టాస్క్ లు పెట్టాడు. శ్రీజ పెట్టిన నాలుగు టాస్క్ లల్లో ఒకటి గెలిస్తే.. భరణి రెండు గెలిచాడు.;

Update: 2025-11-14 05:15 GMT

బిగ్ బాస్ 9 లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతాడనుకున్న సీరియల్ యాక్టర్ భరణి అక్కడ తన బాండింగ్స్ తో ఒకసారి ఆల్రెడీ బయటకు వచ్చేశాడు. సీజన్ 9లో మొదటి లిస్ట్ లో అంటే సీజన్ స్టార్టింగ్ లో ఎంట్రీ ఇచ్చిన వారిలో స్ట్రాంగ్ అంటే భరణినే అనుకున్నారు. సీరియల్ యాక్టర్ గా అతనికి మంచి ఫాలోయింగ్ ఉంది. విలన్ గా చాలా సీరియల్స్ తో మెప్పించాడు. కచ్చితంగా అతను హౌస్ లో చక్రం తిప్పుతాడు అనుకున్నారు. కానీ భరణి తన మీద పెట్టుకున్న అంచనాలను అందుకోలేదు. ఫైనల్ గా భరణి ఒకసారి ఎలిమినేట్ అయ్యి వచ్చేశాడు.

హౌస్ లోకి భరణి, శ్రీజ..

ఐతే బిగ్ బాస్ సీజన్ 9లో రెండో ఛాన్స్ వచ్చింది. భరణి, శ్రీజలను హౌస్ లోకి పంపించి ఇద్దరికి కొన్ని టాస్క్ లు పెట్టాడు. శ్రీజ పెట్టిన నాలుగు టాస్క్ లల్లో ఒకటి గెలిస్తే.. భరణి రెండు గెలిచాడు. ఒక టాస్క్ క్యాన్సిల్ అయ్యింది. అంతేకాదు ఆడియన్స్ ఓటింగ్ కూడా పెట్టగా భరణినే హౌస్ లో ఉంచాలి శ్రీజని కాదని రిజల్ట్ ఇచ్చారు. అలా భరణి తన సెకండ్ ఇన్నింగ్స్ హౌస్ లో మొదలు పెట్టాడు. ఐతే రీ ఎంట్రీ ఇచ్చాక కూడా భరణి అదే సేఫ్ ఆడుతూ వచ్చాడు. లాస్ట్ వీక్ నాగార్జున నీకు ఎందుకు చెబుతున్నానో అర్ధం చేసుకో భరణి నీకా కేపబిలిటీ ఉందని ప్రోత్సహించారు.

సో ఈ వారం భరణి చాలా యాక్టివ్ గా టాస్క్ లు ఆడుతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న బీబీ రాజ్యం టాస్క్ లో ప్రజల్లో ఉన్న భరణి రాజ్యంపై రాజులపై తిరుగుబాటు అంటూ నినాదాలు చెబుతూ ఆడియన్స్ ని అలరిస్తున్నాడు. భరణి ఇలా ఓపెన్ అయ్యి ఇన్వాల్వ్ అవ్వడాన్ని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇది కదా భరణి నీ దగ్గర నుంచి కావాల్సింది.. మేము ఆశించేది అని అనుకుంటున్నారు.

భరణి నుంచి ఏదైతే ఆశిస్తున్నారో..

ఈ వారం కెప్టెన్ ఇమ్మాన్యుయెల్ మినహా అందరు నామినేషన్స్ లో ఉన్నారు. ఐతే ఈ వీక్ భరణి సేఫ్ అయ్యే ఛాన్స్ లు హైగా ఉన్నాయి. దివ్య, గౌరవ్ ఈ ఇద్దరు డేంజర్ జోన్ లో ఉండే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత నిఖిల్, సంజన ఉన్నారు. మరి భరణి నుంచి ఏదైతే ఎంటర్టైన్మెంట్ ఆశిస్తున్నారో అది ఇస్తున్నారు కాబట్టి కొన్నాళ్లు అతను ఉండే ఛాన్స్ ఉందనిపిస్తుంది.

భరణితో పాటు సుమన్ శెట్టి కూడా తనకు బయట ఉన్న పాజిటివిటీని మరింత పెంచుకుంటున్నాడు. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ నిఖిల్ కూడా టాస్క్ లల్లో బాగానే పర్ఫార్మ్ చేస్తున్నాడు. గౌరవ్ టాస్క్ ఓడితే మాత్రం అవతల వారిని బ్లేం చేస్తూ ఊరికే బాగా నస పెడుతున్నాడు. ఈ విషయాలన్నీ ఆడియన్స్ పరిగణలోకి తీసుకుంటున్నారు.

Tags:    

Similar News