ఇప్పుడు యూత్ ఫోకస్ అంతా 'కింగ్డమ్' బ్యూటీపైనే!
అయితే అదంతా ఒకెత్తు అయితే.. ఆ సినిమా హీరోయిన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మూవీలో విజయ్ సరసన భాగ్య శ్రీ బొర్సే నటించగా.. ఇప్పుడు ఆమెపైనే అందరి ఫోకస్ పడింది.;
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ లీడ్ రోల్ లో నటించిన కింగ్డమ్ మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది. అన్ని పనులు పూర్తి చేసుకున్న ఆ సినిమా.. జులై 31న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే మూవీపై మేకర్స్ ప్రమోషనల్ కంటెంట్ తో మంచి బజ్ క్రియేట్ చేశారు. కచ్చితంగా సినిమా హిట్ అవుద్దనే హైప్ సృష్టించారు.
అయితే అదంతా ఒకెత్తు అయితే.. ఆ సినిమా హీరోయిన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మూవీలో విజయ్ సరసన భాగ్య శ్రీ బొర్సే నటించగా.. ఇప్పుడు ఆమెపైనే అందరి ఫోకస్ పడింది. నెటిజన్లంతా తెగ డిస్కస్ చేసుకుంటున్నారు. సో గ్లామరస్.. చాలా అందంగా ఉన్నారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
నేచురల్ బ్యూటీ అంటూ సందడి చేస్తున్నారు. రష్మిక, కీర్తి సురేష్ ను ఒకేసారి చూసినట్టు ఉందని చెబుతున్నారు. మనసులు కొల్లగొట్టారని అంటున్నారు. యూత్ కొత్త క్రష్ అంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు. దీంతో ఆమె పిక్స్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. అదే సమయంలో ఆమె పేరు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
అయితే మహారాష్ట్రకు చెందిన భాగ్యశ్రీకి అందం, అభినయం సమపాళ్లలో ఉంటాయనే చెప్పాలి. నైజీరియాలోని లాగోస్ లో చదువుకున్న.. ఇండియా వచ్చాక బిజినెస్ మేనేజ్మెంట్ డిగ్రీలో చేరింది. ఆ సమయంలో మోడలింగ్ కెరీర్ గా ఎంచుకుని అడుగులు వేసింది. పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరించింది భాగ్యశ్రీ.
క్యాడ్‌బరీ డైరీ మిల్క్ సిల్క్ యాడ్ తో పాపులర్ అయిన అమ్మడు.. యారియాన్ 2తో సినీ ఇండస్ట్రీలోకి వచ్చింది. బాలీవుడ్ లో రెండేళ్ల క్రితం రిలీజ్ అయిన ఆ సినిమాలో ఓ రోల్ లో కనిపించి మెప్పించింది. ఆ తర్వాత చందు ఛాంపియన్ లోనూ నటించివ భాగ్యశ్రీ.. మాస్ మహారాజా రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీతో తెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.
డెబ్యూతో హిట్ అందుకోకపోయినా.. మంచి క్రేజ్ ఆమె సొంతమైంది. దీంతో వరుస ఆఫర్స్ వచ్చాయి. ఇప్పుడు కింగ్డమ్ తో సందడి చేయనుండగా.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఆంధ్రా కింగ్ తాలూకాలో ఆమెనే హీరోయిన్. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్, గ్లింప్స్ లో అదిరిపోయింది. ఆ తర్వాత మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కాంతలో నటిస్తున్న బ్యూటీ.. తన అప్ కమింగ్ ప్రాజెక్టులతో ఎలాంటి హిట్స్ అందుకుంటుందో వేచి చూడాలి.