భాగ్యం డబుల్ ఫీస్ట్.. మిస్ ఫైర్ అయితే మాత్రం..?
రవితేజ సినిమాతో తెరంగేట్రం చేస్తే కచ్చితంగా ఆమెకు లక్ కలిసి వస్తుందని ఇదివరకు చాలా మంది హీరోయిన్స్ ప్రూవ్ చేశారు.;
టాలీవుడ్ లో మిస్టర్ బచ్చన్ తో ఎంట్రీ ఇచ్చింది భాగ్య శ్రీ బోర్స్. రవితేజ సినిమాతో తెరంగేట్రం చేస్తే కచ్చితంగా ఆమెకు లక్ కలిసి వస్తుందని ఇదివరకు చాలా మంది హీరోయిన్స్ ప్రూవ్ చేశారు. మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ అయినా భాగ్య శ్రీకి మంచి క్రేజ్ వచ్చింది. ఇక ఆ సినిమా తర్వాత విజయ్ దేవరకొండతో కింగ్ డమ్ సినిమా చేసింది అమ్మడు. ఐతే కింగ్ డం రిజల్ట్ తో భాగ్య శ్రీకి మరో షాక్ తగిలినట్టు అయ్యింది. సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకోగా అది కాస్త నిరాశపరచింది.
దుల్కర్ సల్మాన్ తో భాగ్య శ్రీ కాంతా..
ఐతే ఫలితాలు ఎలా ఉన్నా కూడా భాగ్య శ్రీకి ఆఫర్లు మాత్రం తగ్గట్లేదు. నవంబర్ లో అమ్మడు ఏకంగా రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అందులో ఒక పీరియాడికల్ మూవీ కాగా మరొకటి లవ్ స్టోరీ. దుల్కర్ సల్మాన్ తో భాగ్య శ్రీ బోర్స్ నటించిన కాంతా సినిమా నవంబర్ 14న రిలీజ్ అవుతుంది. 1950 బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా వస్తుంది. సినిమా టీజర్ ఇంప్రెస్ చేయగా దుల్కర్ తో భాగ్య శ్రీ స్క్రీన్ ప్రెజన్స్ ఇంపాక్ట్ చూపించేలా ఉంది. ముఖ్యంగా కాంతా లో భాగ్య శ్రీ లుక్స్ అదిరిపోయాయి.
ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ కాబోతుంది. ఇక ఈ సినిమాతో పాటుగా నవంబర్ 28న రామ్ ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాతో వస్తుంది. ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాలో రామ్, భాగ్య శ్రీ ఇద్దరి జోడీ అదిరిపోయింది. ఈ సినిమాలో రామ్ గర్ల్ ఫ్రెండ్ గా భాగ్య శ్రీ లుక్స్ యూత్ ఆడియన్స్ కి సూపర్ గా నచ్చేశాయి.
భాగ్య శ్రీ కెరీర్ ని డిసైడ్ చేయబోతున్నాయి..
కాంతా, ఆంధ్రా కింగ్ తాలూకా ఈ రెండు సినిమాలతో భాగ్య శ్రీ బోర్స్ తన సత్తా చాటాలని చూస్తుంది. మిస్టర్ బచ్చన్ మిస్ ఫైర్ అయినా కింగ్ డమ్ తో క్యాష్ చేసుకోలేకపోయినా సరే రాబోతున్న రెండు సినిమాల మీద భాగ్య శ్రీ చాలా హోప్స్ తో ఉంది. కాంతా, ఆంధ్రా కింగ్ తాలూకా రెండు వారాల గ్యాప్ లో రెండు సినిమాలతో అమ్మడు వస్తుంది. మరి ఈ సినిమాలతో అయినా అమ్మడు లక్ తెచ్చుకుంటుందా లేదా అన్నది చూడాలి.
స్టార్ హీరోయిన్ కటౌట్ ఉన్న భాగ్య శ్రీ కెరీర్ లో ఒక్క హిట్ కోసం ఈగర్ గా ఎదురుచూస్తుంది. ఐతే రాబోతున్న కాంత, ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాలు మాత్రం భాగ్య శ్రీ కెరీర్ ని డిసైడ్ చేయబోతున్నాయి. ఈ సినిమాలతో పాటు భాగ్య శ్రీ మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్ ల డిస్కషన్స్ లో ఉంది. ఐతే రాబోతున్న సినిమాలు రిజల్ట్ చూసి వాటిలో ఆమెను కన్ఫర్మ్ చేస్తారని తెలుస్తుంది. భాగ్య శ్రీ మాత్రం టాలీవుడ్ లో టాప్ లెవెల్ కి వెళ్లే దాకా అసలు వెనక్కి తగ్గేదేలేదు అని ఫిక్స్ అయ్యింది.