బచ్చన్ బ్యూటీకి లక్కీ ఛాన్స్..!

మిస్టర్ బచ్చన్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భాగ్య శ్రీ బోర్స్ సక్సెస్ లు ఉన్నా లేకపోయినా సరే అమ్మడికి అవకాశాలు మాత్రం వరుసగా వస్తున్నాయి.;

Update: 2025-12-14 07:17 GMT

మిస్టర్ బచ్చన్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భాగ్య శ్రీ బోర్స్ సక్సెస్ లు ఉన్నా లేకపోయినా సరే అమ్మడికి అవకాశాలు మాత్రం వరుసగా వస్తున్నాయి. మిస్టర్ బచ్చన్ తర్వాత కింగ్ డం వచ్చి నిరాశపరచింది. ఐతే రీసెంట్ గా అమ్మడు రెండు వారాల గ్యాప్ లోనే రెండు సినిమాలతో వచ్చింది. అందులో ఒకటి కాంత కాగా రెండోది ఆంధ్ర కింగ్ తాలూకా. ఈ సినిమాల కమర్షియల్ లెక్కలు ఎలా ఉన్నా రెండిటిలో భాగ్య శ్రీ గ్లామర్ తో పాటు యాక్టింగ్ కూడా ఇంప్రెస్ చేసింది.

ఫిమేల్ సెంట్రిక్ సినిమాలో భాగ్య శ్రీ బోర్స్..

తనలోని నటిని పరిచయం చేసిన భాగ్య శ్రీకి మరిన్ని ఛాన్స్ లు వస్తున్నాయి. ఆల్రెడీ అమ్మడు మరో రెండు సినిమాల్లో డిక్షన్ లో ఉందని తెలుస్తుంది. ఐతే లేటెస్ట్ గా స్వప్న సినిమా బ్యానర్ లో నూతన దర్శకుడు చేస్తున్న ఒక ఫిమేల్ సెంట్రిక్ సినిమాలో హీరోయిన్ గా భాగ్య శ్రీ ఎంపికైందని తెలుస్తుంది. భాగ్య శ్రీకి ఇది నిజంగానే లక్కీ ఛాన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వైజయంతి బ్యానర్, స్వప్న సినిమాస్ లో సినిమా అంటే టాప్ క్లాస్ లెవెల్ లో ఉంటాయి.

అందులోనూ లేడీ ఓరియెంటెడ్ సినిమా అంటే ఆ లెక్క వేరే ఉంటుంది. కెరీర్ ఎర్లీ స్టేజ్ లోనే భాగ్య శ్రీకి ఈ ఛాన్స్ నిజంగానే లక్కీ అని చెప్పొచ్చు. రమేష్ అనే నూతన దర్శకుడు ఈ సినిమాను కంప్లీట్ గా డిఫరెంట్ స్టోరీతో తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నాడట. ఆంధ్రా కింగ్ తాలూకాతో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసిన భాగ్య శ్రీ ఈ సినిమాతో మరోసారి తన టాలెంట్ చూపించాలని చూస్తుంది.

రిజల్ట్ తో సంబంధం లేకుండా అవకాశాలు..

భాగ్య శ్రీ బోర్స్ కూడా కెరీర్ లో తన సత్తా చాటే ఒక పాత్ర కోసం ఎదురుచూస్తుంది. ఐతే స్వప్న సినిమాస్ అలాంటి కథతోనే వచ్చారని తెలుస్తుంది. ఈ సినిమాకు టైటిల్ గా చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా అని ఫిక్స్ చేశారట. ఐతే ఈ సినిమాలో భాగ్య శ్రీకి పెయిర్ గా నటించే హీరో ఎవరన్నది ఇంకా క్లారిటీ రాలేదు.

భాగ్య శ్రీ బోర్స్ కి రిజల్ట్ తో సంబంధం లేకుండా అవకాశాలు వస్తున్నాయి. ఐతే ఈ ఛాన్స్ లతో పాటు అమ్మడు కూడా సక్సెస్ ట్రాక్ ఎక్కితే మాత్రం ఇక తిరుగు ఉండదని చెప్పొచ్చు. తెలుగులో స్టార్ క్రేజ్ వస్తే మాత్రం అది కేవలం తెలుగు వరకే కాదు పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ తెచ్చుకునే ఛాన్స్ ఉంది. అందుకే భాగ్య శ్రీ కూడా టాలీవుడ్ లో తన పాపులారిటీ పెంచుకునే ప్రయత్నాల్లో ఉంది. కాంత, ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాలతో ఆమె యాక్టింగ్ పరంగా ఇంప్రెస్ చేయడంతో ఆమెకు కూడా బలమైన పాత్రలు ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

Tags:    

Similar News