బిగ్ బాస్ 9.. ఫ్యామిలీ వీక్ ఎప్పుడు..?
బిగ్ బాస్ సీజన్ 9 చూస్తూ చూస్తూనే 10వ వారం లోకి ఎంటర్ అయ్యింది. అంటే అప్పుడే ఈ సీజన్ మొదలై 70 రోజులు కావొస్తుంది.;
బిగ్ బాస్ సీజన్ 9 చూస్తూ చూస్తూనే 10వ వారం లోకి ఎంటర్ అయ్యింది. అంటే అప్పుడే ఈ సీజన్ మొదలై 70 రోజులు కావొస్తుంది. ఈ సీజన్ ముందు 14 మందితో మొదలైంది. ఆ తర్వాత ఐదుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చారు. ఇక 10 వారామ తర్వా ప్రస్తుతం హౌస్ లో 11 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈ సీజన్ ముందు పంపించిన కంటెస్టెంట్స్ మాత్రమే కాకుండా రెండు వారాల తర్వాత దివ్యని హౌస్ లోకి పంపించారు. ఇక ఆ తర్వాత వైల్డ్ కార్డ్స్ రాగా ఆ తర్వాత మళ్లీ భరణి, శ్రీజలను హౌస్ లోకి పంపించి భరణిని మళ్లీ పర్మినెంట్ హౌస్ మేట్ చేశారు.
ప్రతి సీజన్ లో 10 లేదా 11వ వారం ఫ్యామిలీ వీక్..
ఐతే బిగ్ బాస్ ప్రతి సీజన్ లో 10 లేదా 11వ వారం ఫ్యామిలీ వీక్ వస్తుంది. ఆ టైం లో హౌస్ మేట్స్ అంతా కూడా చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతారు. ఐతే ప్రతి సీజన్ లానే ఈ సీజన్ కూడా 10వ వారమే ఫ్యామిలీ వీక్ అనుకున్నారు. కానీ బిగ్ బాస్ ఫ్యామిలీ వీక్ ముందు 10వ వారమే పెట్టాలని అనుకున్నా దాన్ని నెక్స్ట్ వీక్ కి పోస్ట్ పోన్ చేశారని తెలుస్తుంది. అందుకే 10వ వారం బిగ్ బాస్ రాజ్యం టాస్క్ మొదలు పెట్టారు.
హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా ఈ వారం ఫ్యామిలీ వీక్ అవుతుందని అనుకున్నారు. ఐతే వాళ్లు ముందే ఊహిస్తున్నారు అన్న కారణంతో కూడా ఫ్యామిలీ వీక్ ని నెక్స్ట్ వీక్ కి వాయిదా వేశారని చెప్పుకుంటున్నారు. ఐతే ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో భాంగా బిగ్ బాస్ రాజ్యం టాస్క్ నడుస్తుంది. అందులో కళ్యాణ్ రాజుగా.. దివ్య, రీతు రాణిగా చేస్తున్నారు. కమాండర్స్ గా తనూజ, డీమాన్ పవన్, నిఖిల్, సంజన ఉన్నారు.
బీబీ రాజ్యం టాస్క్ లో ఎవరికి వారు పర్ఫార్మెన్స్..
ఇక రాజ్యంలో జనాల్లాగా భరణి, ఇమ్మాన్యుయెల్, గౌరవ్, సుమన్ శెట్టి ఉన్నారు. ఈ టాస్క్ లో ఎవరు ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తారన్నది చూసి వారికి ఇమ్యునిటీతో పాటుగా కెప్టెన్సీ కంటెండర్ గా అయ్యే ఛాన్స్ ఉంటుంది. బిగ్ బాస్ ఇచ్చిన బీబీ రాజ్యం టాస్క్ లో ఎవరికి వారు పర్ఫార్మెన్స్ ఇచ్చి ఇమ్యునిటీ సాధించాలని ప్రయత్నిస్తున్నారు.
బిగ్ బాస్ సీజన్ 9 టాప్ 5 లేదా 6 ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. తనూజ, ఇమ్మాన్యుయెల్ దాదాపు ఫైనల్ వీక్ దాకా ఉండటం కన్ ఫర్మ్ అని చెప్పుకున్నా మిగిలిన నాలుగు స్థానాల్లో ఎవరెవరు ఉంటారన్నది చూడాలి. ఐతే కళ్యాణ్ కూడా టాప్ 5 పక్కా అనే విధంగా వైబ్ కనిపిస్తుంది. ఇక మిగిలిన వారిలో సుమన్ శెట్టికి ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. డీమాన్ పవన్, రీతు, సంజన వీరిలో నెక్స్ట్ మూడు స్థానాలు ఎవరన్నది రాబోయే వారాల్లో వారి ఆటని బట్టి తెలుస్తుంది.