అతనో అబద్దాలకోరు.. బండ్లగణేష్ ట్వీట్ ఎవరికోసం?
బండ్ల గణేష్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భక్తుడిగా తనను తాను ఎప్పుడూ చెప్పుకునే ఈయన.. గత కొంతకాలంగా తన దేవుడికి కొన్ని దుష్టశక్తులు తనను దూరం చేస్తున్నాయి అంటూ పరోక్షంగా సోషల్ మీడియాలో ట్వీట్లు పెడుతున్న విషయం తెలిసిందే.;
బండ్ల గణేష్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భక్తుడిగా తనను తాను ఎప్పుడూ చెప్పుకునే ఈయన.. గత కొంతకాలంగా తన దేవుడికి కొన్ని దుష్టశక్తులు తనను దూరం చేస్తున్నాయి అంటూ పరోక్షంగా సోషల్ మీడియాలో ట్వీట్లు పెడుతున్న విషయం తెలిసిందే. ..అంతేకాదు అటు సినిమా ఫంక్షన్లలో కూడా కొంతమంది వ్యక్తులను ఉద్దేశిస్తూ ఆయన చేసే కామెంట్లు ఆయనను వార్తల్లో నిలిచేలా చేస్తూ వుంటాయి.
ఈ క్రమంలోనే ఇటీవల మౌళి హీరోగా వచ్చిన 'లిటిల్ హార్ట్స్' సక్సెస్ మీట్ లో కూడా ఏకంగా అల్లు అరవింద్ ముందే.." మహార్జాతకుడు.. కష్టపడకుండానే జేబులోకి డబ్బులు వస్తాయి" అంటూ సంచలన కామెంట్లు చేసి వార్తల్లో నిలిచారు. ఇప్పుడు ఆయన ఎటువంటి ఇన్ డైరెక్ట్ హింట్ ఇవ్వకుండా.. ఎవరికోసం ట్వీట్ పెట్టారో తెలియకుండా.. చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా పలు అనుమానాలకు దారి తీస్తోంది.
నిత్యం కాంట్రవర్సీ డైలాగ్స్ తో వార్తల్లో నిలిచే బండ్ల గణేష్ తాజాగా మరో సంచలన ట్వీట్ చేశారు.. ఆయన తన ఎక్స్ అధికారిక ఖాతా ద్వారా.." అతను గతం, వర్తమానం, భవిష్యత్తు గురించి ఎప్పుడూ అబద్ధాలు చెబుతాడు.
అతను తన గురించి కూడా అబద్ధాలు చెబుతాడు.
అతను తన నేపథ్యం గురించి కూడా అబద్ధాలు చెబుతాడు.
అతను తన విద్య గురించి అబద్ధాలు చెబుతాడు.
అతను తన విజయాల గురించి అబద్ధాలు చెబుతాడు.
అతను తన వైఫల్యాల గురించి అబద్ధాలు చెబుతాడు.
అబద్ధం చెబుతున్నాడని పట్టుబడినప్పుడు,
అబద్ధం గురించి కూడా అబద్ధం చెబుతాడు..
అబద్ధాలకు సాక్ష్యం ఉన్నప్పుడు,
ఇతరులే అబద్ధం చెప్పారు అని చెబుతాడు.
తర్వాత కొత్త అబద్ధాలకు వెళ్తాడు".. అంటూ బండ్ల గణేష్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. అసలు బండ్ల గణేష్ ఈ ట్వీట్ ఎవరికోసం చేశాడు? ఎవరిని ఉద్దేశించి చేశాడు? అంటూ అభిమానులు కూడా గందరగోళానికి గురవుతున్నారు. ఏది ఏమైనా బండ్ల గణేష్ చేసిన ఈ ట్వీట్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
బండ్ల గణేష్ కెరియర్ విషయానికి వస్తే.. నటుడిగా కెరియర్ ను మొదలుపెట్టిన ఈయన కమెడియన్ గా పలు చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలా సూర్యవంశం, సుస్వాగతం, నువ్వు నాకు నచ్చావ్, సరిలేరు నీకెవ్వరు, ఆంధ్రావాలా, మల్లీశ్వరి, సాంబయ్య, భరత సింహారెడ్డి వంటి చిత్రాలలో సహాయ పాత్రలు పోషించారు. అటు నిర్మాతగా.. ఆంజనేయులు, తీన్మార్, గబ్బర్ సింగ్, బాద్ షా , ఇద్దరమ్మాయిలతో వంటి పలు సినిమాలను నిర్మించాడు. అంతేకాదు ఇటీవల ' డేగల బాబ్జి' సినిమాతో హీరోగా కూడా అవతారం ఎత్తారు బండ్ల గణేష్. ఇప్పుడు సోషల్ మీడియాలో కాంట్రవర్సీ కామెంట్లతో వార్తల్లో నిలుస్తున్నారు.