బండ్ల గణేష్ దీపావళి పార్టీ.. బాస్‌కు రాజమర్యాద!

పండగంటే సెలబ్రేషన్స్, ఆ సెలబ్రేషన్స్‌కు కేరాఫ్ అడ్రస్ మన సినీ తారలు. ఈ దీపావళికి టాలీవుడ్‌లో అలాంటి ఒక గ్రాండ్ పార్టీయే హాట్ టాపిక్‌గా మారింది.;

Update: 2025-10-18 16:41 GMT

పండగంటే సెలబ్రేషన్స్, ఆ సెలబ్రేషన్స్‌కు కేరాఫ్ అడ్రస్ మన సినీ తారలు. ఈ దీపావళికి టాలీవుడ్‌లో అలాంటి ఒక గ్రాండ్ పార్టీయే హాట్ టాపిక్‌గా మారింది. ఆ పార్టీ ఇచ్చింది మరెవరో కాదు, బ్లాక్‌బస్టర్ ప్రొడ్యూసర్, పవర్ స్టార్ వీరాభిమాని బండ్ల గణేష్. ఈ వేడుకకు ఇండస్ట్రీలోని బిగ్ సెలబ్రెటీలు హాజరైనా, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది మాత్రం మెగాస్టార్ చిరంజీవి, ఆయనపై బండ్ల గణేష్ చూపించిన ఒక స్పెషల్ మూమెంట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో, పార్టీకి విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి కూర్చోవడానికి సిద్ధమవుతుండగా, బండ్ల గణేష్ స్వయంగా పక్కకు వెళ్లి, ప్రత్యేకంగా ఆయన కోసమే అలంకరించిన ఒక సింహాసనం లాంటి పెద్ద కుర్చీని తీసుకువచ్చారు. కేవలం తీసుకురావడమే కాదు, ఎంతో వినయంగా, గౌరవంగా బాస్‌ను అందులో కూర్చోమని కోరారు.

ఆ సమయంలో బండ్ల గణేష్ ముఖంలో కనిపించింది అభిమానం కాదు, ఒకరకమైన భక్తి. బండ్ల గణేష్‌కు పవన్ కళ్యాణ్ పట్ల, మెగా ఫ్యామిలీ పట్ల ఉన్న ప్రేమ, భక్తి గురించి అందరికీ తెలిసిందే. ఆయన స్పీచ్‌లలో ఆ ప్యాషన్ ప్రతీసారి బయటపడుతుంది. ఇప్పుడు ఆ భక్తిని చేతల్లో చూపించారు. తన ఇంటికి వచ్చిన ఇండస్ట్రీ పెద్దన్నకు ఎలాంటి గౌరవం ఇవ్వాలో చేసి చూపించారు. చిరంజీవిని ఆ కుర్చీలో కూర్చోబెడుతున్నప్పుడు, ఆయన చూపించిన శ్రద్ధ చూస్తే ఎవరికైనా వావ్ అనిపించాల్సిందే.

ఈ దీపావళి వేడుకకు చిరంజీవితో పాటు విక్టరీ వెంకటేష్, దర్శకులు హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, హీరోలు శ్రీకాంత్, ఆయన తనయుడు రోషన్ మేక, సిద్ధు జొన్నలగడ్డ, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ యెర్నేని వంటి ఎందరో ప్రముఖులు హాజరయ్యారు. ఇంతమంది స్టార్ల మధ్య, చిరంజీవికి బండ్ల గణేష్ ఇచ్చిన ఈ రాజమర్యాద పార్టీకే హైలైట్‌గా నిలిచింది.

ఈ వీడియో చూసిన ఫ్యాన్స్, నెటిజన్లు బండ్ల గణేష్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అభిమానం అంటే ఇది అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు, బండ్ల చూపిస్తున్న ప్రేమను చిరంజీవి కూడా అంతే ఆప్యాయంగా, ఒక చిరునవ్వుతో స్వీకరించడం ఆయన హుందాతనాన్ని చూపిస్తోంది. ఇక మిగతా బిగ్ స్టార్స్ కు కూడా బండ్ల గణేష్ అదే తరహాలో వెల్కమ్ చెప్పారు. మరి ఈ పార్టీ వెనకున్న అసలు రీజన్ ఏమై ఉంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Tags:    

Similar News