యువ సంచ‌ల‌నాల‌తో బాలయ్య మాస్ అడుగులు!

న‌ట‌సింహ బాలకృష్ణ మైండ్ లో ఫిక్స్ అయ్యారంటే? బ్లైండ్ గా వెళ్లిపోతారు. ఆయ‌న‌తో సినిమా చేయాలంటే? గంట‌ల కొద్ది స‌మ‌యం కేటాయించి స్టోరీ నేరేట్ చేయాల్సిన ప‌నిలేదు.;

Update: 2026-04-18 08:49 GMT

న‌ట‌సింహ బాలకృష్ణ మైండ్ లో ఫిక్స్ అయ్యారంటే? బ్లైండ్ గా వెళ్లిపోతారు. ఆయ‌న‌తో సినిమా చేయాలంటే? గంట‌ల కొద్ది స‌మ‌యం కేటాయించి స్టోరీ నేరేట్ చేయాల్సిన ప‌నిలేదు. సింగిల్ సిట్టింగ్ లో లైన్ ఒకే చేయించుకుంటే చాలు. ఆ లైన్ న‌చ్చిందంటే బాల‌య్య క‌మిట్ అయిపోతారు. బాల‌య్య కెరీర్ మొత్తం చూస్తే చాలా సినిమాలు అలా చేసిన‌వే. క‌థ కంటే ఆయ‌న డైరెక్ట‌ర్ ట్రాక్ రికార్డు..అత‌డిపై ఉన్న న‌మ్మ‌కంతో ముందుకెళ్లిపోతారు. డైరెక్ట‌ర్ల‌ను రిపీట్ చేయ‌డంతో పాటు, కొత్త ద‌ర్శ‌కుల‌తో ప‌నిచేయ‌డానికి బాల‌య్య అంతే ఆస‌క్తి చూపిస్తారు. ఆ ర‌కంగా న‌వ‌తరం ద‌ర్శ‌కుల్ని ప్రోత్స‌హించ‌డంలో బాల‌య్య ముందుటార‌ని ఎన్నోసార్లు చాటి చెప్పారు.

ప్రస్తుతం బాలకృష్ణ క‌థానాయ‌కుడిగా గోపీచంద్ మలినేని ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో మాస్ ఎంటర్టైనర్ తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఇద్ద‌రి కాంబినేష‌న్ లో రిలీజ్ అయిన `వీరసింహారెడ్డి` బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించడంతో? తాజా చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. గోపీచంద్ మలినేని బాలయ్యలోని మాస్ యాం గిల్‌ను పర్ఫెక్ట్‌గా ప్రెజెంట్ చేస్తారనే నమ్మకం అభిమానుల్లో బ‌లంగా ఉంది. ఈ కమర్షియల్ సినిమాతో పాటు బాల‌య్య ప్రయోగాత్మక కథలపై కూడా దృష్టి పెడుతున్నారు. గ్యాప్ లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు రిలీజ్ చేసేలా బాల‌య్య క‌మిట్ మెంట్లు క‌నిపిస్తున్నాయి.

బాలయ్య లైనప్‌లో ఉన్న ఇతర దర్శకులను చూస్తే ఆయన స్ట్రాటజీ అర్థమవుతుంది. `నాంది`, `ఉగ్రం` వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజయ్ కనకమేడలకు బాల‌య్య‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సామాజిక అంశాలను కమర్షియల్ హంగులతో చెప్పే విజయ్ స్టైల్ బాలయ్యకు బాగా నచ్చినట్లు తెలుస్తోంది. అలాగే క్లాస్ - వైవిథ్య‌మైన‌ కథనాలకు పెట్టింది పేరైన వివేక ఆత్రేయతో సినిమా చేసేందుకు సిద్ధమవ్వడం బాలయ్య తీసుకున్న మ‌రో సాహసోపేతమైన నిర్ణయంగా చెప్పొచ్చు. వీరితో పాటు `బింబిసార` వంటి సోషియో ఫాంటసీ హిట్ అందించిన వశిష్ట కూడా బాలయ్య కోసం ఓ పవర్‌ఫుల్ కథను సిద్ధం చేసినట్లు సమాచారం.

తొడగొట్టే మాస్ సీన్లు, భారీ డైలాగులకే పరిమితం కాకుండా బలమైన కంటెంట్ - లాజిక్ ఉన్న కథలను ఎంచుకోవడం వెనుక‌ బాలయ్య వ్యూహం క‌నిపిస్తుంది. యువ దర్శకుల కొత్త తరహా ఆలోచనలకు తన ఇమేజ్‌ తోడైతే ఫలితం మరో స్థాయిలో ఉంటుందని బాల‌య్య బ‌లంగా విశ్వ‌షిస్తున్నారు. మారుతోన్న సమీకరణాలు బాలకృష్ణ కెరీర్‌కు సెకండ్ ఇన్నింగ్స్‌లో సరికొత్త ఊపునిస్తున్నాయి. గతంలో కొన్ని ఫార్ములా సినిమాలకే పరిమితమయ్యారనే విమర్శలు బాల‌య్య ఎదుర్కున్నారు.

తాజాగా బాల‌య్య డైరెక్ట‌ర్ల లైన‌ప్ చూస్తే ఆ విమర్శలకు చెక్ పెడుతున్న‌ట్లే ఉంది. బాలయ్య తీసుకున్న సరికొత్త నిర్ణయాలు ఇంకొంత మంది హీరోలకు దిశానిర్దేశంలా మారుతున్నాయి. యువ ప్రతిభను నమ్ముకుని, మారుతోన్న ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా అడుగులు వేస్తున్న బాలకృష్ణ రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలు న‌మోదు చేసే అవ‌కాశం ఉంది. కంటెంట్ ఉన్న కథలకు తన మాస్ ఇమేజ్ తోడైతే బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని బాల‌య్య గ‌ట్టిగా న‌మ్ముతున్నారు.

Tags:    

Similar News