బాలయ్య.. ఇది కదా ఫ్యూచర్ ప్లాన్ అంటే..

ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలతో పాటు అప్ కమింగ్ ప్రాజెక్టులపై కూడా క్లారిటీ రావడంతో ఆయన లైనప్ చర్చనీయాంశంగా మారింది.

Update: 2026-06-11 23:30 GMT

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కెరీర్‌ లో ఫుల్ స్పీడ్‌ లో దూసుకెళ్తున్నారు. ఒక సినిమా షూటింగ్‌ లో ఉండగానే మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆయనకు కొత్తేమీ కాదు. అయితే ఈసారి బాలయ్య ప్లానింగ్ చూసి అభిమానులే షాక్ అవుతున్నారు. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలతో పాటు అప్ కమింగ్ ప్రాజెక్టులపై కూడా క్లారిటీ రావడంతో ఆయన లైనప్ చర్చనీయాంశంగా మారింది.

ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న సినిమా (ఎన్‌బీకే 111) షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే ఆ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా విడుదలైన గ్లింప్స్‌ కు మంచి రెస్పాన్స్ లభించింది. ముఖ్యంగా ఆయన కొత్త లుక్, స్టైలిష్ ప్రెజెంటేషన్ అభిమానులను ఆకట్టుకున్నాయి. గత సినిమాలతో పోలిస్తే మరింత ఫిట్‌ గా కనిపించడం కూడా చర్చకు దారితీసింది.

గ్లింప్స్‌ లో బాలయ్యను గాడ్ ఆఫ్ మాసెస్ గా కాకుండా ది కింగ్ ఆఫ్ కేయాస్ గా పరిచయం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యాక్షన్, పవర్‌ ఫుల్ ఎలిమెంట్స్‌ తో రూపొందుతున్న ఆ సినిమాను దసరా సీజన్‌ లో విడుదల చేసే దిశగా నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ సినిమా తర్వాత బాలయ్య చేయబోయే ప్రాజెక్టులపై కూడా ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది.

మలినేని మూవీ తర్వాత దర్శకుడు కొరటాల శివతో బాలయ్య వర్క్ చేయనున్న విషయం తెలిసిందే. కొరటాల మార్క్ కమర్షియల్ ఎలిమెంట్స్, బాలయ్య మాస్ ఇమేజ్ కలిస్తే మరో భారీ సినిమా వచ్చే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. అదే సమయంలో దర్శకుడు వివేక్ ఆత్రేయతో కూడా బాలయ్య సినిమా ఉండొచ్చనే వార్తలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. మొదట్లో దీనిపై అనుమానాలు వ్యక్తమైనప్పటికీ, రీసెంట్ గా క్లారిటీ వచ్చేసింది.

బాలయ్య బర్త్ డే సందర్భంగా వివేక్ ఆత్రేయ స్వయంగా వెళ్లి విషెస్ చెప్పడం, అదే సమయంలో మైత్రీ మూవీ మేకర్స్ అధినేత కూడా ఆయనను కలవడం ఆసక్తికరంగా మారింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌ పై బాలయ్య ఆ మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో బాలయ్య సినిమా వచ్చే అవకాశాలు స్ట్రాంగ్ గా మారాయి. కమర్షియల్ సినిమాలకు భిన్నంగా కథలు చెప్పడంలో వివేక్ ఆత్రేయకు ప్రత్యేక గుర్తింపు ఉండటంతో, బాలయ్యతో మూవీ ఎలా ఉండబోతుందన్న ఆసక్తి కూడా నెలకొంది.

మరోవైపు దర్శకుడు విజయ్ కనకమేడలతో బాలయ్య సినిమా కూడా చర్చల్లో ఉంది. కొంతకాలం క్రితం ఆ ప్రాజెక్టుపై డౌట్స్ వచ్చినప్పటికీ, ప్రస్తుతం అది కూడా ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. రీసెంట్ గా బర్త్ డే నాడే బాలయ్యను విజయ్ కనకమేడల కలవడం, కథపై చర్చలు కూడా కొనసాగుతున్నాయన్న ప్రచారం జరగడం ఆ వార్తలకు బలం చేకూరుస్తోంది.

ఏదేమైనా గోపీచంద్ మలినేని సినిమా తర్వాత కొరటాల శివ, వివేక్ ఆత్రేయ, విజయ్ కనకమేడల దర్శకత్వంలో వరుసగా సినిమాలు చేసేందుకు బాలయ్య రెడీ అవుతున్నారు. అయితే ఒకేసారి పలు ప్రాజెక్టులను లైన్‌ లో పెట్టడం ద్వారా తన కెరీర్‌ ను క్లియర్ గా ముందుగానే ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకే అభిమానులు ఇది కదా ఫ్యూచర్ ప్లాన్ అంటే అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News