ఆ విష‌యంలో న‌టసింహం కూడా త‌గ్గేదేలే!

ఇప్ప‌టికే వ్యాయామం, ఆహార‌పు అలవాట్ల‌లో చిన్న పాటి మార్పులు చేసారుట‌. అలాగే హెయిర్ స్టైల్ కూడా కొత్త‌గా ఉండ‌బో తుందిట‌.;

Update: 2025-07-23 00:30 GMT

న‌టసింహ బాల‌కృష్ణ పాత్ర‌ల ప‌రంగా ఎన్నో మార్పులు చూసాం. పాత్ర‌కు త‌గ్గ‌ట్టు ర‌క‌ర‌కాల హ‌వ‌భావాల‌తో ప్రేక్ష‌కుల్ని అల‌రించారు. కానీ అదే పాత్ర కోసం బాల‌య్య శారీర‌కంగా త‌న‌ని తాను మ‌లుచుకున్న‌ది మాత్రం ఇంత వ‌ర‌కూ ఏ సినిమాకు జ‌ర‌గ‌లేదు. వెయిట్ లాస్ అవ్వ‌డం గానీ, పెర‌గ‌డం గానీ ఇలాంటి మార్పులు ఏ పాత్ర కోసం బాల‌య్య ప్ర‌త్యేకంగా స‌న్న‌ధం అవ్వ‌లేదు. బాల‌య్య వాస్తవ ఆహార్యాన్నే ద‌ర్శకు లంతా తెర‌పై ఆవిష్క‌రించారు. ఈ విష‌యంలో బాల‌య్య ఇంకా ఓల్డ్ ట్రెండ్ నే ఫాలో అవు తున్నారు.

అయితే అప్ క‌మింగ్ ప్రాజెక్ట్ కోసం మాత్రం బాల‌య్య ప్ర‌త్యేకంగా స‌న్న‌ధం అవుతున్న‌ట్లు తెలిసింది. లుక్ ప‌రంగా సింహం భారీ మార్పులే చేస్తోందిట‌. గోపీచంద్ మలినేని ద‌ర్వ‌క‌త్వంలో బాల‌య్య త‌దుప‌రి చిత్రం క‌న్ప‌మ్ అయిన సంగ‌తి తెలిసిందే. అఖండ 2 షూటింగ్ పూర్తికాగానే గోపీచంద్ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కుతుంది. అయితే కొత్త సినిమా కోసం బాల‌య్య లుక్ పూర్తిగా మారిపోతుందిట‌. స‌రికొత్త‌గా స్లిమ్ లుక్ ట్రాన్స‌ప‌ర్మేష‌న్ లో క‌నిపించ‌నున్నారుట‌. దీనిలో భాగంగా వెయిట్ త‌గ్గే ప‌నులు మొద‌లు పెట్టిన‌ట్లు తెలిసింది.

ఇప్ప‌టికే వ్యాయామం, ఆహార‌పు అలవాట్ల‌లో చిన్న పాటి మార్పులు చేసారుట‌. అలాగే హెయిర్ స్టైల్ కూడా కొత్త‌గా ఉండ‌బో తుందిట‌. ఈ చిత్రం కోసం విదేశాల నుంచి ఓ స్పెష‌ల్ హెయిర్ స్టైలిష్ ని రం గంలోకి దించుతున్నారుట‌. మొత్తానికి సింహం కూడా ఏ మాత్రం త‌గ్గ‌లేద‌ని మ‌రోసారి ప్రూవ్ అవుతుంది. ఫిట్ నెస్ విష‌యంలో సీనియ‌ర్ హీరోలు నాగార్జున‌, వెంక‌టేష్ ఎప్పుడూ ఒకేలా ఉంటారు. 60 ఏళ్లు దాటినా మ‌న్మ‌ధుల్లా హైలైట్ అవుతుంటారు. నాగార్జున స్పూర్తితో మెగాస్టార్ చిరంజీవి కూడా స్లిమ్ లుక్ లోకి మారిపోయారు.

`విశ్వంభ‌ర` చిత్రంలో చిరంజీవి స్లిమ్ లుక్ ఇప్ప‌టికే నెట్టింట వైర‌ల్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. 70 ఏళ్ల చిరంజీవి 40 ఏళ్ల హీరోలా క‌నిపిస్తున్నారు. తాజాగా బాల‌య్య కూడా అదే త‌రహాలో లుక్ లో భారీ మార్పులు చేస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. అయితే బాల‌య్య సిస‌లైన బ‌రిలోకి దిగేది మాత్రం `అఖండ‌2` త‌ర్వాతే ఉం టుంది. ఈసినిమాకు బాల‌య్య ఇప్ప‌టిలుక్ మాత్ర‌మే సెట్ అవుతుంది. స్లిమ్ లుక్ అన్న‌ది ఈ క‌థ‌కు వ‌ర్కౌట్ అవ్వ‌దు. ఈ నేప‌థ్య‌లో `అఖండ‌2` చిత్రీక‌ర‌ణ అనంత‌రం బాల‌య్య వ‌ర్కౌట్ వీడియోలు ఒక్కొ క్క‌టిగా బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Tags:    

Similar News