NBK111 కథా నేపథ్యం అదేనా?
అఖండ2 తర్వాత బాలకృష్ణ మరో సినిమాను ఇప్పటికే బాలయ్య లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించనున్నారు.;
నందమూరి బాలకృష్ణ. ఆయన కెరీర్లో ఎన్నో ఫ్యాక్షన్ మూవీస్ చేశారు. ఫ్యాక్షన్ సినిమాలనగానే ఎవరికైనా వెంటనే ఆయనే గుర్తొస్తారు. ఆ జానర్లో పలు సినిమాలు చేసి వాటితో బ్లాక్ బస్టర్లు అందుకున్నారు బాలయ్య. కాగా ప్రస్తుతం బాలయ్య వరుస సక్సెస్ లతో ఫుల్ ఫామ్ లో ఉన్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌లు అందుకున్నారు బాలయ్య.
సెప్టెంబర్ నుంచి వాయిదా పడ్డ అఖండ2
బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ2 సినిమా చేస్తున్నారు. బ్లాక్ బస్టర్ అఖండ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ అంచనాలతో తెరకెక్కుతోంది. వాస్తవానికి అఖండ2 సెప్టెంబర్ నెలలోనే రిలీజ్ కావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా సెప్టెంబర్ నుంచి వాయిదా పడింది. డిసెంబర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
వీర సింహారెడ్డితో బ్లాక్ బస్టర్ అందుకున్న బాలయ్య- గోపీచంద్
అఖండ2 తర్వాత బాలకృష్ణ మరో సినిమాను ఇప్పటికే బాలయ్య లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించనున్నారు. వీరిద్దరి కలయికలో గతంలో వచ్చిన వీర సింహారెడ్డి సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో ఇప్పుడు మరోసారి వీరి కాంబోలో సినిమా రానుండటంతో దానిపై కూడా భారీ అంచనాలు ఏర్పడాయి.
ఇప్పటికే గోపీచంద్ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ ను రెడీ చేశారని, సెకండాఫ్ లో యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటూ ఎమోషనల్ సీక్వెన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయని, సెకండాఫ్ లో బాలయ్య క్యారెక్టర్ పై ఓ ఫ్లాష్ బ్యాక్ ను ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఈ ఫ్లాష్ బ్యాక్ లో బాలయ్య క్యారెక్టర్ మాఫియా బ్యాక్‌డ్రాప్ లో ఉంటుందని తెలుస్తోంది. బాలయ్య కెరీర్లో 111వ సినిమాగా ఇది తెరకెక్కనుంది.