బాలయ్య- కొరటాల మూవీకి ముహూర్తం కుదిరిందా?
తెలుగు సినీ పరిశ్రమలో మరో క్రేజీ కాంబినేషన్ సెట్స్‌పైకి వెళ్లబోతోందనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
తెలుగు సినీ పరిశ్రమలో మరో క్రేజీ కాంబినేషన్ సెట్స్‌పైకి వెళ్లబోతోందనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నటసింహం నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ భారీ సినిమా తెరకెక్కబోతున్నట్లు ఇప్పటికే అనౌన్స్‌మెంట్ వచ్చింది. తాజాగా ఈ సినిమా గురించి ఓ అప్డేట్ వినిపిస్తోంది.
బాలయ్య- కొరటాల సినిమాకు జూన్ 25న అధికారిక ముహూర్తం కార్యక్రమం నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారని ఫిల్మ్ నగర్‌లో బలంగా వినిపిస్తోంది. జూన్ లో సినిమాను ప్రారంభించి, ఆగస్ట్ నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ కు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీలో టాక్. దీంతో ఈ ప్రాజెక్టుపై అందరూ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ప్రస్తుతం బాలకృష్ణ తన 111వ సినిమాను డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి, వెంటనే కొరటాల శివ ప్రాజెక్ట్‌పై ఫోకస్ పెట్టాలని బాలయ్య భావిస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ వేగంగా సాగుతున్నాయని, బాలకృష్ణ ఇమేజ్‌కు తగ్గట్టుగా పవర్‌ఫుల్ యాక్షన్‌తో పాటు బలమైన సామాజిక అంశాన్ని కూడా కథలో మిళితం చేస్తున్నారట కొరటాల. సోషల్ మెసేజ్‌లను, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కలిపి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో కొరటాల శివకు ప్రత్యేక గుర్తింపు ఉంది. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను, దేవర వంటి సినిమాల్లో ఆయన తన మార్క్‌ను స్పష్టంగా చూపించారు.
ఇక బాలకృష్ణ విషయానికి వస్తే, గత కొన్నేళ్లుగా వరుస సక్సెస్‌లతో ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. ముఖ్యంగా మాస్ ఆడియన్స్‌లో ఆయనకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి బాలయ్యకు కొరటాల శివ వంటి కమర్షియల్ డైరెక్టర్ తోడైతే బాక్సాఫీస్ వద్ద భారీ సంచలనం ఖాయమనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కొరటాల ఈ సినిమాలో బాలయ్య పాత్రను చాలా పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశారట. రాజకీయాలు, సమాజం, ప్రజల సమస్యలు వంటి అంశాల చుట్టూ తిరిగే స్టోరీ లైన్‌తో ఈ సినిమా ఉండబోతుందనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.