వి.ఎస్.ఆర్ కాంబో ఫిక్స్.. ఫ్యాన్స్ కి పండగే ఇక..!
ఐతే బాలయ్య తో తొలిసారి ఛాన్స్ రాగానే వీర సింహా రెడ్డి చేసిన గోపీచంద్ ఆయనతో మరో ఛాన్స్ అందుకున్నాడు.;
కొన్ని కాంబినేషన్స్ లో సినిమాలు జస్ట్ అనౌన్స్ చేస్తేనే ఆ ఇంపాక్ట్ ఒక రేంజ్ లో ఉంటుంది. ముఖ్యంగా స్టార్ హీరో స్టార్ డైరెక్టర్ కాంబినేషన్ సినిమా అనగానే ఫ్యాన్స్ లో ఎక్కడ లేని జోష్ వస్తుంది. అదే ఒక సూపర్ హిట్ అందుకున్న కాంబో మళ్లీ కలుస్తున్నారు అంటే ఆ లెక్క వేరేలా ఉంటుంది. ప్రస్తుతం అలాంటి ఒక సూపర్ హిట్ కాంబోనే మళ్లీ రిపీట్ అవబోతుందని తెలుస్తుంది.
ఇన్నాళ్లు కేవలం చర్చల్లోనే ఉన్న ఈ స్టార్ కాంబో సినిమా కన్ ఫర్మ్ చేశాడు డైరెక్టర్. ఇంతకీ ఆ కాంబో ఏంటి అంటే అదే వి.ఎస్.ఆర్ కాంబో. నందమూరి బాలకృష్ణ లోని మాస్ ని పర్ఫెక్ట్ గా వాడుకుని వీర సింహా రెడ్డి అనే హిట్ సినిమా ఇచ్చాడు డైరెక్టర్ గోపీచంద్ మలినేని. తన మొదటి సినిమా నుంచి మాస్ పల్స్ ని పట్టుకుని అదే తన అస్త్రంగా వాడుతూ వస్తున్నాడు గోపీచంద్.
ఐతే బాలయ్య తో తొలిసారి ఛాన్స్ రాగానే వీర సింహా రెడ్డి చేసిన గోపీచంద్ ఆయనతో మరో ఛాన్స్ అందుకున్నాడు. బాలకృష్ణ, గోపీచంద్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుంది. జాత్ ప్రమోషన్స్ లో డైరెక్టర్ గోపీచంద్ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. మాస్ కాంబో మళ్లీ రిపీట్ అవడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు అన్నట్టుగా ఉంది పరిస్థితి.
జాత్ సినిమాతో బాలీవుడ్ లో కూడా సూపర్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకున్నాడు. ఐతే ప్రతి సినిమాకు ఏదో ఒక విధంగా ఇలాంటి హడావిడి కామనే. ఇక గోపీచంద్ నెక్స్ట్ సినిమా బాలయ్యతో అని చెప్పగానే ఫ్యాన్స్ సూపర్ ఖుషి అయ్యారు. ఈ సినిమా జూన్ లేదా జూలైలో సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. తప్పకుండా మళ్లీ వి.ఎస్.ఆర్ కాంబో ఈసారి అంతకుమించి హిట్ అందుకునే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.
బాలకృష్ణ ప్రస్తుతం అఖండ 2 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి చేయడమే ఆలస్యం గోపీచంద్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తాడని తెలుస్తుంది. అఖండ 2 సినిమాను ఈ దసరా పండగకి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. గోపీచంద్ సినిమా జూలైలో మొదలైతే నెక్స్ట్ సమ్మర్ కి రిలీజ్ ఉండే ఛాన్స్ ఉంటుంది.