వీరమల్లు ముఖ్య అతిధిగా నటసింహం!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తోన్న 'హరిహర వీరమల్లు' భారీ ఎత్తున ఈనెల 24న రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే.;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తోన్న 'హరిహర వీరమల్లు' భారీ ఎత్తున ఈనెల 24న రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాలుగు రోజులు ముందుగానే ప్రీ రిలీజ్ వేడుకగా గ్రాండ్ గా ఈనెల 20న వైజాగ్ లో నిర్వహిస్తున్నారు. విశాఖ బీచ్ లో భారీ అభిమానుల సమక్షంలో వేడుక నిర్వహ ణకు సన్నాహాలు జరుతున్నాయి. తొలుత ఇదే ఈవెంట్ తిరుపతి లేదా విజయవాడలో నిర్వహించాలనుకున్నారు. కానీ అనూహ్యంగా వేదిక మారింది. పవన్ కళ్యాణ్ వైజాగ్ లో చేయాలని సూచించడంతో మేకర్స్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.
మరి ఈ వేడుకకు ముఖ్య అతిధి ఎవరు? అంటే ఓపేరు తెరపైకి వచ్చింది. ఆయనే నటసింహ బాలకృష్ణ అని పవన్ సన్నిహిత వర్గాల నుంచి తెలిసింది. బాలయ్య ముఖ్య అతిధిగా ఈ వేడుక నిర్వహిద్దామని దర్శక, నిర్మాతలకు పవన్ సూచించగా అందుకు వాళ్లు కూడా ఒకే చెప్పినట్లు తెలిసింది. మరి ఈ ప్రచా రంలో నిజమెంతో తెలియాలి. ఒకప్పుడు మెగా-నందమూరి అభిమానుల మధ్య పెద్ద వార్ నడిచేది. ఇరు వర్గాల మధ్య అస్సలు పొసిగేది కాదు. కానీ రాజకీయంగా జనసేన-టీడీపీ ఒక్కట వ్వడంతో సీన్ మారింది.
పవన్ కళ్యాణ్ మరో 15 ఏళ్ల పాటు టీడీపీతో నే కలిసి ప్రయాణం చేస్తానని...చంద్రబాబు నాయుడు ఆధ్వ ర్యంలో రాష్ట్రం బాగుంటుందని భావించి పవన్ రాజకీయంగా ఆ బాండింగ్ ని మరింత స్ట్రాంగ్ చేసు కుంటున్నారు. ఈనేపథ్యంలో తన సినిమా వేడుకకు బాలయ్యను చీఫ్ గెస్ట్ గా ఆహ్వానిస్తున్నట్లు తెలు స్తోంది. ఇంత వరకూ ఎప్పుడు పవన్ సినిమా వేడుకలో బాలయ్య ముఖ్య అతిధిగా పాల్గొనలేదు.
అసలు పవన్ సినిమాలకే అతిధిగా ఏనాడు రాలేదు. మెగా హీరోలు ఆయన్ని పిలిచింది లేదు. కానీ ఇప్పుడు సన్నివేశం వేరు కావడంతో వృత్తి, వ్యక్తగతంగా మరింత స్ట్రాంగ్ అవుతున్నారు. ఈ వేడుకలో సినిమా వాళ్లతో పాటు పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు పాల్గొనే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్త రాంధ్రా కూటమి నాయకులుంతా పాల్గొంటారని వార్తలొస్తున్నాయి. మరి ఈ ప్రచారంలో నిజమెంతో తేలాలి.