ఫ్యాన్స్ కు బాల‌య్య బ‌ర్త్ డే ట్రీట్ ఏంటంటే

జూన్ లో నంద‌మూరి బాల‌కృష్ణ పుట్టిన‌రోజు రానుంది. బాల‌య్య ప్ర‌తీ బ‌ర్త్ డే కూ ఫ్యాన్స్ కు ట్రీట్ ఇస్తుంటాడ‌నే సంగ‌తి తెలుసు.;

Update: 2025-04-17 05:59 GMT

టాలీవుడ్ లో సెల‌బ్రిటీల బ‌ర్త్ డే సంద‌ర్భంగా వారి ఫ్యాన్స్ కు ట్రీట్ ఇస్తూ ఆయా సెల‌బ్రిటీలు న‌టిస్తున్న సినిమాల‌కు సంబంధించిన అప్డేట్స్ ను ఏవొక‌టి వ‌దులుతూ ఉండ‌ట‌మ‌నేది కామ‌న్. చిన్న స్థాయి న‌టీన‌టుల నుంచి స్టార్ హీరోల వ‌ర‌కు అందరి పుట్టిన‌రోజుకు ఈ ఫార్ములాని ఫాలో అవుతూ ఉంటారు. పెద్ద హీరోల‌కైతే ఆ స్థాయి కొంచెం ఎక్కువ‌గా ఉంటుంద‌నే విష‌యం తెలిసిందే.

జూన్ లో నంద‌మూరి బాల‌కృష్ణ పుట్టిన‌రోజు రానుంది. బాల‌య్య ప్ర‌తీ బ‌ర్త్ డే కూ ఫ్యాన్స్ కు ట్రీట్ ఇస్తుంటాడ‌నే సంగ‌తి తెలుసు. ఆల్రెడీ తాను న‌టిస్తున్న సినిమాల నుంచి పోస్ట‌ర్లు లేదా టీజ‌ర్, తాను చేయ‌బోయే కొత్త సినిమాల‌కు సంబంధించిన అనౌన్స్‌మెంట్స్ లాంటివి ఇస్తూ ఫ్యాన్స్ ను సంతోషంలో ముంచెత్తుతారు. ఇప్పుడు ఈ ఏడాది జూన్ 10కు కూడా అలాంటి స‌ర్‌ప్రైజ్‌లే రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.

ప్ర‌స్తుతం బోయ‌పాటి శ్రీనుతో బాల‌య్య అఖండ‌2 సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అఖండ కు సీక్వెల్ గా తెర‌కెక్కుతున్న సినిమా కావ‌డంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ తో పాటూ అంద‌రికీ భారీ అంచ‌నాలున్నాయి. ఆ అంచ‌నాల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా ఉండేలా అఖండ‌2ను తెర‌కెక్కిస్తున్నాడ‌ట బోయ‌పాటి. ఇప్ప‌టికే అఖండ‌2 రెండు షెడ్యూళ్ల షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.

ఈ సినిమా నుంచి బాల‌య్య బ‌ర్త్ డే కు టీజ‌ర్ ను రిలీజ్ చేయాల‌ని బోయ‌పాటి ఫిక్స్ అయ్యాడ‌ట‌. ఆల్రెడీ టీజ‌ర్ కాన్సెప్ట్ ను డిజైన్ చేసి దాని కోసం స్పెష‌ల్ గా విజువ‌ల్స్ ను తీసి దాచుతున్నాడ‌ట‌. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న సినిమా కావ‌డంతో టీజ‌ర్ తోనే సినిమాకు నేష‌న‌ల్ వైడ్ లో బ‌జ్ పెరిగేలా టీజ‌ర్ ను రూపొందిస్తున్నాడ‌ట బోయ‌పాటి.

అఖండ‌2 టీజ‌ర్ తో పాటూ బాల‌య్య‌కు వీర సింహారెడ్డి లాంటి హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని తో బాల‌య్య సినిమా చేయ‌బోతున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ కూడా బాల‌య్య బ‌ర్త్ డే రోజునే వ‌స్తుంద‌ట‌. పెద్ది మూవీ నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ ఈ సినిమాను నిర్మించ‌నుంద‌ని స‌మాచారం. ఇవి కాకుండా ఇంకేమైనా సినిమాల అప్డేట్స్ వ‌స్తాయేమో చూడాలి.

Tags:    

Similar News