ఈసారైనా బాలయ్య బిగ్ బాస్ కి వస్తాడా..?

నెక్స్ట్ వీక్ అదే డిసెంబర్ మొదటి వారం అఖండ 2 రిలీజ్ ఉంది. షో ఆ సినిమా ప్రమోషన్స్ కోసం బిగ్ బాస్ షోకి బాలకృష్ణ వస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.;

Update: 2025-11-25 04:53 GMT

బిగ్ బాస్ హౌస్ లోకి నందమూరి బాలకృష్ణ వస్తే ఆహా ఆ ఆలోచనే అదిరిపోతుంది కదా.. హోస్ట్ గా కాదు జస్ట్ ఒక గెస్ట్ గా అయినా వస్తే చాలని నందమూరి ఫ్యాన్స్ భావిస్తున్నారు. బిగ్ బాస్ 9 సీజన్లలో ఏదో ఒక టైం లో ఎవరో ఒక స్టార్ వచ్చి షోకి క్రేజ్ తెస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి అయితే సీజన్ 4 ఫైనల్ ఎపిసోడ్ కి వచ్చి కంటెస్టెంట్స్ ని సర్ ప్రైజ్ చేశారు. ఐతే బిగ్ బాస్ హౌస్ లోకి ఏదైనా సినిమా రిలీజ్ ఉంటే తప్పకుండా ప్రమోషన్స్ కి వస్తారు.

నాగార్జున, బాలకృష్ణ ఒకే వేదిక మీద కనిపించే..

నెక్స్ట్ వీక్ అదే డిసెంబర్ మొదటి వారం అఖండ 2 రిలీజ్ ఉంది. షో ఆ సినిమా ప్రమోషన్స్ కోసం బిగ్ బాస్ షోకి బాలకృష్ణ వస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. నాగార్జున, బాలకృష్ణ ఒకే వేదిక మీద కనిపించి చాలా రోజులైంది. అప్పుడెప్పుడో సుబ్బిరామిరెడ్డి ఏర్పాటు చేసిన ఈవెంట్ లో ఈ ఇద్దరు కలిసి స్టేజ్ మీద కనిపించారు. ఆ తర్వాత మళ్లీ ఆ సందర్భం రాలేదు. ఐతే నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ షోకి బాలయ్య వస్తాడా లేదా అన్న క్లారిటీ లేదు.

అటు బాలకృష్ణ హోస్ట్ గా చేసిన అన్ స్టాపబుల్ షోకి కూడా అందరు స్టార్స్ వెళ్లారు కానీ నాగార్జున వెళ్లారు. బాలకృష్ణ కాకుండా జగపతి బాబు చేసిన ఒక స్పెషల్ చాట్ షోకి నాగార్జున వెళ్లి సర్ ప్రైజ్ చేశారు. సో ఈసారైనా బాలయ్య బిగ్ బాస్ షోకి వస్తారా ఫ్యాన్స్ ని అలరిస్తారా అన్నది చూడాలి. బిగ్ బాస్ షోకి వెళ్లడం వల్ల మరింత ప్రమోట్ అవ్వడమే కాకుండా నాగార్జున, బాలకృష్ణని ఒకే వేదిక మీద చూస్తే ఫ్యాన్స్ కి సూపర్ జోష్ ఏర్పడుతుంది.

అఖండ 2 సినిమా పాన్ ఇండియా రిలీజ్..

పర్సనల్ గా బాలకృష్ణ, నాగార్జున మధ్య ఏం ఉన్నాయన్నది తెలియదు. కానీ ఈమధ్య కాలంలో అసలు వీరిద్దరు కలిసి కనిపించిన సందర్భాలు లేవనే చెప్పాలి. మరి బిగ్ బాస్ సీజన్ 9లో అయినా బాలయ్య బిగ్ బాస్ కి వస్తాడా లేదా అన్నది చూడాలి. బాలయ్య షోకి వస్తే మాత్రం డబల్ జోష్ వస్తుంది. అఖండ 2 సినిమా పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్న ఈ టైం లో నేషనల్ లెవెల్ లో అంతా చూసే బిగ్ బాస్ కి బాలయ్య వస్తే సినిమా రీచ్ మరింత ఎక్కువ ఉంటుంది. ఐతే తెలుగు మాత్రమే కాదు ఇతర భాషల బిగ్ బాస్ షోలో బాలకృష్ణ కనిపిస్తే ఆ ఎనర్జీ వేరేలా ఉంటుంది.

నాగార్జున హోస్ట్ గా చేస్తున్న తెలుగు బిగ్ బాస్ సీజన్ 9లో బాలయ్య రావడం జరిగితే మాత్రం బిగ్ బాస్ ఆడియన్స్ కి కూడా సూపర్ ఫీస్ట్ అన్నట్టే లెక్క.

Tags:    

Similar News