తాండవంతో బాలయ్య భారీ సర్ప్రైజ్!

నరసింహ నందమూరి బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలో 50 వసంతాలు పూర్తిచేసుకుని అందరినీ అబ్బురపరిచారు.;

Update: 2025-10-15 05:54 GMT

నరసింహ నందమూరి బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలో 50 వసంతాలు పూర్తిచేసుకుని అందరినీ అబ్బురపరిచారు. ఇప్పటికీ ఇండస్ట్రీలో వరుస యాక్షన్ చిత్రాలను ప్రకటిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్న ఈయన.. తాజాగా 'అఖండ 2: తాండవం' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వాస్తవానికి సెప్టెంబర్ 25వ తేదీన పవన్ కళ్యాణ్ 'ఓజీ' మూవీకి పోటీగా ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల డిసెంబర్ 5కి వాయిదా వేశారు. అలా బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా రాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నారు.

ముఖ్యంగా అఖండ సినిమాకు మించి ఈ సినిమా ఉంటుంది అని.. బోయపాటి గతంలోనే చెప్పిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించడానికి తమన్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి తోడు పండిట్ ద్వయాన్ని కూడా రంగంలోకి దింపిన విషయం తెలిసిందే .ఇలా ప్రతి చిన్న బిట్ పై కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు చిత్ర బృందం. ఇలాంటి సమయంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అఖండ 2 తాండవంతో అభిమానులకు భారీ సర్ప్రైజ్ ఇవ్వనున్నారట చిత్ర బృందం. మరి అదేంటో ఇప్పుడు చూద్దాం.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో అఖండ పాత్ర పై ఆడియన్స్ కి థియేటర్లలో ఊహించని సర్ప్రైజ్ బోయపాటి కల్పించబోతున్నట్లు తెలుస్తోంది. తాండవం అనే పదం ఎందుకు పెట్టారో.. దానితో బాలయ్య తాండవం ఆడితే ఎలా ఉంటుందో చూపించేదే ఆ సర్ప్రైజ్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే బాలయ్య పరమశివుని తాండవంతో ఖచ్చితంగా ఆడియన్స్ ను ఒక ట్రాన్స్ లోకి తీసుకు వెళ్లిపోవడం ఖాయమట. ఒకవేళ ఇదే జరిగితే పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా సంచలనం సృష్టించడం గ్యారెంటీ అంటూ అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే భారీ అంచనాలతో అంతకుమించి గ్రాండ్ విజువల్స్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

బాలయ్య చిన్న కూతురు తేజస్విని సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. ఈ సినిమా డిజిటల్ హక్కులను జియో హాట్ స్టార్ సుమారుగా 85 కోట్లకు సొంతం చేసుకోగా.. సాటిలైట్ హక్కులను స్టార్ టీవీ 65 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. అంటే ఓటీటీ, సాటిలైట్ ద్వారా సుమారుగా 145 కోట్లు రికవరీ అయ్యాయని చెప్పవచ్చు. మరోవైపు ఇప్పటికే బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్లో సింహ, లెజెండ్, అఖండ చిత్రాలు వచ్చి సంచలనం సృష్టించాయి. ఇప్పుడు హ్యాట్రిక్ అందుకున్న ఈ కాంబో నాలుగో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ కి ఆడియన్స్ నుంచి భారీ స్పందన వచ్చింది. దీన్ని బట్టి చూస్తే.. ఈ సినిమాతో థియేటర్లలో ఫెస్టివల్ వాతావరణం నెలకొనడం ఖాయమని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News