నిజంగానే స్పెర్మ్ డొనేట్ చేసిన న‌టుడు!

బాలీవుడ్‌లో విలక్షణమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ సృష్టించుకున్న నటుడు ఆయుష్మాన్ ఖురానా.

Update: 2026-05-18 07:37 GMT

బాలీవుడ్‌లో విలక్షణమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ సృష్టించుకున్న నటుడు ఆయుష్మాన్ ఖురానా. సమాజంలో సున్నితమైన అంశాలను ఎంతో సులువుగా వెండితెరపై ఆవిష్కరించే స్టార్ ఇత‌డు. తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర నిజాలను ఎంతో ఓపెన్ గా బయట పెట్టాడు. కెరీర్ ఆరంభంలో కాలేజీ రోజుల్లో తానొక రెడ్ ఫ్లాగ్ లాంటి వ్యక్తినని తన ప్రవర్తన కారణంగానే భార్య తాహిరా కశ్యప్‌తో ఒకానొక దశలో బ్రేకప్ కూడా అయిందని నిజాయితీగా ఒప్పుకున్నాడు.

ఆయుష్మాన్ - తాహిరా కశ్యప్ ల బంధం కాలేజీ రోజుల్లోనే ప్రారంభమైంది. అయితే ఆ సమయంలో తనకు వచ్చిన క్రేజ్, పాపులారిటీ వల్ల తనలో అహంభావం పెరిగిందని ఆయుష్ తెలిపాడు. ముఖ్యంగా తాహిరాతో రిలేషన్‌లో ఉన్నప్పుడు మంచి భాగస్వామిగా ప్రవర్తించలేకపోయానని అందుకే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోవాల్సి వచ్చిందని చెప్పాడు. అటుపై తన తప్పులను తెలుసుకుని తనను తాను మార్చుకున్నాకే మళ్లీ తాహిరాతో కలిసి వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్లు ఆయుష్మాన్ గుర్తు చేసుకున్నారు. అలాగే ఆయుష్మాన్ కెరీర్ మ‌లుపు తిప్పిన `విక్కీ డొన‌ర్` ఎంత స్పెష‌ల్ మూవీ అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు.

ఇందులో ఆయుష్మాన్ స్మెర్మ్ డోనర్ పాత్ర‌లో న‌టించి స‌రికొత్త న‌టుడిగా ఆవిష్క‌రించాడు. సాధార‌ణంగా ఇలాంటి పాత్ర‌లు పోషించ‌డాని ఏ న‌టుడు ముందుకు రాడు. కానీ ఆయుష్మాన్ ఖురానా మాత్రం త‌న‌కు అలాంటి అడ్డంకులు లేవ‌ని ఆ చిత్రంతోనే నిరూపించాడు. అయితే స్పెర్మ్ డొనేష‌న్ అన్న‌ది అత‌డికి కొత్తేం కాదు. సినిమాలో న‌టించిన ఆయుష్మాన్ ఖురానా? రియ‌ల్ లైఫ్ లో కూడా స్పెర్మ్ డొనేట్ చేసిన ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

2004లో ఆయుష్మాన్ ఖురానా? ఓ రియాలిటీ షోలో పాల్గొన్నప్పుడు నిజ జీవితంలోనే స్వయంగా స్పర్మ్ డోనేషన్ చేశాడు.

ఇలా సినిమా చేయడానికి ముందే ఆ ప్రాక్టికల్ అనుభవం ఉండటం వల్లే ఆ పాత్రను అంత సహజంగా చేయగలిగా నని ఆయుష్మాన్ ఖురానా న‌వ్వేసాడు. రియాలిటీ షోల ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అనంత‌రం రేడియో జాకీగా వీజేగా మారాడు. అటుపై బాలీవుడ్ లో ఎదిగే క్రమంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నట్లు ఆయుష్మాన్ తెలిపాడు. ఇలాంటి వ్య‌క్తిగ‌త విష‌యాలు చెప్ప‌డానికి ఎలాంటి వారైనా? ఆలోచిస్తారు. కానీ ఆయుష్మాన్ ఖురానా ఎంతో ఓపెన్ గా చెప్ప‌డం విశేషం. ఈ వ్యాఖ్య‌ల‌పై అభిమానులు ఎంతో సానుకూలంగా స్పందిస్తున్నారు.

వ్యక్తిగత జీవితంలో తప్పులను సరిదిద్దుకుంటూ కెరీర్‌లో విలక్షణమైన పాత్రలతో దూసుకుపోతున్న ఆయుష్మాన్ ఖురానా ప్రయాణం అభినందనీయం. భార్యతో బ్రేకప్ నుండి `విక్కీ డోనర్` స్పర్మ్ డోనేషన్ వరకు ఆయన పంచుకున్న ప్రతీ విశేషం ఆయనలోని నిష్కల్మషమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తోంది. ప్రస్తుతం ఆయుష్మాన్ ఖురానా సరికొత్త కంటెంట్ ఓరియెంటెడ్ కథలతో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మళ్లీ మ్యాజిక్ చేయడానికి రెడీ అవుతున్నాడు.

Tags:    

Similar News