రెడ్ డ్రెస్ లో అయేషా ఖాన్ స్టన్నింగ్ లుక్ !
ఏది ఏమైనా ఇంస్టాగ్రామ్ వేదికగా అయేషా ఖాన్ పంచుకున్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఏక్తా కపూర్ 'కసౌతీ జిందగీ కే'తో జూనియర్ ఆర్టిస్ట్ గా టెలివిజన్ అరంగేట్రం చేసిన అందాల తార అయేషా ఖాన్ 2019లో టెలివిజన్ షో బాలవీర్ రిటర్న్స్ ద్వారా విలన్ పాత్రలో విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకుంది. ఈ పాత్ర ద్వారా ఊహించని ఇమేజ్ అందుకున్న ఈ చిన్నది.. 2022లో ముఖచిత్రం అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత 2023లో వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ హిందీ సీజన్ 17లో పోటీదారునిగా అడుగుపెట్టిన అయేషా ఖాన్.. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత 2014లో మరో రియాల్టీ షో అయిన ఖత్రోన్ కే ఖిలాడీలో కూడా పాల్గొనింది.
ఇకపోతే ఈమె తెలుగు, హిందీలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఓం భీమ్ బుష్ సినిమాలో రత్తాలు పాత్రతో అదరగొట్టిన ఈమె.. గ్యాంగ్ ఆఫ్ గోదావరి చిత్రంలో మోత అనే పాటలో తన డాన్స్ పెర్ఫార్మన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఇక మనమే చిత్రంతో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించింది. అలా తెలుగులో పలు చిత్రాలు చేసి తెలుగు ఆడియన్స్ ఆకట్టుకున్న ఈ చిన్నది.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఇంస్టాగ్రామ్ వేదికగా మరో ట్రెండీ ఔట్ఫిట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో రెడ్ డ్రెస్ ధరించి హాట్ ఎక్స్పోజులతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేసింది.
రెడ్ డ్రెస్ లో అందాలు ఆరబోస్తూ సెగలు పుట్టిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. ఈ ఫోటోలకు క్యాప్షన్ గా "నాకు అండగా ఉండు" అంటూ జోడించింది. ఇకపోతే షేర్ చేసిన ఫోటోలకు, ఇచ్చిన క్యాప్షన్ కి అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తమ ఆలోచనలను అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఏది ఏమైనా ఇంస్టాగ్రామ్ వేదికగా అయేషా ఖాన్ పంచుకున్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
అయేషా ఖాన్ విషయానికి వస్తే ముంబైలో జన్మించింది.ఈమె తండ్రి షహాబ్ ఖాన్ బీహార్ లోని పక్రిబరవాన్ లో జన్మించి, ముంబైలో స్థిరపడ్డారు. ఈమె సోదరుడు షహాబాజ్ ఖాన్ , ఇండియన్ మర్చంట్ నేవీలో అధికారిగా పనిచేస్తున్నారు. నిజానికి ఈమెకు లక్కీ భాస్కర్ సినిమాలో అవకాశం వచ్చినా.. షెడ్యూల్ సమస్యల కారణంగా ఈ చిత్రం నుండి తప్పుకుంది..ఇక సన్నీ డియోల్ నటించిన గోపీచంద్ మలినేని జాట్ చిత్రంలో పోలీస్ అధికారిగా చిన్న పాత్ర పోషించింది. ఇక అలాంటి ఈమె ఆదిత్యధర్ దర్శకత్వంలో ధురంధర్ సినిమాలో షరారత్ అనే పాటలో క్రిస్టల్ డిసౌజా తో కలిసి సందడి చేసింది. ఈ పాటతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఆ తర్వాత కపిల్ శర్మ కామెడీ చిత్రం కిస్ కిస్కో ప్యార్ కరూన్ 2 చిత్రంలో రూహిమీర్జా పాత్ర పోషించింది. ఇక ప్రస్తుతం మరికొన్ని చిత్రాలతో బిజీగా గడిపేస్తోంది ఈ ముద్దుగుమ్మ.