• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అవికా గోర్ 'వధువు'.. ఆ...

అవికా గోర్ 'వధువు'.. ఆ రహస్యమేంటి?

| ఈ ఆ తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్ గా సీరియల్స్ లో ఎక్కువగా నటిక్చిన అవికా 17 ఏళ్ళ వయసులో హీరోయిన్ గా కూడా తన అదృష్టాన్ని పరీక్షిస్తుంది.

By - Tupaki Desk
Update: 2023-11-14 15:50 GMT

చిన్నారి పెళ్లికూతురు అనే సీరియల్ ద్వారా నార్త్ లొనే కాకుండా ఇటు తెలుగు వారిని కూడా బాగా ఆకర్షించిన అవికా గోర్ చిన్నతనంలోనే బాల నటిగా మంచి గుర్తింపును అందుకుంది. ఈ ఆ తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్ గా సీరియల్స్ లో ఎక్కువగా నటిక్చిన అవికా 17 ఏళ్ళ వయసులో హీరోయిన్ గా కూడా తన అదృష్టాన్ని పరీక్షిస్తుంది. అయితే మొదట్లో కొన్ని విజయాలు వచ్చినప్పటికీ స్థాయి మాత్రం పెరగలేదు.

కేవలం ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగానే ఆమె పాత్రను సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళింది. ఇక ఎలాంటి పాత్ర చేసిన కూడా అందులో మాత్రం డిఫరెంట్ గా కనిపించేందుకు ఆసక్తిని చూపించింది. అవికా కేవలం సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ ఉంది. ఇటీవల హాట్ స్టార్ లో ఆమె ఓంకార్ మ్యాన్షన్ అనే వెబ్ సిరీస్ లో ఒక పాత్రలో కనిపించింది.

ఇక ఇప్పుడు బెంగాలీలో నుంచి సక్సెస్ అయినటువంటి వధువు అనే త్రిల్లర్ వెబ్ సిరీస్ ద్వారా ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. వివిధ దేశాల్లో కూడా మంచి క్రేజ్ అందుకున్న వధువును ఇప్పుడు తెలుగులో కూడా స్ట్రీమింగ్ చేసేందుకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ రెడీ అయ్యింది. ఇక ఫ్యామిలీ థ్రిల్లర్ నేపథ్యంలో ఉండే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ఒక టీజర్ కూడా విడుదల చేశారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి జరగాలి అని నిర్ణయం తీసుకున్న హీరోయిన్ కు ఎలాంటి కుటుంబం ఎదురయ్యింది.. అలాగే కొత్తకోడలికి తెలియకుండా ఒక పెద్ద కుటుంబం ఎలాంటి రహస్యాలు దాచిపెడుతుంది? అనే అంశాలు ఇందులో పైలెట్ కాబోతున్నట్లుగా టీజర్ లో చూపించారు. మేకింగ్ విధానం కూడా కొత్తగా ఉంది.

ఎంతో విభిన్నంగా రూపొందించిన ఈ వెబ్ సిరీస్లో అవికా తో పాటు అలీ రజా కూడా ముఖ్యమైన పాత్రలో నటించాడు. నటిగా ఎన్నో పాత్రలు చేసి మంచి గుర్తింపు అందుకున్న అవికా వధువు క్యారెక్టర్ లో కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయినట్లుగా తెలుస్తోంది. మరి ఈ వెబ్ సీరీస్ ద్వారా ఆమె లెవెల్ కు పెరుగుతుందో లేదో చూడాలి.

Full View
Tags:    
  • Vadhuvu 
  • Avikagor 
  • Hotstar 
  • Omkarmansion 
  • Ott 

Similar News

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

Copyright @2026

Powered by Blink CMS