ఆదరణ తగ్గిపోతున్న మార్వెల్స్ అవెంజర్స్ డూమ్స్ డే.. లీక్ లు కూడా కాపాడలేవా?
అయితే తాజాగా 'అవెంజర్స్ డూమ్స్ డే' మూవీకి సంబంధించి కొన్ని ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో లీక్ అవ్వడంతో ఫ్యాన్స్ నిరాశ పడుతున్నారు..;
సూపర్ హీరోల సినిమాలను చూడ్డానికి చిన్నా పెద్దా ప్రతి ఒక్కరు ఆసక్తి కనబరుస్తారు. ఒకప్పుడు సూపర్ హీరోలను స్క్రీన్ మీద చూసి ఎంతోమంది చిన్నపిల్లలు హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. అయితే అలాంటి సూపర్ హీరోల సినిమాలు మళ్లీ వచ్చేస్తున్నాయి. ఈ ఏడాది సూపర్ మాన్ మూవీ వచ్చి బాక్సాఫీస్ ని షేక్ చేసింది. అయితే తాజాగా 'అవెంజర్స్ డూమ్స్ డే' మూవీకి సంబంధించి కొన్ని ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో లీక్ అవ్వడంతో ఫ్యాన్స్ నిరాశ పడుతున్నారు..
గతంలో మార్వెల్ సినిమా షూటింగ్స్ కు సంబంధించిన ప్రతి ఒక్కటి చాలా సీక్రెట్ గా ఉంచేవారు. కానీ ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్క సినిమా విడుదలకు ముందే పైరసీ రావడం.. లేదా సెట్ లోని కొన్ని సీన్స్ లీక్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. అలా తాజాగా మార్వెల్ తాజా సినిమా అయినటువంటి 'అవెంజర్స్ డూమ్స్ డే' నుండి కూడా కొన్ని ఫోటోలు సెట్ నుండి లీక్ అవ్వడంతో చాలామంది నెటిజన్స్ పెదవి విరుస్తున్నారు.. అయితే ఈ అవెంజర్స్ డూమ్స్ డే నుండి లీక్ అయిన కొన్ని ఫోటోలు సినిమాపై హైప్ పెంచినప్పటికీ కొంతమంది అభిమానులని ఈ లీక్స్ నిరుత్సాహపరుస్తున్నాయి.. ఆన్లైన్లో ఈ సినిమా నుండి కాస్ట్యూమ్స్, గెస్ట్ రోల్స్, మెయిన్ విలన్ వంటివి లీక్ అవ్వడంతో ముందే ట్విస్ట్ లు బయట పడిపోతున్నాయి. దాంతో సినిమా చూసేటప్పుడు ప్రేక్షకులు అంత ఎగ్జైటింగ్ గా ఫీల్ అవ్వరు.. అయితే ఈ లీకుల వల్ల స్క్రిప్ట్ పై ఎలాంటి ప్రభావం పడకపోయినప్పటికీ అభిమానులను మాత్రం గందరగోళానికి గురి చేస్తున్నాయి.
మార్వెల్ సినిమాలంటేనే అభిమానులు భారీ అంచనాలను పెట్టుకుంటారు. కానీ అలాంటి సినిమాలకు సంబంధించి లీక్స్ బయటికి వస్తే సినిమాల మీద ఉన్న అంచనాలు కూడా పోతాయి. అయితే ముందే కాస్ట్యూమ్స్, గెస్ట్ రోల్స్ లీక్ అయితే సినిమా మీద హైప్ పోతుందని అభిమానులు నిరాశ పడతారు.. వీటికి తోడు సూపర్ హీరోల సినిమాలపై అభిమానుల్లో ఎలాంటి ఆసక్తి ఉండదు. అయితే ఇప్పటికే అవెంజర్స్ డూమ్స్ డే లో డాక్టర్ డూమ్ ప్రధాన విలన్ అని, ఆయన డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ నుండి మోనికా రాంబోను బంధిస్తాడని, ఫాంటాస్టిక్ ఫోర్ డూమ్ తో పోరాటం చేయడానికి వస్తారని.. అలాగే డాక్టర్ డూమ్స్ మల్టీవర్స్ ని నాశనం చేసి బ్యాటిల్ వరల్డ్ అని పిలవబడే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాడు అంటూ కొన్ని లీకులు వస్తున్నాయి.
అయితే అవెంజర్స్ డూమ్స్ డే నుండి వచ్చిన ఈ లీక్స్ ని ఇప్పటివరకు మార్వెల్ చిత్ర యూనిట్ నిర్ధారించలేదు. ఈ లీక్ ల వల్ల సినిమాకి ప్రమోషన్ అవుతుందని కొంతమంది అంటుంటే లీక్స్ వచ్చినా కూడా ప్రజలు పెద్దగా వాటిని పట్టించుకోవడం లేదు అని తెలుస్తోంది.మరి చూడాలి ఆన్లైన్లో లీక్ అవుతున్న సమాచారం వల్ల అవెంజర్స్ డూమ్స్ డే కి ఎలాంటి నష్టం కలుగుతుందో ముందు ముందు తెలుస్తుంది.