అవతార్ 3... ముందస్తు అంచనాలు తప్పాయి!

ప్రపంచవ్యాప్తంగా అవతార్ సిరీస్ కి మంచి క్రేజ్ ఉన్న విషయం వాస్తవం, అయితే 2009 లో వచ్చిన అవతార్ తో పోలిస్తే రెండో పార్ట్ అంచనాలను అందుకోవడంలో విఫలం అయింది.;

Update: 2025-12-08 05:50 GMT

ప్రపంచవ్యాప్తంగా అవతార్ సిరీస్ కి మంచి క్రేజ్ ఉన్న విషయం వాస్తవం, అయితే 2009 లో వచ్చిన అవతార్ తో పోలిస్తే రెండో పార్ట్ అంచనాలను అందుకోవడంలో విఫలం అయింది. కానీ వసూళ్ల పరంగా నిర్మాతలకు లాభాలను తెచ్చి పెట్టింది అనడంలో సందేహం లేదు. ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేసిన డిస్ట్రిబ్యూటర్స్ కి అవతార్ సినిమా మంచి కలెక్షన్ ని రాబట్టడంతో లాభాలు తెచ్చిపెట్టింది. అందుకే అవతార్ 3 సినిమాపై అంచనాలు మొదట్లో పెరిగాయి. కానీ ప్రేక్షకుల అభిప్రాయం వేరుగా ఉంది, భారీగా ఖర్చు పెట్టి తీసిన అవతార్ 3 సినిమాను థియేటర్లో చూడడం కంటే కొన్ని రోజులు వెయిట్ చేసి ఓటీటీ లో చూడాలని భావిస్తున్నారట. అందుకు కారణం సెకండ్ పార్ట్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడమే అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పైగా ఇండియాలో అవతార్ 3 సినిమాకు సంబంధించి పెద్దగా ప్రమోషన్ జరగట్లేదు. ఇండియన్ బాక్సాఫీస్ కలెక్షన్స్ పై నిర్మాతలు పెద్దగా ఆశ పెట్టుకున్నట్లుగా కనిపించడం లేదు అనేది టాక్.

బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద...

ఒకవైపు అవతార్ 3 సినిమా ఇండియాలో పెద్దగా కలెక్షన్స్ రాబట్టకపోవచ్చు అనే ఉద్దేశంతో మేకర్స్ ప్రమోషన్ విషయమై ఆసక్తి చూపించడం లేదు.. కానీ ఇండియన్ ఫిలిం మేకర్స్ మాత్రం అవతార్ 3 సినిమాకు ఆకాశమే హద్దు అన్నట్లుగా హైప్ క్రియేట్ చేసుకుని మరి భయపడ్డారు. మూడు నాలుగు నెలల ముందు నుండి అవతార్ సినిమా వస్తుంది కనుక మనం డిసెంబర్ లో ఆ సినిమాకు పోటీకి పోకుండా జాగ్రత్తపడాలి అనే ఉద్దేశంతో తమ సినిమాల విడుదల తేదీలపై కాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టి ఇప్పటికే కొందరు విడుదల చేయడం జరిగింది, మరికొందరు అవతార్ సినిమా వచ్చిన తర్వాత విడుదల చేద్దాం అన్నట్లుగా వెయిటింగ్ చేస్తున్నారు. అవతార్ సినిమా విషయంలో ఇండియన్ ఫిలిం మేకర్ కాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టి ఉంటారు, అందుకే తమ సినిమాల విడుదల తేదీ విషయాల్లో జాగ్రత్త తీసుకున్నారు. కానీ అవతార్ ఫిలిం మేకర్స్ మాత్రం ఇండియాలో విడుదల విషయంలో అంతగా శ్రద్ధ పెట్టలేదు అనేది కొందరి అభిప్రాయం. అవతార్ సినిమాకు పోటీగా విడుదల చేయకపోవడం అనేది తప్పుడు నిర్ణయం అని ఇప్పుడు నిర్మాతల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇండియన్ ఫిలిం మేకర్..

ఇండియన్ ఫిలిం మేకర్స్ ముందస్తుగా అవతార్ 3 సినిమా గురించి అతిగా ఊహించుకున్నారు అందుకే తమ సినిమాల విడుదల తేదీల విషయంలో అతి జాగ్రత్త పడ్డారు. అవతార్ 3 తో పోటీ వద్దు అనుకొని రెండు మూడు వారాలు అటు ఇటుగా విడుదల ప్లాన్ చేసుకున్నారు, కానీ అవతార్ 3 ఆ స్థాయిలో బజ్ లేదు అనేది ప్రతి ఒక్కరు ఒప్పుకోవాల్సిన విషయం. బాక్సాఫీస్ వద్ద అవతార్ 3 తో పాటు మరో రెండు మూడు సినిమాలకు ఛాన్స్ ఉండేది. కానీ నిర్మాతలు తమ సినిమాలను విడుదల చేయకపోవడం వల్ల ఆ వారం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన శూన్యం ఉంటుంది అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అవతార్ 3 కోసమే అన్నట్లుగా ఆ వారం ను ఇండియన్ ఫిలిం మేకర్స్ కేటాయించడం ఏమాత్రం కరెక్ట్ కాదు అని సగటు సినీ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందరికీ అవతార్ 3 నచ్చాలని లేదు, కనుక ఆ సినిమాతో పాటు సౌత్ నార్త్ లో సినిమాలు వచ్చి ఉంటే బాగుండేది. అవతార్ 3 కి భయపడి కొందరు నిర్మాతలు తమ సినిమాల నిర్మాణ విడుదల ప్లాన్ చేసుకోవడం ఇప్పుడు తప్పని తేలింది.

అవతార్ 3 సినిమాకి బజ్

బాలీవుడ్ తో పాటు కోలీవుడ్, టాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలు అవతార్ 3 కారణంగా వాయిదా పడడం లేదా ముందస్తుగా విడుదల కావడం జరిగింది. కానీ అవతార్ కి ఇక్కడ ఆ స్థాయిలో బజ్ లేదు అనేది ఇప్పుడు అందరూ ఒప్పుకుంటున్న విషయం. ఒక సినిమా గురించి ముందస్తుగా ఊహించుకొని ఆ సినిమాకు పోటీగా విడుదల చేయకుండా వాయిదా వేయడం అనేది ఎప్పటి నుండో వస్తుంది. అయితే అవతార్ 2 ఫలితం తర్వాత కూడా అవతార్ 3 కి భయపడడం అనేది అవివేకం అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికైనా అవతార్ 3 వీక్ లో ఒకటి రెండు సినిమాలు విడుదలయితే బాగుంటుంది అనే వాళ్ళు కొందరున్నారు. ఇప్పటికే ఆలస్యమైంది అవతార్ 3 కి కేటాయించిన ఆ వారంలో మరే సినిమా ఇంత హడావుడిగా వచ్చే పరిస్థితి లేదు. కనుక సినిమా నచ్చిన నచ్చకున్నా ఆ వారంలో అందరూ అవతార్ 3 ను థియేటర్లలో చూడాల్సిందే అనే పరిస్థితి ఎదురైంది. ఒకవేళ ఆ సినిమా చూసే ఆసక్తి లేకపోతే థియేటర్లకు దూరంగా ఉండాల్సిందే తప్ప మరో సినిమా లేదు.

Tags:    

Similar News