హీరోయిన్ నెంబర్ కావాలంటూ వెంటపడ్డ ఫ్యాన్
తాజాగా మరో హీరోయిన్ ఒక అభిమాని వల్ల ఇబ్బంది ఎదుర్కొన్నట్లుగా చెప్పుకొచ్చింది. ఆమె పడ్డ ఇబ్బందిని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో షేర్ చేయడంతో అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.
సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్స్‌కి ఉండే ఫాలోయింగ్ కొన్ని సార్లు వారిని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది. ఒకప్పుడు టీవీ నటీనటులను పెద్దగా పట్టించుకునే వారు కాదు. కానీ సోషల్ మీడియాలో కాస్త పాపులారిటీ ఉన్న వాళ్లను కూడా ఇప్పుడు బయట జనాలు తిరగనివ్వడం లేదు. ఏమాత్రం పాపులారిటీ ఉన్న, గుర్తింపు ఉన్న వారు రోడ్డు మీద కనిపిస్తే వెళ్లి సెల్ఫీ అడగడం, వారితో మాట్లాడేందుకు ప్రయత్నించడం చేస్తున్నారు. సెలబ్రిటీ తో సెల్ఫీ తీసుకున్నాం అని చెప్పుకునేందుకు వారు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అందుకే చాలా మంది సెలబ్రిటీలు కనీసం రోడ్డు మీదకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఇక సినిమా థియేటర్లకు వెళ్తే ముసుగు ధరించి లేదంటే ఫేస్ కనిపించకుండా కవర్ చేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఉంది.
షాపింగ్ మాల్ ఓపెనింగ్‌లో హీరోయిన్ కి ఇబ్బంది...
ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఏదో ఒక సమయంలో అభిమానుల వల్ల ఇబ్బంది పడ్డ సెలబ్రిటీలు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా పబ్లిక్ ప్లేస్‌లకు వెళ్లిన సమయంలో ఇబ్బంది పడ్డ సెలబ్రిటీల సంఖ్య చాలానే ఉంటుంది. ఆ మధ్య ఒక హీరోయిన్ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు వెళ్లి చాలా ఇబ్బంది పడ్డ విషయం తెల్సిందే. ఆ సమయంలో ఆమె పడ్డ ఇబ్బంది గురించి దాదాపు నెల రోజుల పాటు చర్చ జరిగింది. క్రౌడ్ ను మేనేజ్ చేయడంలో కార్యక్రమ నిర్వాహకులు, పోలీసులు విఫలం అయ్యారు. దాంతో ఆ హీరోయిన్ ఇబ్బంది పడ్డట్లుగా ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. తాజాగా మరో హీరోయిన్ ఒక అభిమాని వల్ల ఇబ్బంది ఎదుర్కొన్నట్లుగా చెప్పుకొచ్చింది. ఆమె పడ్డ ఇబ్బందిని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో షేర్ చేయడంతో అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.
మలయాళ నటి అవంతిక మోహన్...
మలయాళ నటి అవంతికా మోహన్ ప్రయాణిస్తున్న కారును ఒక వ్యక్తి వెంబడిస్తూ వచ్చాడట. ఎంతకి కారుకు దూరంగా వెళ్లక పోవడంతో పాటు, కారు ఆపాలంటూ విజ్ఞప్తి చేశాడట. అంతే కాకుండా కారులో ఉన్న అవంతికాను ఫోన్ నెంబర్ ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశాడట. మీరు అంటే చాలా ఇష్టం, మిమ్ములను చాలా సంవత్సరాలుగా అభిమానిస్తున్నాను అన్నాడట. మీరు ఇన్‌స్టాగ్రామ్ లో నాకు రిప్లై ఇవ్వండి అంటూ కారును వెంబడిస్తూనే అతడు విజ్ఞప్తి చేశాడట. ఇలా కారును వెంబడిస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ అవంతికా హెచ్చరించినా కూడా అతడు మాత్రం పట్టువదలకుండా అలాగే కారును ఫాలో అయ్యాడట. అవంతికా హెచ్చరించడంతో అతడు బోరున ఏడ్చేశాడట. మీరు అంటే చాలా ఇష్టం మేడం ప్లీజ్ రిప్లై ఇవ్వండి అంటూ అతడు ధీనంగా అడిగాడు అంటూ ఇంటర్వ్యూలో అవంతికా మోహన్ చెప్పుకొచ్చింది.
టాలీవుడ్‌లో హీరోయిన్‌గా...
హీరోయిన్స్ చాలా మంది ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొంటూ ఉంటారు. సెలబ్రిటీలు ఎంతో మంది సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎదుర్కోవడం జరుగుతుంది. బయట ఇలా వెంట పడి ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది. అవంతికా మోహన్ సైతం అలాంటి ఇబ్బందిని ఎదుర్కొంది. మలయాళంలో సుదీర్ఘ కాలంగా నటిగా కొసాగుతున్న ఈమె తెలుగులో ఉందిలే మంచి కాలం ముందు ముందునా అనే చిత్రంలో నటించింది. ఆ తర్వాత తెలుగు నుంచి ఒకటి రెండు ఆఫర్లు వచ్చినప్పటికీ ఒప్పుకోలేదని ఈమె చెప్పుకొచ్చింది. హీరోయిన్‌గానే కాకుండా బుల్లి తెరపై కూడా ఈమె తనదైన ముద్ర వేసింది. మలయాళ ప్రేక్షకులను తన అందంతో పాటు నటనతోనూ మెప్పించింది. పలు సీరియల్స్, షో ల ద్వార మలయాల ప్రేక్షకులను రెగ్యులర్‌గా ఆకట్టుకుంటూ ఉంటుంది. అందుకే ఈ రేంజ్‌లో ఈమెకు అభిమానులు ఉంటారని సోషల్ మీడియా టాక్.