'రాకా' క్రియేటర్‌ ఫ్యామిలీ అప్‌డేట్‌..!

అల్లు అర్జున్‌తో ప్రస్తుతం 'రాకా' సినిమాను రూపొందిస్తున్న దర్శకుడు అట్లీ ఇటీవల రెండోసారి తండ్రి అయిన విషయం తెల్సిందే.

Update: 2026-05-17 19:30 GMT

అల్లు అర్జున్‌తో ప్రస్తుతం 'రాకా' సినిమాను రూపొందిస్తున్న దర్శకుడు అట్లీ ఇటీవల రెండోసారి తండ్రి అయిన విషయం తెల్సిందే. మొదట కొడుకు ఉండగా ఇటీవలే అట్లీ భార్య ప్రియా కూతురుకు జన్మనిచ్చింది. అట్లీ, ప్రియా దంపతులు తమ కొత్త ఫ్యామిలీ మెంబర్‌కి స్వాగతం చెప్పారనే విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. అట్లీ కి ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఆయన కూతురు పుట్టిన విషయం జాతీయ మీడియాలోనూ ప్రధాన వార్తగా నిలిచింది. అట్లీ, ప్రియా దంపతులు రెండో బిడ్డకు జన్మనిచ్చిన విషయం ప్రముఖ జాతీయ మీడియా పత్రికలు కవర్‌ చేశాయి. ఇప్పుడు ఈ దంపతులు తమ బిడ్డకు పేరు పెట్టి మరోసారి వార్తల్లో నిలిచారు. ఆషామాషీ పేరు పెట్టి ఉంటే ఆయన అట్లీ ఎలా అవుతాడు, అందరి దృష్టిని ఆకర్షించే విధంగా జపనీస్‌ సంస్కృతి స్ఫూర్తితో తన కూతురుకు అట్లీ పేరు పెట్టాడు.

అట్లీ, ప్రియా దంపతుల కూతురు...

అట్లీ తాజాగా సోషల్‌ మీడియా ద్వారా తన కూతురు పేరును రివీల్‌ చేశాడు. అంతే కాకుండా అట్లీ ఆ పేరు వెనుక ఉన్న అర్థంను సైతం వివరించడంతో అంతా కూడా పేరు గురించి చర్చించుకుంటున్నారు. అట్లీ చాలా క్రియేటివిటీతో ఈ పేరును పెట్టారు అని ప్రముఖంగా మాట్లాడుకుంటున్నారు. అట్లీ, ప్రియా దంపతులు తమ పాపకు 'మియూ' అనే పేరును ఖరారు చేశారు. జపనీస్ ఎక్కువగా ఇలాంటి పేరును పెట్టుకుంటారని కూడా అట్లీ చెప్పుకొచ్చాడు. మియూ అంటే అందం, ప్రేమ, సౌమ్యత అనే అర్థాలు వస్తాయని అట్లీ పేర్కొన్నాడు. జపాన్‌లో మి అంటే అందం అని, యూ అంటే సౌమ్యత, ప్రేమ అర్థాలు వస్తాయని అట్లీ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. అందం, సౌమ్యత, ప్రేమతో కలిగిన పాప తమ పాప అన్నట్లుగా దర్శకుడు అట్లీ ఈ పేరును పెట్టాడు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో మియూ పేరు వైరల్‌ అవుతోంది.

అట్లీ కూతురు పేరు మియూ...

దర్శకుడు అట్లీ ఇప్పటి వరకు చేసిన ప్రతి సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా ఈయన దర్శకత్వంలో వచ్చిన జవాన్‌ మూవీ బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకుంది. రాజా రాణి, తెరీ సినిమాతో అట్లీ తన సక్సెస్ జర్నీ మొదలు పెట్టాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సక్సెస్‌ యాత్ర కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో రాకా సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎక్కువగా మాట్లాడుకునే సినిమా రాకా అనడంలో ఎలాంటి సందేహం లేదు. అల్లు అర్జున్‌ పుష్ప తర్వాత చేస్తున్న సినిమా కావడంతో పాటు, విభిన్నమైన లుక్‌ తో కనిపించబోతున్న నేపథ్యంలో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. రాకా సినిమా వెయ్యి కోట్ల మూవీ అంటూ అభిమానులు చాలా నమ్మకంతో ఉన్నారు.

రాకా సినిమా కోసం ఫ్యాన్స్‌...

సన్‌ పిక్చర్స్ బ్యానర్‌లో రూపొందుతున్న రాకా సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. సైన్స్ ఫిక్షన్‌ మూవీ అంటూ వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటి వరకు సినిమా కాన్సెప్ట్‌ గురించి అట్లీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కనీసం లీక్‌ లు సైతం రాకుండా జాగ్రత్త పడుతున్నాడు. మొత్తం షూటింగ్‌ ముంబైలో అత్యంత రహస్య ప్రదేశంలో చేస్తున్నారు. అందుకే రాకా గురించి ఎలాంటి లీక్‌ బయటకు రావడం లేదు. అల్లు అర్జున్‌ బర్త్‌ డే సందర్భంగా వచ్చిన పోస్టర్‌ మినహా సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్ లేదు.

షూటింగ్‌ ఈ ఏడాది చివరి వరకు పూర్తి చేసి వచ్చే ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని భావిస్తున్నారు. అది ఎంతవరకు సాధ్యం అవుతుందో చూడాలి. సినిమాలో ఎక్కువ వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ ఉండబోతుందని, అందుకోసం ఎక్కువ సమయం పడుతుందని అంటున్నారు. హాలీవుడ్‌ మూవీస్‌ కి వర్క్‌ చేసిన ప్రముఖ వీఎఫ్‌ఎక్స్‌ కంపెనీ ఈ సినిమా కోసం వర్క్‌ చేస్తున్నారట. దీపికా పదుకునే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మరికొందరు హీరోయిన్స్‌ కనిపించబోతున్నారనే వార్తలు వచ్చాయి. ఆ వార్తలపై స్పష్టత రావాల్సి ఉంది.

Tags:    

Similar News