పెద్ద స్టార్ కొడుకు డైరెక్ట‌ర్‌గా డెబ్యూ ఏమ‌వుతుందో?

ఆర్య‌న్ ఖాన్ న‌టీన‌టుల నుంచి అద్భుతంగా న‌ట‌న‌ను రాబ‌ట్టుకున్నాడ‌ని, త‌న ప‌నిపై తాను స్ప‌ష్ఠ‌త‌తో ఉన్నాడ‌ని కితాబిచ్చాడు.;

Update: 2025-09-17 02:45 GMT

కింగ్ ఖాన్ షారూఖ్ వార‌సుడు ఆర్య‌న్ ఖాన్ త‌న తండ్రిలా న‌టుడు అవ్వాల‌ని అనుకోలేదు. అత‌డు ద‌ర్శ‌కుడిగా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోవాల‌నుకున్నాడు. `ది బా..డ్స్ ఆఫ్ బాలీవుడ్` అనే ఓటీటీ సినిమాని రూపొందించాడు. ఇటీవ‌లే విడుద‌లైన ట్రైల‌ర్ వెబ్ లో దూసుకెళ్లిన సంగ‌తి తెలిసిందే. ట్రైల‌ర్ బావుంది అంటూ ప్ర‌శంస‌లు కురిసాయి. అయితే క‌మ‌ల్ ఆర్. ఖాన్ లాంటి అరుదైన వివాదాస్ప‌ద‌ క్రిటిక్ త‌న క‌థ‌నంలో ఖాన్ వార‌సుడి డెబ్యూ సినిమా స‌రిగా రాక‌పోవ‌డం వ‌ల్ల స్క్రాప్ లో వేసార‌ని ఫ్యాన్స్ ను కంగారు పెట్టాడు.

అయితే అందుకు భిన్నంగా ఇప్పుడు ఈ సినిమాలో విల‌న్ గా న‌టించిన బాబి డియోల్ స్పందించారు. ఆర్య‌న్ ఖాన్ న‌టీన‌టుల నుంచి అద్భుతంగా న‌ట‌న‌ను రాబ‌ట్టుకున్నాడ‌ని, త‌న ప‌నిపై తాను స్ప‌ష్ఠ‌త‌తో ఉన్నాడ‌ని కితాబిచ్చాడు. సినిమా సెట్లో ప‌ని చేసిన వారంద‌రి అభిప్రాయం కూడా ఇదేన‌ని అన్నారు. అలాగే ఈ స్క్రిప్టు విన‌కుండానే తాను ఓకే చెప్పాన‌ని, కానీ స్టోరి వినాల్సిందేన‌ని ఆర్య‌న్ ప‌ట్టుబ‌ట్టాడ‌ని కూడా బాబి వెల్ల‌డించాడు. ద‌ర్శ‌కుడుగా ఆర్య‌న్ త‌న‌కు ఏం కావాలో స్ప‌ష్ఠంగా ఉన్నాడు.. అత‌డు ప‌ర్ఫెక్ష‌నిస్ట్ అని కూడా ప్రశంసించాడు.

బాబి ప్ర‌శంస‌ల్లో నిజాయితీ ఉంటే, షారూఖ్ వార‌సుడి మొద‌టి ప్ర‌య‌త్నం స‌ఫ‌ల‌మ‌వుతుంది. ముఖ‌స్తుతి కోసం అత‌డు అలా అని అంటే అది అశ‌నిపాతం అవుతుంది. బాలీవుడ్ దిగ్గ‌జ హీరో కుమారుడి సినీ ఆరంగేట్రం అంటే భారీ అంచ‌నాలుంటాయి. అందుకే ఆర్య‌న్ పై ఇప్పుడు అసాధార‌ణ‌మైన‌ ఒత్తిడి ఉంది. ఆరంభ చిత్రంతోనే నిరూపించుకుని మునుముందు పెద్ద ద‌ర్శ‌కుడిగా ఎద‌గాల్సి ఉంటుంది. త‌న కుమారుడి ద‌ర్శ‌క‌త్వం కోసం రాజీ అన్న‌దే లేకుండా కింగ్ ఖాన్ షారూఖ్ పెట్టుబ‌డుల్ని స‌మ‌కూర్చారు. కానీ నిరూపించాల్సిన బాధ్య‌త ఆర్య‌న్ పై ఉంది.

Tags:    

Similar News