ఎరులై పారించిన డైరెక్ట‌ర్ కి అదే ర‌క్తం చూస్తే క‌ళ్లు తిరుగుతాయి!

సినిమా అంతా ర‌క్త పాత‌మే హైలైట్ అవుతుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అరుణ్ మాథేశ్వరన్ ఈ సినిమా మేకింగ్ వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

Update: 2026-09-07 08:30 GMT

కోలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ తెరకెక్కించిన తాజా చిత్రం `DC` బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సంగ‌తి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్, వామికా గబ్బి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. మునుపటి సినిమాలతో పోలిస్తే ఈ చిత్రంలో అరుణ్ ఎంచుకున్న వేగవంతమైన కథా, కథనాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సినిమాలో హింస ఏ స్థాయిలో ఉంటుంద‌న్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు.

సినిమా అంతా ర‌క్త పాత‌మే హైలైట్ అవుతుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అరుణ్ మాథేశ్వరన్ ఈ సినిమా మేకింగ్ వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సాధారణంగా తన సినిమాల్లో కనిపించే తీవ్రమైన హింస , రక్తపాతంపై ఆయన చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. నిజ జీవితంలో తనకు రక్తం చూస్తే తీవ్రమైన అలెర్జీ అని ఇంజెక్షన్ తీసుకునేటప్పుడు కూడా సూది వైపు చూడకుండా తల పక్కకు తిప్పుకుంటానని చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. ర‌క్తం చూస్తేనే క‌ళ్తు తిరుగుతాయ‌న్నారు.

`సినిమాల్లో చూపించే రక్తం, హింస అంతా కృత్రిమమైనదని అదంతా ఒక నటన అని నాకు తెలుసు. కాబట్టి తెరపై చూపించేటప్పుడు నాకు ఎలాంటి ఇబ్బంది అనిపించదు. కానీ నిజ జీవితంలో మాత్రం రక్తాన్ని అస్సలు చూడలేను` అని అరుణ్ అన్నారు. రియల్ లైఫ్ అలెర్జీ ఉన్నా? స్క్రీన్‌పై మాత్రం మాస్ యాక్షన్ సీన్లను ఎంతో ప్రతి భావంతంగా తెరకెక్కించడం అరుణ్ ప్రత్యేకతగా నిలిచింది.

అలాగే DC చిత్రం కథనాన్ని మార్చడానికి తన భార్యే ప్రధాన కారణమని అరుణ్ తెలిపారు. మొదటి మూడు సినిమాలను అధ్యాయాలుగా (చాప్టర్లు) విభజించి చెప్పడం వల్ల ప్రేక్షకులు అలసటగా ఫీల్ అయ్యే అవకాశముందని భార్య ఇచ్చిన సలహాతో ఏమాత్రం సంక్లిష్టత లేకుండా స్ట్రెయిట్-ఫార్వర్డ్ కథనంతో సరళంగా చెప్పాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఈ మార్పు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిందని సంతోషం వ్యక్తం చేశారు.

అలాగే `సినిమాలో ఏ ఒక్క షాట్ కూడా 10 సెకన్ల కంటే ఎక్కువ సమయం ఉండకూడదని ఎడిటింగ్ టీమ్‌కు స్పష్టంగా చెప్పాను. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌ను ఎక్కడా సైలెన్స్ లేకుండా.. సినిమాను ఒక మ్యూజికల్ రైడ్‌లా మలచమని కోరాను` అని అరుణ్ పేర్కొన్నారు. అరుణ్ వేగవంతమైన కట్స్, అనిరుధ్ అందించిన హై-ఎనర్జీ సంగీతం కలసి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి.

Tags:    

Similar News