రవితేజని డ్రగ్స్ సప్లై కోసం వాడారా?

Update: 2017-07-23 06:30 GMT
కెల్విన్ మస్కరెన్హాస్ ను అరెస్ట్ చేసిన తర్వాత.. డ్రగ్ రాకెట్ ను పట్టుకునేందుకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ ప్రత్యేక దర్యాప్తు బృందం తీవ్రంగా కృషి చేస్తోంది. ఏ చిన్న లూప్ హోల్ ను వదిలేందుకు.. ఏ పెద్ద తలకాయను వదిలిపెట్టేందుకు సిద్ధంగా లేరు అధికారులు. రీసెంట్ గా నైజీరియన్ జిషాన్ ఆలీని సిట్ అధికారులు విచారించగా.. సంచలన వాస్తవాలు బయటకు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

డ్రగ్స్ కేసుకు సంబంధించి విచారణకు ముందే ఆధారాలు సేకరించి.. ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు అధికారులు. జిషాన్ అలీని విచారించిన సమయంలో.. మరిన్ని నిజాలు బయటకు వచ్చాయట. నైజీరియాకు చెందిన డ్రగ్స్ ముఠాకు చెందిన ఈ వ్యక్తి.. హీరో రవితేజతో పాటు శ్రీనివాసరావుకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు వెల్లడించినట్లు కథనాలు వస్తున్నాయి. దక్షిణాఫ్రికా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి.. రవితేజకు జిషాన్ అలీ సరఫరా చేసినట్లుగా తెలుస్తోంది.

రవితేజపై పక్కా ఆరోపణలు రావడంతో.. ఇప్పుడు ఆయన ప్రశ్నల సరళి మారిపోయినట్లు తెలుస్తోంది. అలాగే రవితేజ ద్వారా మరికొంతమందికి డ్రగ్స్ సరఫరా చేసినట్లు ఆధారాలు లభించడంతో.. రవితేజను డ్రగ్స్ సరఫరా కోసం పెడ్లర్ గా ఉపయోగించారా అనే యాంగిల్ లో విచారమ సాగనుంది. అలాగే రవితేజను విచారించాక మరికొంతమందికి నోటీసులు ఇచ్చేందుకు సిట్ సిద్దమవుతోంది.
Tags:    

Similar News