సోనీ పిక్చ‌ర్స్ లోకి జీ గ్రూప్ విలీనం!

Update: 2021-09-22 09:31 GMT
మీడియా అండ్ ఎంట‌ర్ టైన్ మెంట్ జెయింట్ జీ ఎంట‌ర్ టైన్ మెంట్ ఎంట‌ర్ ప్రైజెస్, సోనీ పిక్చ‌ర్స్ నెట్ వ‌ర్క్స్ ఇండియాలోకి విలీనం అవుతోంది. రెండు ప్ర‌ముఖ మీడియా సంస్థ‌ల మ‌ధ్య‌న ఈ ఒప్పందం కుదిరిన‌ట్టుగా తెలుస్తోంది.

జీ నెట్ వ‌ర్క్ కు చాలా నేప‌థ్యమే ఉంది. దేశంలో మొద‌లైన తొలితొలి శాటిలైట్ చాన‌ళ్ల‌లో జీ నెట్ వ‌ర్క్ కూడా ఒక‌టి. హిందీ లో జీ నెట్ వ‌ర్క్ చాన‌ళ్లు ప‌రిశ్ర‌మ‌ను ఏలాయి. ఆ త‌ర్వాత ప్రాంతీయ భాష‌ల్లోకీ ప్ర‌వేశించాయి. ఇర‌వై యేళ్ల కింద‌టే రీజ‌న‌ల్ నెట్ వ‌ర్క్ లోకి అవి ఎంట‌ర‌య్యాయి. ఇప్పుడు జీ ఎంట‌ర్ టైన్ మెంట్ ఎంట‌ర్ ప్రైజెస్ లోని మెజారిటీ భాగం సోనీ పిక్చ‌ర్స్ ఇండియాలోకి విలీనం కానుంద‌ని తెలుస్తోంది.

ఈ డీల్ ప్ర‌కారం..జీ నెట్ వ‌ర్క్ షేర్స్ లో దాదాపు 52 శాతం సోనీ పరం కానున్నాయ‌ట‌. సోనీ షేర్ హోల్డ‌ర్లు జీ నెట్ వ‌ర్క్ లో ఈ ఆధిప‌త్యాన్ని సంపాదించ‌నున్నారు. జీ షేర్ హోల్డ‌ర్ల చేతిలో 47.07 శాతం షేర్లు అలాగే మిగ‌ల‌బోతున్నాయ‌ని తెలుస్తోంది.

ఈ ఒప్పందంతో ఇరు సంస్థ‌ల మ‌ధ్య‌న డిజిల‌ట్ అస్సెట్స్, ప్రోగ్రామ్ లైబ్ర‌రీలు కూడా షేర్ అవుతాయ‌ని తెలుస్తోంది. ఈ మెర్జ‌ర్ ప్ర‌పోజ‌ల్ కు షేర్ హోల్డ‌ర్ల ఆమోదం ల‌భించింద‌ని జీ ప్ర‌క‌టించింది.

ఈ విలీనంతో ఈ రెండు సంస్థ‌లూ ప్ర‌ముఖ మీడియా వ‌ర్గంగా ఎదిగే అవ‌కాశాలున్నాయి. ఇప్ప‌టికే ఇండియాలో సోనీ నెట్ వ‌ర్క్ కు విస్తృత‌మైన శ‌క్తి ఉంది. అయితే ప్రాంతీయ భాష‌ల్లో మాత్రం సోనీకి పెద్ద ప్ర‌మేయం లేదు. జీ నెట్ వ‌ర్క్ గ‌త రెండు ద‌శాబ్దాల్లో ప్రాంతీయ భాష‌ల్లో కూడా ఎదిగింది. ఈ మెర్జ‌ర్ తో ఇవి త‌మ నెట్ వ‌ర్క్ ను విస్తృతం చేసుకుంటున్న‌ట్టే.


Tags:    

Similar News