దయచేసి నా ఫొటోలన్నీ డిలీట్‌ చేయండి

Update: 2020-11-23 02:45 GMT
సోషల్‌ మీడియాలో ఎంత యాక్టివ్‌ గా ఉంటే సెలబ్రెటీలకు ముఖ్యంగా హీరోయిన్స్‌ కు అంత ఎక్కువగా ఛాన్స్ లు వచ్చే అవకాశం ఉంటుంది. హీరోయిన్స్‌ కు సోషల్‌ మీడియాలో వందల కొద్ది ఫ్యాన్‌ పేజీలు ఉంటాయి. ఆ ఫ్యాన్‌ పేజీల్లో హీరోయిన్స్‌ చిన్నప్పటి ఫొటోల నుండి సనిమాల్లోని.. వీడియోల్లోని స్క్రీన్‌ షాట్స్ వరకు అన్ని ఫొటోలు షేర్‌ చేస్తూ ఉంటారు. ఈ ఫ్యాన్‌ పేజీల వల్ల ముద్దుగుమ్మలకు ఎక్కువ క్రేజ్‌ వస్తుంది అనడంలో సందేహం లేదు. ఒక సెల్రబెటీ ఫొటోలు ఒకసారి నెట్టింట షేర్‌ అయిన తర్వాత వాటిని డిలీట్‌ చేయడం అనేది దాదాపుగా అసాధ్యం. చాలా కష్టపడితే తప్ప ఆ ఫొటోలను డిలీట్‌ చేయించలేరు. ఇప్పుడు దంగల్‌ బ్యూటీ జైరా వసీమ్‌ అదే పని చేస్తోంది.

ఇంటర్నెట్‌ లో ఉన్న తన అన్ని ఫొటోలను డిలీట్‌ చేయించుకునే పనిలో పడింది. సోషల్‌ మీడియాలో తన పేరుతో ఉన్న ఫ్యాన్‌ పేజీల అడ్మిన్‌ లు అందరికి కూడా ఆమె రిక్వెస్ట్‌ పెట్టింది. దయచేసి నా ఫొటోలు అన్ని కూడా డిలీట్‌ చేయండి. నేను కొత్త జీవితాన్ని ఆరంభించాలని భావిస్తున్నాను. ఇంటర్నెట్‌ లో నా ఫొటోలు ఒక్కటి కూడా ఉండాలని నేను అనుకోవడం లేదు అంటూ విజ్ఞప్తి చేసింది. ప్రతి ఒక్కరు కూడా నా వీడియోలు మరియు ఫొటోలు డిలీట్‌ చేసి నాకు మద్దతుగా నిలవండి అంటూ సుదీర్ఘమైన పోస్ట్‌ చేసింది.

ఉన్నట్లుండి జైరా ఇలా ఫొటోలను డిలీట్‌ చేయించేందుకు సిద్దం అవ్వడం వెనుక ఉన్న కారణం ఏంటీ అనేది ఇప్పుడు ఆమె అభిమానులు జుట్టు పీక్కునేలా చేస్తోంది. జైరా సినిమాలకు దూరంగా ఉండే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకుందని కొందరు అంటూ ఉంటే మరి కొందరు మాత్రం ఆమె ఏదో సర్‌ ప్రైజ్‌ ను ప్లాన్‌ చేస్తుందేమో అనిపిస్తుందని నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. మొత్తానికి ఏదో అయితే జరుగబోతుంది అనిపిస్తుంది.
Tags:    

Similar News