నేడే ఈనాడే కరుణించే నన్ను చెలికాడే..
నేడే.. ఈనాడే.. కరుణించే నన్ను చెలికాడే.. అంటూ ఆ పాత మధురమైన పాట ఒకటి ఉంది. ఎన్టీ రామారావు, కేఆర్ విజయ జంటగా నటించిన భలేతమ్ముడు సినిమాలోని ఈ పాట.. ఎన్టీఆర్ ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఉంటుంది. ఇప్పుడీ పల్లవి.. ఓ మూవీకి టైటిల్ అయిపోతోంది. నేడే... ఈనాడే.. కరుణించే నన్ను చెలికాడే... ఏంటీ పెద్ద టైటిలా అనుకుంటున్నారా... సాధారణంగా ఇప్పుడొచ్చే సినిమాలు 3,4 అక్షరాలతో పేర్లు వెతుక్కుంటున్నారు
కానీ... వైవీఎస్ చౌదరి కాస్త డిఫరెంట్. పాత పాటలని, పేర్లని వాడేసుకుని.. కొత్త సినిమాలు తీసేస్తుంటాడీయన. లాహిరి లాహిరి లాహిరిలో, సీతారాముల కళ్యాణం చూతము రారండీ.. ఇవి కూడా వైవీఎస్ తీసిన సినిమాలే. రామ్ ని పరిచయం చేస్తూ మోడ్రన్ దేవదాస్ ని కూడా తీశాడీయన. కొత్త యాక్టర్ లని హీరో హీరోయిన్లుగా చేస్తూ... లవ్ స్టోరీలు తీసేప్పుడు ముందుగా ఇలాంటి పేర్లు వెతుక్కుంటాడు. అప్పటికే జనాల్లో విపరీతంగా నానిన ట్యూన్స్ కావడంతో... ముందస్తుగా హైప్ వచ్చేస్తుంది. జనాల్లో గుడ్ ఫీల్ జనరేట్ అవుతుంది.
అయితే... సినిమా మామూలుగానే లేటెస్ట్ ట్రెండ్ కి తగ్గట్టుగానే లవ్ స్టోరీలు, హీరోకి హై ఓల్టేజ్ ఓవర్ ఎనర్జీ ఉంటాయి లెండి. ఇప్పుడు నేడే.. ఈనాడే.. కరుణించే నన్ను చెలికాడే... అంటూ కొత్త యాక్టర్ లతో లవ్ స్టోరీ మొదలుపెడుతున్నాడు వైవీఎస్ చౌదరి. అదీ ఆపాత మధురాన్ని మళ్లీ గుర్తు చేసుకున్న కథ.