యువహీరో తేజ 'ఇష్క్' మూవీ ఫస్ట్ సింగిల్ విడుదల!

Update: 2021-02-13 14:30 GMT
టాలీవుడ్ ఇండస్ట్రీలో మెల్లమెల్లగా సినీ అవకాశాలు దక్కించుకుంటూ బిజీ అవుతోంది వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్. ఇప్పటికే యువహీరో నితిన్ సరసన చెక్ సినిమాలో నటిస్తుండగా.. ఇటీవలే మరో సినిమా ప్రకటించింది. అదికూడా మెగా సూపర్ గుడ్ ఫిలింస్ నిర్మాణంలో రూపొందే సినిమా కావడం విశేషం. తెలుగులో ఎన్నో బ్లాక్‌ బ‌స్టర్ సినిమాలు నిర్మించిన మెగా సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ 2021లో ఇష్క్ అనే చిత్రం ప్రారంభించింది. తెలుగులో చైల్డ్ ఆర్టిస్ట్ నుండి ఇటీవల హీరోగా ఎంట్రీ ఇచ్చిన తేజ సజ్జా. ప్రస్తుతం సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మాణంలో ఇష్క్ సినిమా హీరోగా నటిస్తున్నాడు. తేజ సరసన ప్రియా ప్రకాష్ వారియ‌ర్ నాయిక‌గా నటిస్తోంది. ఆర్‌.బి.చౌద‌రి సమర్పణలో ఎన్వీ ప్రసాద్‌, పార‌స్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్ నిర్మాతలుగా వ్యవహారిస్తున్నారు. ‘ఇష్క్’ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో ఎస్ఎస్ రాజు దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.

ఇటీవలే తేజ జాంబిరెడ్డి అనే సినిమాతో హిట్ అందుకున్నాడు. ఎంట్రీ సినిమానే హిట్ అవ్వడంతో ఫుల్ జోష్ లో ఉన్నాడు హీరో. ఇదిలా ఉండగా ఇష్క్ మూవీని అంతా రొమాంటిక్ లవ్ స్టోరి అనుకుంటుండగా.. 'ఇది ల‌వ్ స్టోరీ కాదు’ అనే ట్యాగ్‌లైన్ తో ఆశ్చరపరిచారు మేకర్స్. ఈ మూవీకి మ‌హ‌తి స్వర‌సాగ‌ర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుండి తాజాగా ఓ లిరికల్ లవ్ సాంగ్ రిలీజ్ చేసింది చిత్రబృందం. 'ఆనందం మదికే' అంటూ సాగే ఈ హుషారైనా ప్రేమగీతాన్ని హీరో నితిన్ రిలీజ్ చేసాడు. సెన్సేషన్ సిద్ శ్రీరామ్, సత్యయామిని కలిసి ఈ మెలోడీని ఆలపించారు. యువతకు కనెక్ట్ అయ్యేవిధంగా క్యాచి లిరిక్స్ అందించారు గేయరచయిత శ్రీమణి. ప్రస్తుతం యూట్యూబ్ లో విడుదలైన ఇష్క్ సాంగ్.. చూస్తుంటే ఫ్రెష్ కెమెరా వర్క్ కనబరిచారు శ్యామ్ కే నాయుడు. చూడాలి మరి సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఇష్క్ తో శుభారంభం చేస్తుందేమో!
Full View
Tags:    

Similar News