ముందు గోడ దిగ‌వ‌య్యా అంటూ ఫోటోగ్రాఫ‌ర్ కి హీరో క్లాస్!

Update: 2021-03-01 12:30 GMT
మీడియా టీఆర్పీ గేమ్ .. అత్యుత్సాహం గురించి ఇప్పుడే ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. సెల‌బ్రిటీల‌ను టెన్ష‌న్ పెట్టేది ఇదే విష‌యం. ఇదివ‌ర‌కూ చాలాసార్లు ఇలాంటి చెదురుముదురు ఘ‌ట‌న‌ల్లో మీడియా బ్లేమ్ అయిన‌ స‌న్నివేశం ఉంది. ఈసారి ముంబై కి చెందిన ఓ స్టిల్ ఫోటోగ్రాఫ‌ర్ ఇలానే బుక్క‌య్యాడు. వృత్తిలో భాగంగా గోడెక్కి ఫోటోలు తీయ‌బోయిన అత‌డి అత్యుత్సాహానికి కోపం వ‌చ్చిన‌ హీరోగారు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇదేంప‌ని బుద్ధి త‌క్కువ ప‌ని! అంటూ నిల‌దీశారు.

ఇంత‌కీ స‌ద‌రు ఫోటోగ్రాఫ‌ర్ ఎవ‌రి గోడ ఎక్కాడు? అంటే.. బెబో క‌రీనాక‌పూర్ - సైఫ్ అలీఖాన్ నివ‌సిస్తున్న ఇంటి ప్ర‌హారీ గోడ ఎక్కి మ‌రీ ఫోటోలు తీయ‌డంతో అది కాస్తా ర‌సాభాస అయ్యింది. ప‌లువురికి కోపం తెప్పించింది. అంత‌గా అత‌డు గోడెక్కాల్సిన అవ‌స‌ర‌మేంటో? అని ప్ర‌శ్నిస్తే అక్క‌డే ఉంది అస‌లు మ్యాట‌ర్.

బెబోని ప‌ల‌క‌రించ‌డానికి వ‌చ్చింది మామూలు వాళ్లేం కాదు. ముంబై హాటెస్ట్ ల‌వ్ క‌పుల్ మ‌లైకా అరోరా- అర్జున్ క‌పూర్. అందుకే అంత‌గా పోటీప‌డి మ‌రీ గోడెక్కి ఫోటోలు తీసాడు ఆ ఫోటోగ్రాఫ‌ర్. ఇంత‌కీ అర్జున్ క‌పూర్ ఏమ‌ని తిట్టాడు? అంటే.. ఇది చాలా తప్పు .. ముందు గోడ దిగండి అని అడిగాడు. అసలు అలా ఎలా గోడెక్కుతారు? మీరు చేసేది చాలా తప్పు అంటూ వారించాడు. దీంతో అతడు వెంటనే గోడ దిగేశాడు.

అర్జున్ కపూర్ తన బిజీ జీవితంలో కొంత సమయం గడపగలిగాడు. గత నెలలో ఒక పసికందును స్వాగతించిన తన `కి అండ్ కా` సహనటి కరీనా కపూర్ ‌ను సందర్శించి శుభాకాంక్ష‌లు తెలిపాడు. ఆదివారం రాత్రి తన స్నేహితురాలు మలైకా అరోరాతో కలిసి అక్క‌డికి విచ్చేశాడు. అయితే గోడ ఎక్కిన ఫోటోగ్రాఫ‌ర్ విష‌యంలోనే అర్జున్ ఫుల్ గా క్లాస్ తీస్కున్నాడు.

అర్జున్ త‌దుప‌రి `సందీప్ పిర్ పింకీ ఫరార్` లో కనిపించనున్నాడు. దీనిలో అతను పరిణీతి చోప్రాతో స్క్రీన్ స్పేస్ పంచుకున్నాడు. సైఫ్ అలీ ఖాన్ -జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌లతో భూత్ పోలీస్ లోనూ న‌టించాడు. అతను నెట్‌ఫ్లిక్స్  సిరీస్ లోనూ న‌టిస్తున్నాడు. జాన్ అబ్రహం- అదితి రావు హైద‌రి- నీనా గుప్తా- రకుల్ ప్రీత్ సింగ్ ఇందులో కోస్టార్లుగా నటించనున్నారు.

ఇక మ‌లైకా విష‌యానికి వ‌స్తే.. టీవీ రియాలిటీ షో ఇండియా బెస్ట్ డాన్సర్ లో కొరియోగ్రాఫర్లు గీతా కపూర్- టెరెన్స్ లూయిస్ ‌లతో పాటు మలైకా అరోరా న్యాయమూర్తులలో ఒకరిగా కనిపించారు. ప్ర‌స్తుతం ప‌లు వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టిస్తూ బిజీగా ఉన్నారు. సైఫ్ త‌దుప‌రి ప్ర‌భాస్ ఆదిపురుష్ 3డిలో న‌టించ‌నున్న సంగ‌తి తెలిసిన‌దే.
Tags:    

Similar News