బ‌న్నిలాగా క‌ద‌లాల‌న్న‌ బాలీవుడ్ మెరుపుతీగ‌

Update: 2020-12-12 12:58 GMT
బాలీవుడ్ స్టార్ హీరోల్లో మెరుపు తీగ‌ల్లా డ్యాన్సులాడే ట్యాలెంట్ హృతిక్ రోష‌న్.. టైగ‌ర్ ష్రాఫ్ కి ఉంది. అలాంటి స్టార్లు మ‌న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డ్యాన్సుల‌కు వీర లెవ‌ల్ ఫ్యాన్స్ అయ్యారంటే అర్థం చేసుకోవాలి.

స్టైలిష్ స్టార్ డ్యాన్స్ మూవ్ మెంట్స్ కి వ‌ర‌ల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఉన్నా స్టార్ హీరోల్లో ఫాలోవ‌ర్స్ ఉండ‌డం అన్న‌ది ఆస‌క్తిక‌రం. తాజాగా బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ బ‌న్నిపై అభిమానం చాటుకున్నాడు. నేను అల్లు అర్జున్ లాగా కదలా(డ్యాన్సుల్లో)లని కోరుకుంటున్నాను అంటూ ఓ అభిమాని ఇన్ స్టా ప్ర‌శ్న‌కు స‌మాధాన‌మిచ్చారు టైగ‌ర్.

న‌వ‌త‌రంలో టైగ‌ర్ ష్రాఫ్ ట్యాలెంట్ గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. హృతిక్ త‌ర్వాత మ‌ళ్లీ అంత గొప్ప‌ ఫిట్నెస్ ఔత్సాహికుడు.. అంత‌టి డ్యాన్సింగ్ ట్యాలెంట్ ఉన్న స్టార్. అత‌డు అల్లు అర్జున్ అభిమాని. అతను బ‌న్ని లాగా కదలాలని కోరుకోవ‌డం అల్లు వార‌సుడికి ఇచ్చిన అరుదైన గౌర‌వం అనే చెప్పాలి.

మొద‌టి క్ర‌ష్ గురించి ప్ర‌శ్నిస్తే.. `నా హిస్ట‌రీ టీచ‌ర్` అంటూ చెప్పుకొచ్చిన టైగ‌ర్ `మీ వ్యసనం ఏమిటి?` అన్న ప్ర‌శ్న‌కు.. ``నా కుటుంబం.. జీవితం కాకుండా.. నేను నా ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నాను. శిక్షణ ఇవ్వడానికి ఇష్టపడతాను`` అని చెప్పాడు. ష్రాఫ్ బోయ్ త‌దుప‌రి గ`‌ణ‌ప‌థ్` అనే చిత్రంలో భీక‌ర‌మైన యాక్ష‌న్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఈ మూవీ షూటింగ్ 2021 లో ప్రారంభమవుతుంది. ఈ చిత్రం ఫ్రాంచైజ్ లో మొదటిది. సీక్వెల్స్ కూడా తెర‌కెక్కించ‌నున్నార‌ట‌. హీరో పంతి సీక్వెల్లోనూ టైగ‌ర్ న‌టించ‌నున్నాడు.
Tags:    

Similar News